తెలుగు సినిమాకు అవార్డులు రావు. మంచి సినిమాలు తీస్తే జనాలు చూడరు అని డిసైడైపోయిన కాలం ఇది. అయినా తమ వంతు ప్రయత్నం చేయాలనుకునే వాళ్లు కొందరుంటారు. అలాంటి వాళ్లలో ఒకరు జనార్ధన్ మహర్షి. సినిమా రంగానికి సంబంధించినంత వరకు హాస్య సినిమాల రచయితగా ముద్రపడ్డా, సీరియస్ రచనలు చేసిన, చేయగలిగిన రచయిత. ఆయన తన నవల ‘గుడి’ని దిగ్ధర్శకుడు విశ్వనాథ్, విఖ్యాత గాయకుడు ఎస్పీ బాలు, ఆమనిలతో సినిమాగా మలిచారు. ఈ ప్రయత్నంలో దర్శకుడిగా, నిర్మాతగా అవతారమెత్తారు. దేవస్థానం చిత్ర విడుదల సందర్భంగా ఆశ,అనుభవం,అన్నీ ఆయన మాటల్లోనే...
‘ఇంటర్ చదువుతున్నపుడు అనుకుంటా, సాగరసంగమం సినిమా వచ్చింది. ఎప్పటికైనా ఇలాంటి సినిమా ఒకటి తీయగలమా..లేదు. ఎవరూ తీయలేరు. కనీసం విశ్వనాథ్ లాంటి గొప్ప దర్శకుడితో కలిసి పనిచేయగలమా? ఏమో. ఎక్కడో ఆశ. కుర్రవయసు కదా. సరే సినిమాల్లోకి వచ్చిపడ్డాను. ఇవివి. శివనాగేశ్వరరావు తదితరులతో సహవాసం. సినిమాలు. అన్నీ కామెడీనే. జనార్ధన్ మహర్షి అంటే హాస్య సినిమాల రచయిత. మంచిదే ఏదో ఒక పేరు. ఊరికే వస్తుందా. ఇవివితో 20 సినిమాల పయనం. హ్యాపీయే. కానీ ఇంటర్ నాటి కల. ఆశ. అలాగే వుంది. అందుకే ‘గుడి’ నవల రాసా. తీస్తే ఎప్పటికైనా విశ్వనాథ్‌తో సినిమా తీయాలి. రాసేటప్పుడే డిసైడైపోయా. అందులో కీలక పాత్ర పేరు అప్పుడే విశ్వనాథ్ అని పెట్టేశా. కానీ సినిమా తీయడం అంటే మాటలా. విశ్వనాథ్ గారికి నవల ఇచ్చా. చదివారు. ఆ తరువాత చాన్నాళ్లకు అనుకుంటా, సినిమా ఇలా...అంటూ చెప్పా. ఊ కొట్టారు. ఇక్కడ మరో సంగతి, బాలు అంటే నాకు హిమాలయమంత గౌరవం. ఆ ఇద్దరితో కలిసి, గుడి లాంటి సినిమా అంటే ఏ నిర్మాత ముందుకు వస్తారు. పాతికేళ్ల క్రితమైతే, ఎవరో ఒకరు ధైర్యం చేసేవారేమో. కానీ సబ్జెక్ట్ రైటో,రాంగో అన్నది పక్కనపెడితే, టైమ్ రైటా..రాంగా అన్నది డిస్కషనుకొస్తుంది. అందుకే ఎవర్నీ అడగదల్చుకోలేదు. నేనే ధైర్యం చేసా. విశ్వనాథ్, ఎస్పీబీ షూటింగ్‌కు వస్తే, పాత్రల్లో ఒదిగిపోయేవారు. ఇదిలా..అదిలా ఎందుకని ఏ రోజూ అడగలా. వీణాపాణి, మంచి విద్వత్ వున్నవాడు. సరైన బ్రేక్ దొరకని వాడు మంచి పాటలు అందించాడు. మొత్తానికి సినిమా పూర్తయింది. కొంచెం కష్టంగా, కొంచెం ఆనందంగా వుంది. స్టేట్స్‌కు వెళ్లాం. సినిమా చూసి అక్కడి మనవాళ్లు మైమరిచిపోయారు. సినిమా పూర్తయ్యాక లేచి, చప్పట్లు కొట్టారు. ఎంత ఆనందమేసిందో. ఇక్కడవాళ్లు ఏమన్నా తక్కువ తిన్నారా..నాకు నమ్మకముంది వాళ్లకీ నచ్చుతుంది. ఒక్కటే చెబుతాను..మంచి సినిమా చూసే ఉద్దేశం వుంటే ‘దేవస్థానం’ చూడండి. పురాతన దేవస్థానాలన్నింటికీ ఆదరణ పెరుగుతోంది. మరి నా దేవస్థానం కూడా అటువంటి ఆదరణకు నోచుకుంటుందనే ఆశ. చూదాం... ఇదీ జనార్దన మహర్షి అంతరంగం.
తెలుగు సినిమాకు అవార్డులు రావు. మంచి సినిమాలు
english title:
devasthanam
Date:
Thursday, April 12, 2012