నిజామాబాద్, మార్చి 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పొందుపర్చిన మేరకు పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంధ్రలో కలుపుతామని, ఈ నెల 20వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్మ్రేష్ స్పష్టం చేశారు. ఆర్డినెన్స్‌ను జారీ చేసే సమయంలో తాము రాష్టప్రతిని కలిసి పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపవద్దని కోరామని, దీంతో ముంపు గ్రామాలను కోల్పోయే ప్రమాదం తప్పిందంటూ తెరాస అధినేత కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మంత్రిపైవిధంగా పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్‌లో విలేఖరుల తో మాట్లాడుతూ భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఏడు మండలాలు ఖమ్మం జిల్లా నుండి విడిపోయి సీమాంధ్రలోని తూర్పు గోదావరి జిల్లాలో కలుస్తాయన్నారు. 1959కి పూర్వం పై ప్రాంతాలు తూ.గో జిల్లాలోనే ఉండేవని గుర్తు చేశారు. ఇక సామాజిక న్యాయం కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి పదవిని దళిత వర్గానికి చెందిన వారే చేపడతారని ప్రకటించారు. యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, యువనేత రాహుల్‌గాంధీ సైతం తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల నుండి కొత్త నాయకత్వం రావాలని అభిలషిస్తున్నారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల చేతిలో అధికారం ఉన్నప్పుడే తెలంగాణకు సామాజిక న్యాయం జరిగినట్లవుతుందని, దీనిని ఇతరులెవరూ హైజాక్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అది అమలయ్యేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఇదే విషయాన్ని తాను ఇటీవల టిజెఎసి చైర్మన్ కోదండరాంతో భేటీ అయినప్పుడు హితవు పలికానన్నారు. రాజ్యసభలో టి.బిల్లు చర్చకు వచ్చినప్పుడు బిజెపి నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ అడ్డుకునే ప్రయత్నాలు చేశారని, అయినప్పటికీ బిజెపితో సహా ఇతర పార్టీలను నచ్చజెప్పి, సంతృప్తిపర్చి మద్దతును కూడగట్టామని గుర్తు చేశారు. పార్లమెంటులో టి.బిల్లు ఆమోదం పొందడంలో టిఆర్‌ఎస్ పోషించిన పాత్ర శూన్యమేనని అన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న స్థానికేతరులకు వారి భద్రత విషయమై భరోసా కల్పించేందుకే శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించామన్నారు. ఈ విషయమై అనవసర ఆందోళనకు గురికావడం తగదని, శాంతిభద్రతలపై గవర్నర్‌కు కేవలం బాధ్యతలు అప్పగించామే తప్ప వాటిని అధికారాలుగా భావించకూడదని సూచించారు.్భయాలను పారదోలేందుకే జిహెచ్‌ఎంసి పరిధిలో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడే సిఎం: జైరామ్ రమేష్
english title:
t
Date:
Tuesday, March 11, 2014