
మూన్‌లైట్ డ్రీమ్స్ పతాకంపై అక్కి విశ్వనాధరెడ్డి దర్శక నిర్మాతగా రూపొందిన చిత్రం ‘అడవి కాచిన వెన్నెల ’. అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 16న విడుదలకు ముస్తాబవుతోంది. ఈసందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో బేబి అక్కి పాల్గొని, ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దర్శక నిర్మాత అక్కి విశ్వనాధరెడ్డి మాట్లాడుతూ- చిత్ర యూనిట్ అందించిన సహకారంతో ఈ సినిమా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దామని, మొదటినుండి చివరివరకూ సినిమాకు బ్యాక్‌బోన్‌లా హలీమ్‌ఖాన్ కష్టపడ్డారని, సినిమా అద్భుతంగా వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ నెల 16న ఆడియో విడుదల చేసి అదే రోజు సినిమా విడుదల తేదీ కూడా ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఓ వైవిధ్యమైన సరికొత్త కథాంశంలో కథానాయిక పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందని, దర్శకుడు చిత్రాన్ని చక్కగా చిత్రీకరించారని, ఈ సినిమా కథ ఓ సరికొత్త జోనర్‌లో నిలుస్తుందని కథానాయకుడు అరవింద్ కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో మీనాక్షీ దీక్షిత్, బేబి అక్కి, హలీమ్‌ఖాన్, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.