డెట్రాయిట్, ఏప్రిల్ 27: అమెరికాలోని డెట్రాయిట్‌లో గత వారాంతంలో ‘ఆటా రోజు’ ఉత్సవాలు, నిధుల సేకరణ, ఆటా చానల్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను గురించి, ఆటా కార్యక్రమాలను గురించి డెట్రాయిట్‌లోని తెలుగువారికి తెలియజెప్పడంతో పాటు అట్లాంటాలో జూలై 6-8తేదీల్లో జరిగే ఆటా 12వ మహాసభకు నిధుల సేకరణ లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆటా సభలకు డెట్రాయిట్ ప్రాంతం నుంచి లక్షా 11వేల డాలర్లను సేకరించడం విశేషం. స్థానికంగా నివసించే 350 మందికి పైగా తెలుగువారు హాజరై బాలల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. చివర్లో పసందైన తెలుగు విందును ఆరగించారు.
అమెరికాలోని డెట్రాయిట్‌లో గత వారాంతంలో
english title:
fund raiser
Date:
Friday, April 27, 2012