తిరుపతి, మార్చి 10: బిజెపి ఆధ్వర్యంలో ఏర్పడబోయే ప్రభుత్వం సీమాంధ్ర అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తుందని బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం తిరుపతిలో బిజెపి నిర్వహించిన ‘మోడి ఫర్ పిఎం’ బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. రేణిగుంట విమానాశ్రయం నుండి సభా ప్రాంగణం వరకూ కార్లు, ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో వెంకయ్యనాయుడు సుమారు ఒకటిన్నర గంట పాటు ప్రసంగించారు. తన భాష, యాస, పదాల ప్రాస వాగ్ధాటితో పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచారు. సభికులను మంత్ర ముగ్ధుల్ని చేశారు. కాంగ్రెస్ అరాచకాలన్ని ప్రజలకు వివరించే ప్రయత్నంలో వెంకయ్యనాయుడు సఫలీకృతులయ్యారు. దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు వచ్చాయంటే ఆ పార్టీ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతుందన్నారు. ఆధార్ పేరుతో సామాన్యులను సైతం అవస్థలకు గురిచేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. యావత్‌దేశం కాంగ్రెస్‌ను ఇంటికి పంపించేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. ఓట్లు, సీట్లు కోసం కాంగ్రెస్ చేయని తప్పిదం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో డాలర్ విలువ ఎక్స్‌లేటర్‌పై వెళుతుంటే రూపాయి వెంటిలేటర్‌లో ఉన్నట్టుందన్నారు.
కాంగ్రెస్సే మమ్మల్ని వదిలేసింది
సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను గంగలో కలిపి అడ్డదారిలో, అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ తెగపడిందని బిజెపి నాయకురాలు పురంధ్రీశ్వరి విమర్శించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడానని, 10 ఏళ్ల పాటు మంత్రి పదవిని అనుభవించి పార్టీకి ద్రోహం చేశానని జైరాం రమేష్‌వంటి వారు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ను తాము వీడలేదని తమను కాంగ్రెస్ పార్టీనే వదిలేసిందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, గల్లా, జెసి దివాకర్‌రెడ్డి వారు పార్టీ వీడి తలోదారి వెతుక్కున్నారన్నారు.బిజెపి వల్లేతంగా సీమాంధ్రకు ప్యాకేజి లభించిందన్నారు.
బిజెపి ఆధ్వర్యంలో ఏర్పడబోయే ప్రభుత్వం సీమాంధ్ర అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తుందని బిజెపి మాజీ
english title:
s
Date:
Tuesday, March 11, 2014