హిందూపురం టౌన్, ఏప్రిల్ 15: వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్వ చ్ఛంద సంస్థలు, మీడియా తదితరుల సహకారంతో పోలియో నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని పల్స్‌పోలియో పర్యవేక్షణ అధికారి డాక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 98 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో 1988లో పోలియో నిర్మూలనకు ప్రపం చ ఆరోగ్య సంస్థ చర్యలు తీసుకుందన్నారు. అందులో భారతదేశంలో ప్రతియేటా రెండు విడతల్లో 1995 నుండి పోలియో చుక్కలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. గతంలో ఇండియా, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, నైజియాల్లో పోలియో మహమ్మారి ఉండేదన్నారు. ప్రస్తుతం ఆ జాబితా నుండి భారతదేశం పేరు తొలగించారన్నారు. 2008లో రాష్ట్రంలో చివరి పోలియో కేసు నమోదు కాగా అనంతపురం జిల్లాలో 2003లో నమోదైనట్లు తెలిపా రు. పోలియో వ్యాధి సంచార జాతు లు, వ్యవసాయ కూలీలు, తీర ప్రాంతా ల ప్రజల్లో ఎక్కువ కనిపిస్తోందన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలియోను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 98 వేల మంది చిన్నారులకు పోలియో చుక్క లు వేసేందుకు 63,700 పోలియో కేంద్రాలు, అదనంగా 1860 ప్రత్యేక బృందాలను బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, దేవాలయాలు, చర్చిలు, మసీదు ల వద్ద ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం జిల్లాలో 5,65,176 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 3,690 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో పోలియో వ్యాధి నిర్మూలనకు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో ఎంతో ఉంద న్నారు. ఇలాంటి సహకారం అందిస్తే వ్యాధిని సమూలంగా నిర్మూలించవచ్చన్నారు. సమావేశంలో జిల్లా ప్రభుత్వాసుపత్రుల కోఆర్డినేటర్ డాక్టర్ శివప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పోలప్ప, ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, జవహర్ బాల ఆరోగ్య రక్ష జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శివశంకర్ నాయక్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపథం పోస్టర్ విడుదల
అనంతపురం సిటీ, ఏప్రిల్ 15: ప్రజాసమస్యల పరిష్కారం కోసం జరుగనున్న ప్రజాపథం పోస్టర్‌ను ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ఛాంబర్‌లో కలెక్టర్ వి.దుర్గాదాస్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 15 నుండి మే 5వ తేది వరకు నిర్వహించనున్న ప్రజాపథం 2012 కార్యక్రమంలో భాగంగా పోస్టర్లను, బ్రోచర్లను ప్రచురించడం జరిగిందన్నారు. ప్రజా పథంలో ప్రాధాన్యత అంశాలైన మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, తాగునీరు, రైతులకు 7 గంటల విద్యుత్ సరఫ, ఆరోగ్య సంబందిత అంశాలు, పావల వడ్డీ అంశాలపై ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం తీసుకోవం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఎంపిడిఓలు పోస్టర్లు పంపిడం జరిగిందన్నారు.