విజయవాడ, మార్చి 10: రాష్ట్ర విభజన నదీజలాలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. కృష్ణాడెల్టా ప్రజల చిరకాల కోరికైన పులిచింతల ప్రాజెక్టు ఇటీవలే ప్రారంభోత్సవానికి నోచుకుంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల అదనంగా ఒక ఎకరా ఆయకట్టుకు కూడా సాగునీరు లభించే అవకాశం లేదు. అయితే 13లక్షల ఎకరాల కృష్ణాడెల్టా ఆయకట్టు స్థిరీకరణకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు 13వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. సముద్రంలో వృథాపోయే నీటిని కనీసం 40 టిఎంసిల మేర నిల్వ చేయాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. వరదల సమయంలోనేకాక సాధారణంగా నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పాదన జరిగే సమయంలో కూడా నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లటం జరుగుతూ వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల అలా వృథాపోయే నీటిని నిల్వ చేసుకుని ఖరీఫ్ సీజన్‌లో నిర్ణీత సమయానికి డెల్టా కాలువలకు సాగునీరందించే అవకాశం లభించింది. దీనిపై 140 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు ఉద్దేశించిన జల విద్యుత్ ప్రాజెక్టు నల్గొండ జిల్లా పరిధిలో ఉంది. విభజన వల్ల తెలంగాణ విద్యుత్ అవసరాలకు ఉత్పాదన ప్రారంభిస్తే విలువైన నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. దీనివల్ల పులిచింతల ప్రాజెక్టు లక్ష్యం ఏమాత్రం నెరవేరబోదనేది అక్షర సత్యం.
రాష్ట్ర విభజన నదీజలాలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. కృష్ణాడెల్టా ప్రజల చిరకాల కోరికైన పులిచింతల ప్రాజెక్టు
english title:
v
Date:
Tuesday, March 11, 2014