మగధీర అద్భుత విజయం, ఆరెంజ్ అట్టర్‌ఫ్లాప్ తరువాత రామ్‌చరణ్‌కు ప్రతిష్టాత్మకంగా తయారైన ప్రాజెక్ట్ ‘రచ్చ’ ఈ వారం విడుదలయింది. ఏ థియేటర్‌కు వెళ్లినా రచ్చే కనిపిస్తుందా అన్నంతగా దీన్ని విడుదల చేసారు. సినిమాకు చేసిన హైప్ మేరకు కలెక్షన్లూ వున్నాయి. కానీ సినిమా మాత్రం అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి. అభిమానులకు కన్నుల విందుగానే వున్నా, సినిమా ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపర్చలేకపోవడంతో వారం పూర్తయ్యేసరికి చాలా థియేటర్లను నుంచి సినిమా పక్కకు తప్పుకుంది. అయితే దగ్గర్లో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం దీనికి ప్లస్‌గా మారవచ్చు. మరోపక్క గతవారం విడుదలయిన త్రీ ట్రేడ్ చార్ట్ నుంచి పక్కకు తప్పుకున్నట్లే. లవ్లీ స్టడీగా ముందుకుసాగుతోంది. ఈ సినిమాకు క్లీన్ ఇమేజ్ రావడం ప్లస్సయింది. వచ్చేవారం బాలకృష్ణ అధినాయకుడు థియేటర్లలోకి రావచ్చు. మరోపక్క తేజ కొత్త సినిమా కూడా వుంది. వేసవిలో బాక్సాఫీస్ మెల్లమెల్లగా వేడెక్కుతోంది.
మగధీర అద్భుత విజయం, ఆరెంజ్ అట్టర్‌ఫ్లాప్ తరువాత
english title:
trade talk
Date:
Friday, April 13, 2012