ధర్మవరం, ఏప్రిల్ 15: రాయలసీమ అభివృద్దికోసం అనేక ఉద్యమాలు నిర్వహించిన బిజెపి 1986లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పుకోసం నందికొట్కూరు నుండి పోతిరెడ్డిపాడు దాకా పాదయాత్ర నిర్వహించిన ఫలితంగా వెడల్పుచేయడం జరిగిందని బిజెపి పట్టణ అధ్యక్షుడు శంకర చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, బిజెవైయం జిల్లా అధ్యక్షుడు బిల్లే రవీంద్ర తదితరులు తెలిపారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలోవారుమాట్లాడుతూ రాష్ట్రంలో జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 2014 మార్చి నాటికి నీటిపారుద ప్రాజెక్టు నిర్మాణాలకు రూ.1.24 లక్షల కోట్లు ఖర్చుచేసి కోటి ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తామని 2009లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఆర్భాటంగా ప్రకటించారని హామీ ఇచ్చినాలుగేళ్ళు పూర్తీకావస్తున్నా రూ.150కోట్ల ఖర్చు మాత్రం మిగిలిందని ధ్వజమెత్తారు. బడ్జెట్లో ఆయా ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు కేవలం పేరుకుమాత్రమే పరిమితం కావడం మూడు సంవత్సరాల బడ్జెట్ కేటాయింపులు ఇందుకు నిదర్శనమన్నారు. రెండు దశాబ్దాలుగా వేల కోట్ల రూపాయలుకేటాయించినా రాయలసీమకు ప్రాణదాతగా మిగిలిన గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు పూర్తీకాకపోవడం సీమ ప్రజల దురదృష్టకరమన్నారు. 25 యేళ్లుగా రాయలసీమ అభివృద్ది కుంటుపడిందని కేంద్ర, రాష్ట్ర కమిటీలు సీమ అభివృద్దికి నోచుకోలేదని స్పష్టంచేసినా పాలకులు దృష్టి సారించకపోవడం సీమపట్ల పాలకుల నిర్లక్షణకు నిదర్శనమన్నారు. యుద్ద ప్రాతిపదికన 2014 నాటికి హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులతోపాటు రాయలసీమలోని అన్ని జల ప్రాజెక్టులను పూర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చట్టా నారాయణస్వామి, ఉపాధ్యక్షులు బండారు బాలాంజినేయులు, డాక్టర్ నారప్ప చౌదరి, బిజెవైయం పట్టణ అధ్యక్షులు శంకర ఓబిలేసు, మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గుర్తింపులేని
పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
* ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి
పుట్టపర్తి, ఏప్రిల్ 15: రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులేని 3 వేల ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవడంతోపాటు విద్యాహక్కు చట్టాన్ని పకడ్భందీగా అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని జానకిరామయ్య పాఠశాలలో జరిగిన జిల్లా ఉపాధ్యాయ సంఘ సమావేశాంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పిల్లలందరికీ విద్యను అందించాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం విద్యాహక్కు చట్టం తీసుకువచ్చిప్పటికీ గతంలో అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం అమలు చేయడానికి ఇంతవరకు మండల స్థాయిలో అడ్‌హక్ కమిటీలు నిర్వహించలేదన్నారు. విద్యారంగం పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా 76 వేలుపైబడి వున్న పాఠశాలలో వౌలిక వసతుల కల్పనకోసం 16వేల కోట్లు అవసరంకాగా కేవలం రూ.4వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 1137 మండలాలకు గాను 950 మండలాల్లో ఎంఇఓ పోస్టులు ఖాళీగా వున్నాయని, 95 డిఇఓ పోస్టులు ఖాళీగా వున్నాని, 325 డైట్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా వున్నాయని వీటిని వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం గుర్తించిన 38, 355 ఉపాధ్యాయ పోస్టులను ఈ విద్యాసంవత్సరంలో నోటీఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల అనంతరం జిరో సర్వీసుతో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని సాధారణ బదిలీలతోపాటు అంతర్‌జిల్లాలు బదిలీ చేపట్టడానికి తగిన సవరణలు తీసుకురావాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 2013 నుంచి పదవ వేతన సంఘాన్ని నియమించి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కమిటీల నియామక జాప్యంవల్ల 9వ పిఆర్‌సిలతోనే దాదాపు 12 సంవత్సరాలు రోషనల్ ఇంక్రిమెంట్లు ఉద్యోగులు నష్టపోయారన్నారు. రాష్ట్రంలోని 14లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్‌దారులకు హెల్త్‌కార్డులను అందించాలని డిమాండ్ చేశారు. బడి మానేసిన పిల్లలను బడిలో చేర్పిచాలని బీహార్ రాష్ట్ర తరహాలో పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన బాలికల పేరిట రూ.10వేల బాండును ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు తగిన ప్రోత్సహ బహుతులను అందించాలని ఆయన కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఈనెల 22న హైదరాబాద్‌లో హెల్త్‌కార్డులపై జెఎసి సమావేశంలోచర్చించి భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలను నిర్ణయిస్తామన్నారు.
రాయలసీమ అభివృద్దికోసం అనేక ఉద్యమాలు నిర్వహించిన
english title:
s
Date:
Monday, April 16, 2012