
మంత్రాలయం, మార్చి 3: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో సోమవారం గురుభక్తి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా రాఘవేంద్రస్వామి పట్ట్భాషేక మహోత్సవం నిర్వహించారు. స్వామి వారి బంగారు పాదుకలను స్వర్ణ సింహాసనంపై ఉంచి ముత్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బృందావనానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం మూలారాముల వారిని ఊరేగించారు. కార్యక్రమంలో మఠం పీఠాధిపతులు శ్రీ సుయతీంద్రతీర్థులు, ఉత్తరాధికారి సుభుధేంద్రతీర్థులు పాల్గొన్నారు.
....
స్వామివారి బంగారు పాదుకలకు ముత్యాలతో
అభిషేకం చేస్తున్న పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో సోమవారం గురుభక్తి ఉత్సవాలు ఘనంగా
english title:
m
Date:
Tuesday, March 4, 2014