బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 3: ఈత కోసం వెళ్లి నదిలో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు సోమవారం ఉదయం పెన్నా ఒడ్డున లభ్యమయ్యాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగుకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఆదివారం పెన్నా నదిలో సరదాగా ఈతకు వెళ్లారు. అందులో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదివారం బాగా పొద్దుపోయే వరకు గాలించినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. మళ్లీ సోమవారం ఉదయం నది ఒడ్డుకు వెళ్లి గాలించగా 7వ తరగతి విద్యార్థి చక్రి, ఇంటర్ విద్యార్థి ప్రసాద్ మృతదేహాలు లభ్యమయ్యాయి. వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఊరి పెద్దల సమక్షంలో దామరమడుగు విఆర్‌ఓ శవపంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
ఈత కోసం వెళ్లి నదిలో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు సోమవారం ఉదయం పెన్నా ఒడ్డున
english title:
g
Date:
Tuesday, March 4, 2014