
మురళీప్రసాద్.జి. దర్శకత్వంలో జైభవానీ ప్రొడక్షన్స్ పతాకంపై జె.ఆర్.పద్మిని రూపొందించిన చిత్రం ‘నాకంటు ఒకరు’. జె.పి.రమేష్ సమర్పణలో నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణసాయి, తామాక్షి జంటగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు లహరి మ్యూజిక్స్ ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆడియోసీడీని దర్శకుడు బి.గోపాల్ ఆవిష్కరించి తొలి కాపీని మయూరి సాంబశివరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు జి.మురళి ప్రసాద్ మాట్లాడుతూ- హీరోయిన్ ఓరియెంటెడ్ కథగా రూపొందిన ఈ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని, భర్తగా ఎవరిని ఎన్నుకోవాలి అని ప్రయత్నించే ఓ అమ్మాయి కథగా రూపొందించామని, అనేకమంది ఆమెకు ఎదురైతే ఏ ఒక్కరూ నచ్చకపోతే చివరికి, పెళ్ళే వద్దనుకున్న సమయంలో ఆమెను పెళ్లాడటానికి ముందుకొచ్చిన కథానాయకుడు కథ, ఆ తరువాత పరిణామాలు ఎలా సాగాయన్న కథనంతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుందని ఆయన తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను రూపొందించామని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు చిత్రాన్ని రూపొందించారని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తామని నిర్మాత జె.ఆర్.పద్మిని తెలిపారు. కార్యక్రమంలో సాయివెంకట్, కె.సురేష్‌బాబు, తామాక్షి, సాయి శ్రీనివాస్, జె.టి.ఆర్., వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అనంత్, జూ.రేలంగి, అలెక్స్, తాళ్ల కృష్ణ, తెనాలి రావు, సురేంద్ర, వెంకటేశ్వరరావు, శేఖర్‌బాబు, మాధవి, కాంచన, కావ్య, బేబి వైష్ణవి, కన్నమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:వెంకట్ చింతమళ్ల, సంగీతం:సాయి శ్రీనివాస్, ఎడిటింగ్:పి.సాయిశ్రీనివాస్, పాటలు:పైడిశెట్టి రాము, రామారావు, సూర్య, కృషివిజయ్, నిర్మాత:జె.ఆర్.పద్మిని, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జి.మురళీప్రసాద్