భటిండా, ఏప్రిల్ 27: ప్రభుత్వరంగ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్), లక్ష్మీమిట్టల్‌కు చెందిన మిట్టల్ ఎనర్జీ ఇనె్వస్ట్‌మెంట్ సంస్థల జాయింట్ వెంచర్ కింద ఇక్కడ నెలకొల్పిన మెగా రిఫైనరీ యూనిట్‌కు శనివారం ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభోత్సవం చేయనున్నారు. హెచ్‌పిసిఎల్- మిట టల్ ఎనర్జీ లిమిటెడ్ (హెచ్‌ఎంఇఎల్) ఇక్కడికి సమీపంలోని ఫుల్లొఖారి గ్రామంలో ఏర్పాటుచేసిన 90 లక్షల టన్నుల సామర్థ్యం గల రిఫైనరీని శనివారం ఉదయం 11.30 గంటలకు మన్మోహన్‌సింగ్ ప్రారంభిస్తారని అధికారవర్గాలు ఇక్కడ తెలియజేశా యి. కేంద్ర చమురుశాఖ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్‌సింగ్ బాదల్ ఈకార్యక్రమానికి హాజరుకానున్నారు. 400 కోట్ల డాలర్ల వ్యయంతో ఈరిఫైనరీని ఏర్పాటుచేశారు. ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్, సిఇఓ లక్ష్మీమిట్టల్, హెచ్‌ఎంఇఎల్ చైర్మన్, హెచ్‌పిసిఎల్ సిఎండీ రాయ్‌చౌదురి ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొంటున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భటిండా రిఫైనరీ డౌన్‌స్ట్రీమ్ ఆయిల్ సెక్టార్‌లో మిట్టల్ మొట్టమొదటి వెంచర్ కావ డం గమనార్హం. హెచ్‌ఇఎంఎల్‌లో హెచ్‌పిసిఎల్, మిట్టల్ ఎనర్జీ ఇనె్వస్ట్‌మెంట్ పిటిఇ లిమిటెడ్ చెరో 49% వాటాను కలిగివుండగా, మిగతా రెండు శాతం ఆర్థికసంస్థల ఆధీనంలో ఉంది.
ప్రభుత్వరంగ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్), లక్ష్మీమిట్టల్‌కు చెందిన మిట్టల్ ఎనర్జీ
english title:
batinda
Date:
Saturday, April 28, 2012