హైదరాబాద్, మార్చి 18: ఆంధ్రా పార్టీలు హటావో తెలంగాణ బచావో అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తారక రామారావు తెలంగాణ ప్రజలకు పిలుపు ఇచ్చారు. జనసేన సభలో పవన్ కల్యాణ్ కాంగ్రెస్‌కో హటావో దేశ్‌కో బచావో అని పిలుపు ఇచ్చారని, అలానే మనం ఆంధ్రా పార్టీలు హటావో, తెలంగాణ బచావో అనే నినాదం ఇద్దామని అన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు తమ అనుచరులతో పాటు మంగళవారం తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తారక రామారావు, కెఎస్ రత్నం మాట్లాడారు. కెసిఆర్‌ను తిడితే ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు ఓట్లు పడతాయని చంద్రబాబు కలలు కంటున్నారని అన్నారు. టిఆర్‌ఎస్ సాగించిన ఉద్యమం వల్ల తెలంగాణ సాకారం అయిందని, బంగారు తెలంగాణ సాధించుకుందామని కెటిఆర్ అన్నారు. తెలంగాణ రాదు అనే ఉద్దేశంతో చంద్రబాబు తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ ఇచ్చారని, తీరా తెలంగాణ సాకారం అయ్యే సమయంలో ఆపడానికి జాతీయ నాయకులందరినీ కలిసి తీవ్రంగా ప్రయత్నించారని ఎమ్మెల్యే రత్నం విమర్శించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రా నాయకులు ఏకమయ్యారని, అలానే తెలంగాణ రక్తం మనలో ప్రవహిస్తే తెలంగాణ నాయకులంతా ఏకం కావలసిన అవసరం ఉందని రత్నం అన్నారు.
ఎమ్మెల్యే కెటిఆర్ పిలుపు
english title:
ktr
Date:
Wednesday, March 19, 2014