బూర్గంపాడు, ఏప్రిల్ 27: సారపాక మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఐటిసి పిఎస్‌పిడి కర్మాగారానికి శుక్రవారం జప్తు నోటీసులు అందాయి. వివరాల్లోకి వెళ్తే... 1999వ సంవత్సరం నుంచి ఐటిసి యాజమాన్యం ఏ రకమైన పన్నులు పంచాయతీకి చెల్లించడం లేదు. దీంతో వివిధ రూపాల్లో చెల్లించాల్సిన పన్ను ల బకాయిలు పేరుకుపోయి ప్రస్తు తం రూ.2.13 కోట్ల పైచిలుకు పెండింగ్‌లో ఉంది. దీంతో ఏం చేయాలో అర్థంకాని పంచాయతీ అధికారులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు తీవ్ర స్థాయిలో స్పందించిన జిల్లా కలెక్టర్ కర్మాగారానికి నోటీసులు పంపించి జప్తు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు శుక్రవారం నోటీసులు పంపించి యాజమాన్యానికి తెలియజేసి జప్తుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పంచాయతీ అధికారులకు, యాజమాన్యం మధ్య చర్చలు జరగ్గా యాజమాన్యం కొంత గడువును కోరింది. దీంతో అధికారులు నోటీసులు అందించి వెనుదిరిగారు. ఈ వివాదంపై ఐటిసి యాజమాన్యం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. జిల్లాలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటైన కాగితపు కర్మాగార పరిశ్రమకు పంచాయతీ నుంచి నోటీసులు అందించి జప్తుకు సిద్ధపడటం సంచలనం రేపింది. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి విల్సన్ బెన్నీ, తహశీల్దార్ రాజేంద్రకుమార్, కొత్తగూడెం, భద్రాచలం డీఎల్పీఓలు అశోక్‌కుమార్, కుమారస్వామి, ఈఓఆర్డీ ఈదయ్య, పంచాయతీ కార్యదర్శి కిశోర్ కుమా ర్ తదితరులు పాల్గొన్నారు.
* పంచాయతీకి రూ.2 కోట్లకుపైనే బకాయి
english title:
itc
Date:
Saturday, April 28, 2012