Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎస్పీ గ్రీవెన్స్‌కు పలువురి వినతులు

$
0
0

విజయనగరం ఏప్రిల్ 16: జిల్లా ఎస్పీ కార్తికేయ తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు 10 ఫిర్యాదులు అందగా, డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా 9 ఫిర్యాదులు అందాయి. విజయనగరం మండలం బడ్డుకొండపేట గ్రామానికి చెందిన అట్టాడ జట్లమ్మను అదే గ్రామానికి చెందిన అట్టాడ అన్నపూర్ణమ్మ తదితరులు ఒక స్థలం విషయంలో తనపై దాడి చేయడంతో రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటకి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. పట్టణానికి చెందిన డి.శ్రీనివాసరావుకు చెందిన ఒక మోటారు వాహనం చోరీకి గురవ్వడంతో ఒకటవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఆ వాహనం బొబ్బిలి పోలీసులు స్వాధీన పరుచుకున్నప్పటకి కోర్టు విచారణలో ఉన్నందున తన వాహనం ఇవ్వలేదని, తనకు న్యాయం చేయాలని కోరారు. వుడాకాలనీకి చెందిన నొక్కి కమలకుమారిని తన భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. పట్టణానికి చెందిన ఒక మహిళకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యకరమైన మెసేజ్‌లను పంపుతూ మానసిక వేధనకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. చిప్పాడ వెంకటరావు అనే వ్యిక్తి కుమార్తె గత నెల 27న కనిపించుట లేదని ఒకటవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటకి ఇంతవరకు ఆచూకి లభ్యం కాలేదని, అయితే అనుమానితులను విచారించాలని కోరారు. ఒకటవు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఎర్రంశెట్టి శంకరరావుపై నాన్‌బెయిల్‌బుల్ వారెంటు ఉన్నప్పటకి అతడ్ని అరెస్ట్ చేయడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారని పట్టణానికి చెందిన గణపతిరావు ఎస్పీకి ఫోనుద్వారా ఫిర్యాదు చేశారు. గరివిడి మండలానికి చెందిన ఒక మహిళను అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేసేందుకు యత్నంచినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయలేదని ఫిర్యాదు చేశారు.

విద్యుత్ చార్జీలు తగ్గించేవరకు ఆందోళన
సాలూరు, ఏప్రిల్ 16: పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించేవరకు ఆందోళన చేపట్టాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఎం, సిపిఐ, సిపిఎం ఎల్ పార్టీల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై 4,500 కోట్ల భారాన్ని మోపిందన్నారు. అన్నిరాజకీయ పక్షాల ఆందోళనల వల్ల వంద యూనిట్లు వరకు విద్యుత్ చార్జీలను తగ్గింపు చేసిందన్నారు. పేద ప్రజలపై చార్జీల భారం వేయలేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. విద్యుత్ చార్జీల పెంపు భారమంతా పేద, మధ్యతరగతి ప్రజలపై పడుతుందన్నారు. పారిశ్రామిక వేత్తలు, బడాబాబులపై పడిన విద్యుత్ చార్జీల భారాన్ని పేదలే మోయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ రంగంలో యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రెండు రూపాయలు ఖర్చయితే ప్రైవేటు రంగంలో పది రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. గతంలో చంద్రబాబునాయుడు విద్యుత్ చార్జీలను పెంచితే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చార్జీలను తగ్గించకపోతే చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని వామపక్షాలు భవిష్యత్‌లో పోరాటాలు చేస్తాయన్నారు. పోరాడితే తప్ప విద్యుత్ చార్జీలు తగ్గవన్నారు. ప్రజలు ఆందోళనలకు సిద్ధం కావాలని కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. సిపిఐ నాయకులు సిద్దాబత్తుల రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి వర్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి గేదెల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

‘ప్రజల్ని మభ్యపెట్టేందుకే ప్రజాపథం’
సాలూరు, ఏప్రిల్ 16: ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రజాపథం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంధ్యారాణి మాట్లాడుతూ గత ప్రజాపథం సభల్లో ప్రజలనుంచి అందిన దరఖాస్తుదారులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. వాటిని అధికారులు బుట్టదాఖలు చేశారన్నారు. కనీసం 5 శాతం ప్రజా సమస్యలు పరిష్కరించలేదన్నారు. అలాంటి పరిస్థితులల్లో మళ్లీ ప్రజాపథం పేరుతో గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఏవిధంగా వెళతారని ప్రశ్నించారు. అలవికాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. గ్రామాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. సంవత్సరాలు తరబడి గ్రామీణ ప్రజలకు మంచినీటిని అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. పేదలకు ఇచ్చిన పింఛన్లను రద్దు చేసిన ఘనత ఈప్రభుత్వానిదేనన్నారు. అర్హులైన వికలాంగులకు పింఛన్లు రద్దుచేసి నోట్లో మట్టికొట్టిందన్నారు. గత ప్రజాపథం సభల్లో పింఛన్లు, ఇళ్ల కోసం తీసుకున్న దరఖాస్తులకు దిక్కు లేదన్నారు. ఇప్పుడు కొత్తవి ఎలా మంజూరు చేస్తారన్నారు. నియోజకవర్గానికి 2 వేలు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే అవి కాంగ్రెస్ కార్యకర్తలకే పంపిణీ చేశారన్నారు. ప్రజల వద్దకు వెళ్లే అర్హత అధికార పార్టీ నాయకులకు లేదన్నారు.మద్య మాఫియాకు వ్యతిరేకంగా ఈనెల 21న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా, సభలను జయప్రదం చేయాలని కోరారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు హాజరవుతున్నందున అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ నాయకులు నిమ్మాది తిరుపతిరావు, మండల కన్వీనర్ డొంక శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకులు కొలకోటి శంకరరావు పాల్గొన్నారు.

పొజిషన్ సర్ట్ఫికెట్లు ఇవ్వాలి
పార్వతీపురం, ఏప్రిల్ 16: ఇందిరమ్మ ఇళ్ళ మంజూరుకు వీలుగా నెల్లిచెరువుగట్టుపై పొజిషన్ సర్ట్ఫికెట్లు ఇవ్వాలని పార్వతీపురం ఆర్డీవో బిఆర్ అంబేద్కర్‌ను సోమవారం ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న నెల్లిచెరువుగట్టుపై నివాసం ఉంటున్న లబ్ధిదారులు కోరారు. సోమవారం పార్వతీపురం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో బిఆర్ అంబేద్కర్ నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆర్డీవోను కలిసి లబ్ధిదారులు విజ్ఞప్తి చేయడంతో ఆయన వెంటనే స్పందించారు. ఈవిషయమై ఆర్డీవో తహశీల్దార్, హౌసింగ్ ఇఇలతో ఫోన్‌లో మాట్లాడారు. గతంలో గోపాలపురం వద్ద ఇళ్ళ స్థలాలు పట్టాలు తమకు ఇచ్చినా దూరంగా ఉండడం వల్ల తమ పిల్లల చదువులు తదితర కారణాల వల్ల వెళ్లలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల తమకు అక్కడ ఇచ్చిన పట్టాలు రద్దు చేసి నెల్లిచెరువుపై నివాసం ఉంటున్నందున పొజిషన్ ఇప్పించాలని కోరగా దీనిపై తగుచర్యలు తీసుకుని పొజిషన్ రెండురోజుల్లో ఇప్పించే చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇచ్చారు.
టిడిపి నేత వినతి
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారునికి పొజిషన్ ఇవ్వాలని కోరుతున్నా సంబంధిత రెవెన్యూ సిబ్బంది చర్యలు తీసుకోనందువల్ల లబ్ధిదారునికి రావాల్సిన ఇందిరమ్మ బిల్లులు నిలిచిపోయాయని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం పార్వతీపురం ఆర్డీవో బిఆర్ అంబేద్కర్‌ను కలిసి గరుగుబిల్లి మండలానికి సంబంధించిన ఓ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని సమస్యను ఆర్డీవో దృష్టికి తెచ్చారు. గరుగుబిల్లి మండలంలోని కొంకడివరం గ్రామానికి చెందిన యేగిరెడ్డి సత్యవతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారని అయితే దానికి సంబంధించి లబ్ధిదారునికి ఇప్పటికే పది సిమెంట్ బస్తాలు సంబంధిత హౌసింగ్ సిబ్బంది ఇచ్చారని ఆయన తెలిపారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లులు చెల్లింపువిషయంలో మాత్రం పొజిషన్ సర్ట్ఫికెటు జత చేయాలని కోరడంతో లబ్ధిదారు అధికారుల చుట్టూ తిరుగుతున్నట్టు తెలిపారు. గతంతో లబ్ధిదారునికి పొజిషన్ ఇచ్చామని చెబుతున్నారే తప్ప వాస్తవంగా ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈవిషయమై ఆర్డీవో అంబేద్కర్ స్పందిస్తూ ఈ లబ్ధిదారుని విషయమై ప్రత్యేకంగా ఆ గ్రామాన్ని సందర్శించి తనకు నివేదిక పంపాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు కోలా వెంకటరావు(బాబు) పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ కార్తికేయ తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన
english title: 
sp grievences

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>