Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఓటర్లకు ఇబ్బందులు ఉండకూడదు

$
0
0

సామర్లకోట, మార్చి 19: ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులులేకుండా తగు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఇ సత్యనారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన సామర్లకోట మున్సిపాల్టీలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను ఆకస్మికంగా పరిశీలించారు. తొలుత ఆయన స్థానిక మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసి మున్సిపల్ ఎన్నికల అధికారి, కమిషనర్ జ్యోతుల నాగేంద్రప్రసాద్, మున్సిపల్ ప్రత్యేకాధికారి, కాకినాడ ఆర్డీవో బిఆర్ అంబేద్కర్‌లతో పోలింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం ఆయన పట్టణ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, స్థానిక అధికారులకు పలు సూచనలిచ్చారు. స్థానిక కొవ్వూరి బసివిరెడ్డి సత్రం, బచ్చుపౌండేషన్ హైస్కూల్, తోటగోపాలకృష్ణ హైస్కూల్, బిబిఆర్ మున్సిపల్ హైస్కూల్ వద్ద గల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల అధికారి జ్యోతుల నాగేంద్రప్రసాద్, డిఇ చుక్కా శ్రీనివాసరావు, ఎఇలు కె సత్యనారాయణ, సిహెచ్ కృష్ణమూర్తి, ఎస్సై ఎండిఎమ్మార్ ఆలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.
తిరుగుబా(పో)టు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, మార్చి 19: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియటంతో టిక్కెట్టు దక్కని అభ్యర్ధులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. టిక్కెట్లు ఆశించి భంగపడ్డ అభ్యర్ధులు ఇండిపెండెంట్లుగా పోటీలో నిలబడి, తిరుగుబాటు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. చాలా కాలంగా పార్టీలో ఉండి, జెండాను మోస్తున్న తమను కాదని, కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చారన్న ఆగ్రహంతో జిల్లాలోని కొన్ని ములిపాలిటీల్లో వైకాపా నాయకులు, కార్యకర్తలే ఆపార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తుండటంతో ఆ పార్టీకి పెద్దగా తిరుగుబాటు తలపోటు కనిపించటం లేదు. కొన్ని స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్ధులు రంగంలో ఉన్నప్పటికీ, అంతగా ప్రభావం చూపించే పరిస్థితి లేదు. దాంతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకే ఎక్కువ వెనుపోట్లు తగిలేలా ఉన్నాయి. తిరుగుబాటు అభ్యర్ధులు తాము గెలవాలన్న లక్ష్యంతో కన్నా, వైకాపా అభ్యర్ధులను ఓడించాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఇది వైకాపా విజయావకాశాలపై పెద్ద ప్రభావాన్ని చూపించేలా ఉంది.
రాజమండ్రి కార్పొరేషన్‌లో వైకాపా టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారిలో చాలా మంది మాజీ కార్పొరేటర్లు, వైకాపా ముఖ్యనాయకుల అనుచరులు ఉండటంతో తాజా పరిణామాల్లో వారంతా తిరుగుబాటు అభ్యర్ధులుగా రంగంలో దిగుతున్నారు. సుమారు 25వార్డులపై బలమైన ప్రభావాన్ని చూపించే విధంగా వైకాపా తిరుగుబాటు అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 25వార్డుల్లో వైకాపా అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలుచేసి, బి ఫారాలు సమర్పించలేకపోవటంతో ఇండిపెండెంట్లుగా పోటీచేస్తున్న వీరంతా తమ గెలుపు కన్నా, వైకాపా అభ్యర్ధులను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. వీరంతా బుధవారం రాజమండ్రిలో సమావేశమై వైకాపా అభ్యర్ధులను ఓడించాలని తీర్మానం చేసుకున్నారంటే వైకాపాకు తిరుగుబాటు అభ్యర్ధుల తలపోటు ఎంత తీవ్రంగా ఉందో అర్ధంచేసుకోవచ్చు. మేయర్ టిక్కెట్టును ఆశించి భంగపడ్డ వైకాపా సీనియర్ నాయకుడు టికె విశే్వశ్వరరెడ్డిని పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ, ఆయన సతీమణి ఉమామహేశ్వరి మాత్రం వైకాపా అభ్యర్ధిగా 42వార్డు నుండి పోటీచేస్తున్నారు. ఒకపక్క ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని తన సతీమణి గెలుపుకోసం ప్రచారం చేస్తున్న టికె, మరోవైపు వైకాపా నాయకులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. నగరంలోని మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, బొమ్మనమైన శ్రీనివాస్, నల్లా రామాంజనేయులు తదితరులతో పాటు, పార్టీ సీనియర్ కార్యకర్తలంతా నాయకత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి చేరిన వారికే టిక్కెట్లు ఇచ్చారని, వైకాపా కార్యకర్తలుగా ఇంత కాలం పనిచేసిన వారికి టిక్కెట్లు ఇవ్వలేదంటూ నాయకులందరిపైనా ద్వితీయశ్రేణి నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే వైకాపాలోని కొంత మంది నాయకులే తమ వర్గానికి చెందిన ద్వితీయశ్రేణి నాయకులను రెచ్చగొట్టి ఇలాంటి రగడ సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నాటికి వర్గపోరు మరింత ముదిరి పార్టీని మరింత రోడ్డున పడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మోపెడ్‌ను ఢీకొన్న ట్రాలీ లారీ
ముగ్గురు మృత్యువాత
కాకినాడ రూరల్, మార్చి 19: కాకినాడ రూరల్ మండలం వాకలపూడి బీచ్ రోడ్డు టి. జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీ ట్రాలీ ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. కాకినాడ పోర్టు నుండి ఖాళీగా వస్తున్న 12 చక్రాల ట్రాలీ కోరమాండల్ కర్మాగారం టి. జంక్షన్ వద్దకు వచ్చేసరికి బీచ్ నుండి మోపెడ్‌పై వస్తున్న ముగ్గురు విద్యార్థులను ఎదురుగా ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో విద్యార్థి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుల్లో కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని రాజేంద్రనగర్‌కు చెందిన కాండ్రకోట కల్యాణ్‌కుమార్ (18), సవరపు దిలీప్ (19), మాదాటి దుర్గాప్రసాద్ (17) వున్నారు. కల్యాణ్‌కుమార్, దుర్గాప్రసాద్‌లు పిఠాపురంలోని ఆర్‌ఆర్‌బిహెచ్‌ఆర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు. కాకినాడలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేసే దిలీప్‌తో వీరిద్దరూ కలిసి మధ్యాహ్నం బీచ్‌కు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే సర్పవరం సిఐ జి. రత్నరాజు, ఎస్సై ప్రసన్నకుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలు రెండూ గుర్తుపట్టని విధంగా నుజ్జునుజ్జయి చెల్లాచెదురుగా పడివున్నాయి. ప్రమాదస్థలిలో లభించిన ఆధారాలను బట్టి బంధువులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన కల్యాణ్‌కుమార్ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు.మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ రత్నరాజు తెలిపారు.

ఇదేం పద్ధతి
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, మార్చి 19: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించేందుకు బుధవారం అమలాపురం వచ్చిన వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీకి చెందిన బాధ్యులపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మీకు ఇష్టమొచ్చిన వారికి పార్టీ టిక్కెట్లు ఇష్టారాజ్యంగా ఇచ్చేసి పార్టీని నాశనం చేస్తారా, కనీసం నామినేషన్ పత్రాలు పూర్తిచేయటం రాని వారికి కూడా టిక్కెట్లు ఇచ్చేస్తారా అంటూ పార్టీ ముఖ్యనాయకులపై జగన్ మండిపడినట్టు స మాచారం. రాజమండ్రి పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత అమలాపురం చేరుకున్న జగన్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఇంట్లో విశ్రమించారు. బుధవారం ఉదయమే జిల్లా నాయకులతో సమావేశమైన జగన్ పార్టీ పరిస్థితి, అభ్యర్థుల ఎంపికలో తలెత్తిన పరిణామాలపై చర్చించారు. అభ్యర్థుల ఎంపిక ఏ ప్రాతిపదికన చేశారు. అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వలేదు. బిసిలలో ఒక వర్గానికి మినహా ఇతరులకు ఎందుకు ప్రాధాన్యత కల్పించలేదు. ‘మీ అనుచరుడొకరు అభ్యర్థులజాబితా తయారుచేశాడట, అతనికి పార్టీని రాసిచ్చేసారా అంటూ ఒక ముఖ్యనాయకునిపై జగన్ తీవ్రంగా మండిపడినట్టు సమాచారం. ఒకే కుటుంబంలో భార్యాభర్తలకు ఎందువల్ల టికెట్లు ఇవ్వాల్సి వచ్చిందని నిలదీసినట్టు తెలిసింది. నామినేషన్ పత్రాలు కూడా సరిగ్గా భర్తీచేయడం రాని వారికి టికెట్లు ఎలా ఇచ్చారని మండిపడినట్టు సమాచారం. తాను రోడ్ షో నిర్వహించడానికి వస్తున్నందున జనసమీకరణ చేసి ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లాల్సి ఉండగా మీలో మీరే విబేధాలతో ఎందుకు తరచూ రోడ్డెక్కుతున్నారని ముఖ్యంగా ముగ్గురు నాయకులను ఉద్దేశించి జగన్ మండిపడినట్లు సమాచారం.

అమలాపురం లోక్‌సభకు విశ్వరూప్,
ముమ్మిడివరం అసెంబ్లీకి సాయి
-అభ్యర్థిత్వాలు ప్రకటించిన జగన్
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, మార్చి 19: అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా పినిపే విశ్వరూప్‌ను పోటీకి నిలుపుతున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. బుధవారం రాత్రి ముమ్మిడివరంలో జరిగిన వైసిపి ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా గుత్తుల సాయిలను పోటీకి నిలుపుతున్నానని, ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విశ్వరూప్, గుత్తుల సాయి పేర్లు ప్రకటించటంతో వారి అనుయాయుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
మూడో రోజు భారీగా నామినేషన్లు
-జడ్పీటీసీలకు 124, ఎంపిటిసిలకు 1871
-నేడు ఆఖరి రోజు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మార్చి 19: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం కొనసాగింది. ఒక్కరోజులోనే భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల నుండి జడ్పిటిసి స్థానాలకు బుధవారం 124 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో బిఎస్‌పి 5, బిజెపి 1, సిపిఐ 1, కాంగ్రెస్ 9, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 48, తెలుగుదేశం 66, ఇతర రిజిస్టర్డ్ పార్టీల నుండి 2, స్వతంత్ర అభ్యర్ధుల నుండి 13 వంతున నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 1871 నామినేషన్లు ఎంపిటిసి స్థానాలకు దాఖలయ్యాయి. ఇంతవరకు మొత్తం 146 జడ్పిటిసి, 2152 ఎంపిటిసి నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో 57 జడ్‌పిటిసి, 1063 ఎంపిటిసి స్థానాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం సాయంత్రంతో ముగుస్తుంది. చివరి రోజు కూడా భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్టు జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం సూర్యభగవాన్ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలియజేశారు. కాగా 21వ తేదీ ఉదయం 11 గంటల తర్వాత నామినేషన్‌లను పరిశీలిస్తారు. నామినేషన్‌ల తిరస్కరణకు సంబంధించి అప్పీళ్లుంటే ఈనెల 22వ తేదీన ఎన్నికల అధికారులైన ఆర్డీవోలకు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. అప్పీళ్లను ఈనెల 23వ తేదీ సాయంత్రం 5గంటలలోపు పరిష్కరిస్తారు. ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటలలోపు నామినేషన్‌లను ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్ధుల వివరాలను ప్రకటిస్తారు.

హెలెన్, లెహెర్ నష్టాల
పరిశీలనకు కేంద్ర బృందం పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, మార్చి 19: హెలెన్, లెహెర్ తుపాను నష్టాల అంచనాకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం బుధవారం జిల్లాలో పర్యటించింది. జిల్లాలోని కొత్తపేట, అంబాజీపేట, పి గన్నవరం తదితర ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఈ సందర్భంగా రాజమండ్రిలో కేంద్ర బృందం సభ్యులు విలేఖర్లతో మాట్లాడుతూ హెలెన్, లెహెర్ తుపాన్ల వల్ల ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ నష్టం సంభవించినట్టు రాష్ట్రప్రభుత్వం నుండి కేంద్ర హోంశాఖకు నివేదికలు అందాయన్నారు. రాష్ట్రప్రభుత్వం కేంద్ర హోంశాఖకు అందించిన నివేదిక ప్రకారం రూ.344కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం పంపిన నివేదికలోని అంశాలను స్వయంగా పరిశీలించేందుకే తమ బృందం వచ్చిందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఆలస్యంగా నివేదికను పంపటం వల్లే కేంద్ర ప్రభుత్వం అధికారుల బృందాన్ని పంపటంలో ఆలస్యమయిందని, ఇందులో కేంద్రప్రభుత్వం జాప్యమేమీ లేదని కేంద్ర బృందం సభ్యుడు డాక్టర్ పేర్ని గౌరీశంకరరావు చెప్పారు. రాష్ట్రప్రభుత్వం నుండి 15రోజుల క్రితమే కేంద్ర హోంశాఖకు నివేదిక అందిందన్నారు.

ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్
english title: 
o

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>