అడక: తమిళనాడులో తెలుగు బడుల సమస్య ఏమిటి?
దానికి పరిష్కారం ఏమిటి?
-్భమిడిపాటి భీమశంకరం, రాజమండ్రి
బదులు: సంయుక్త మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం, కర్ణాటక విడిపోయిన తర్వాత తమిళ ప్రాంతంగా మిగిలిన భాగంలో వేల సంఖ్యలో ఉన్న తెలుగు మాధ్యమ పాఠశాలలు ఇప్పుడు వందల సంఖ్యలోకి వచ్చేశాయి. మన రాష్ట్రం వలె తమిళనాడులో మూడు భాషలు నేర్చుకోవలసిన పద్ధతి లేదు. అక్కడ ఉన్నది ద్విభాషా సూత్రం. రెండేళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తమిళాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం చట్టాన్ని జారీ చేసింది. ఇప్పుడు తెలుగు మాధ్యమ బడులలో తమిళం, ఇంగ్లీషు మాత్రమే తప్పనిసరి కావడంతో తెలుగు తుడిచి పెట్టుకపోతున్నది. తెలుగు పాఠశాలల్లో తెలుగు తప్పనిసరిగా ఉండాలని, తమిళాన్ని కూడా నేర్చుకోవడానికి అభ్యంతరం లేదని తెలుగువారి వాదన- తమిళేతర మాతృభాషలకు సంబంధించిన వారు కోరేది త్రిభాషా సూత్రాన్ని.
తమిళనాడులో తెలుగు బడుల సమస్య ఏమిటి?
english title:
telugu schools in tamilnadu
Date:
Saturday, April 14, 2012