పార్వతీపురం, ఏప్రిల్ 16: గిరిజన ప్రాంత సమస్యలు పరిష్కరించాలని పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని పలు గిరిజన గ్రామాల ప్రజలు సోమవారం ఐటిడిఎలోనిర్వహించిన గ్రీవెన్సులో ఎపివో వసంతరావును కోరారు. ఈ సందర్భంగా పాచిపెంట మండలంలోని మోదిగ పంచాయతీ లోవలస, మెట్టవలస, కొత్తాపురం, గల్లపాడు గ్రామాల్లో మట్టిరోడ్లు నిర్మాణం చేపట్టాలని ఆయా ప్రాంత గిరిజనులు ఐటిడిఎ ఎపిఒను కోరారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని కోనసింగి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. దుడ్డుఖల్లులోని గిరిజన సంక్షేమశాఖలోని పనిచేసిన వాటంటీర్లకు గౌవరవేతనం ఇవ్వాలని కోరారు. చాపరాయిగూడ, బొడ్డగాడిగూడ గ్రామాలకు లింకురోడ్లు వేయాలని ఆ ప్రాంతాలకు చెందిన గిరిజనులు కోరారు. స్థానికంగా నివాసం ఉన్నవారికి ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ ఇవ్వాలని పాచిపెంట మండలంలోని గల్లపాడు, ఇప్పలగుడ్డి గిరిజనులు కోరారు. ఉపాధి పనులు సక్రమంగాజరగడంలేదని చెల్లింపులు ఆలస్యంగా వారు ఫిర్యాదు చేశారు. చెక్‌డ్యామ్ శిథిలమవుతోందని దానిని బలోపేతం చేయాలని పార్వతీపురం మండలంలోని మోసంగి గిరిజనులు కోరారు. గొయిపాక నుండి లోకలకు మట్టిరోడ్డు వేయాలని కోరారు. పాచిపెంట మండలంలోని పలు రోడ్లు స్థల వివాదం వల్ల రోడ్లు మధ్యలో నిలిచిపోయాయని వీటిని పూర్తి చేయాలని కోరారు. అనేక గిరిజన గ్రామాలకు తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల గెడ్డవాగుల్లోని నీటిని తాగాల్సిన దుస్థితి ఏర్పడిందని పలువురు వాపోయారు. దీనివల్ల పలు వ్యాధులకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యమ్రంలో గిరిజన సంక్షేమశాఖ డిడిసిఎ ఆనంద్‌మణికుమార్, గిరిజన సంక్షేమశాఖ ఇఇ పికె నాగేశ్వరరావు, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఈదుబిల్లి విజయకిశోర్, ఐకెపి ఎపిడిఎస్ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
గిరిజన ప్రాంత సమస్యలు పరిష్కరించాలని పార్వతీపురం ఐటిడిఎ
english title:
road
Date:
Tuesday, April 17, 2012