నెల్లూరు , ఏప్రిల్ 15: దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఉన్నత విద్యాభ్యాసాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు కేటాయిస్తున్నదని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఆదివారం నెల్లూరు నగరంలో జరిగిన రజక సమాఖ్య కల్యాణ మండప నిర్మాణ శంకుస్థాపన, ప్రజాపథం బ్రోచర్ ఆవిష్కర కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించారు. కేవలం ఆరువందల కోట్ల రూపాయలతో 2008-09 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రస్తుత ఏడాది నాలుగువేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఈ నిధులతో రాష్టవ్య్రాప్తంగా 26 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుంటున్నారన్నారన్నారు. అనంతరం నగరంలోని వేణుగోపాలస్వామినగర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపథం కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ నెల్లూరు నగరపరిధిలో సమస్యల పరిష్కారానికి పాతిక కోట్లు కేటాయించామన్నారు. బిసి సంక్షేమ మంత్రి బసవరాజు ప్రజాపథం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. నెల్లూరులో బిసి విద్యార్థుల సంక్షేమం కోసం త్వరలో స్టడీ సర్కిల్ ఏర్పాటుచేయనున్నట్టుఆయన ప్రకటించారు.
ఆర్థిక మంత్రి ఆనం
english title:
fee reimbursement
Date:
Monday, April 16, 2012