
మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూపొందిస్తున్న ‘ఆగడు’ చిత్రానికి సంబంధించిన బళ్లారి షెడ్యూల్ పూర్తయింది. ఈనెల 10 నుండి హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- బళ్లారిలో ఒక పాటతోపాటుగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించి అక్కడ షూటింగ్ పూర్తిచేశామని, 10 నుండి హైదరాబాద్‌లో షెడ్యూల్ ప్రారంభించి షూటింగ్ చేయనున్నామని, సినిమా కథ అందరికీ నచ్చేలా రూపొందిందని తెలిపారు. దూకుడు కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంకోసం దర్శకుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని, తమన్ ఇస్తున్న సంగీతం కూడా అందరికీ నచ్చుతుందని, తమన్‌కి ఈ చిత్రం 50వ చిత్రం కావడం విశేషమని వారు తెలిపారు. తమన్నా తొలిసారిగా మహేష్‌బాబుతో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి రచన:అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, సంగీతం:తమన్, కెమెరా:కె.వి.గుహన్, ఎడిటింగ్:ఎం.ఆర్.వర్మ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీను వైట్ల.