Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

14న ‘ముద్దుగా’

$
0
0

విక్రాంత్, పల్లవి ఘోష్ ప్రధాన తారాగణంగా 24 క్రాఫ్ట్స్ పతాకంపై వి.సతీష్‌కుమార్ దర్శకత్వంలో సి.వి.రెడ్డి రూపొందించిన చిత్రం ‘ముద్దుగా’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలతోపాటుగా సెన్సార్ కూ డా పూర్తిచేసుకుంది. ఈనెల 14న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సతీష్‌కుమార్ మాట్లాడుతూ- ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా మొదటినుండీ చివరివరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, రొమాంటిక్ కామెడీతోపాటుగా కుటుంబ విలువలు కూడా సినిమాలో ఉంటాయని తెలిపారు. ఇటీవల విడుదలైన పాటలు అచ్చతెలుగు సాహిత్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా తీర్చిదిద్దామని తెలిపారు. సెన్సార్‌వారు చూశాక క్లీన్ యు సర్ట్ఫికెట్ అందించారని, హైదరాబాద్, వైజాగ్, అరకులో షూటింగ్ చేసిన ఈ చిత్రం ఆనంద్, ఉయ్యాల జంపాల తరహాలో ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. కామెడీ, సీరియస్, లవ్, బ్రేకప్ లాంటి అన్ని అంశాలతో రూపొందిన ఈ చిత్రం చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారని, అందరూ కొత్తవాళ్లునటించిన ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుందని హీరో విక్రాంత్ తెలిపారు. కార్యక్రమంలో చంటి రామకృష్ణారెడ్డి, జానకిరామ్.ఆర్., కృష్ణగోవర్థన్ చిత్ర విశేషాలను తెలిపారు.

విక్రాంత్, పల్లవి ఘోష్ ప్రధాన
english title: 
muddugaa

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>