తేట తెలుగు పలకండి
ఆమెను బతికించండి
తిండిలేక నీరసించిపోతున్నది
ఎంగిలి పదాలు నచ్చక
నుడికారపు రుచులు లేక
ఆమె నోరు చవిచెడింది
ఆమె గొంతు బలహీనం అయింది
ఎండిపోతోంది ఆమె తల్లి పేగు
పిడికెడు అక్షరాలు ఎసరుపెట్టి
తేట తియ్యని తెలుగు పలుకులే పలకండి
‘అమ్మా’ అని పిలవండి!
అమ్మ భాషను బతికించండి!!
-బి.వి.ఎస్.ప్రసాద్, నెల్లూరు
పాఠాలుంటే బాగు
‘నుడి’లో వస్తున్న వ్యాసాలు, అడక-బదులు, మాటల మూటలు ఇతర అంశాలన్నీ బాగున్నాయి. మంచి తెలుగు మాటల్ని నేర్చుకొనేందుకు వీలైన - అందరికీ పనికొచ్చే పాఠాలు కూడా ఇస్తే బాగుంటుంది కదా.
-వి.నీహారిక, గుంటూరు
కవితలు కావాలి
‘నుడి’లో కొన్నాళ్లు కవితలు వేసేవాళ్లు. తర్వాత ఎందుకు మానేశారో తెలియదు. అప్పుడప్పుడైనా మంచి కవితల్ని వేస్తే బాగుంటుందేమో.
-కె.వి.నారాయణ, తిరుపతి
================
రచనలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003