బొబ్బిలి, మార్చి 3: మద్రాస్ తెలుగు అకాడమీ, భారత కల్చరల్ ఇంటిగ్రేషన్ కమిటీ (బిసిఐసి) సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు తాత వెంకట కామశాస్ర్తీ(84) చెన్నైలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 2009లో చెన్నై ఎయిర్‌పోర్టులో కాలుజారి పడిపోయిన శాస్ర్తీ అప్పటి నుండి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 10.30 నిమిషాలకు కన్ను మూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. టివికె శాస్ర్తీ పుట్టిపెరిగింది ఒరిస్సా రాష్ట్రం అయినప్పటికీ బాల్యం అంతా విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోనే గడిపారు. 30 సంవత్సరాల వయస్సులోనే ఉమ్మడి మద్రాసు ముఖ్యమంత్రి రాజా ఆర్‌ఎస్‌ఆర్‌కె రంగారావువద్ద పనిచేశారు. 1981లో మద్రాసు తెలుగు అకాడమీ, భారత కల్చరల్ ఇంటిగ్రేషన్ కమిటీలు ఏర్పాటు చేసి సంగీత, సాహిత్య, కళల అభివృద్దికి ఎంతో కృషిచేశారు.
మద్రాస్ తెలుగు అకాడమీ, భారత కల్చరల్ ఇంటిగ్రేషన్ కమిటీ (బిసిఐసి) సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు తాత వెంకట
english title:
tvk
Date:
Tuesday, March 4, 2014