ముంబయి, ఏప్రిల్ 27: మనదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసిఐసిఐ 2011-12 ఆర్థిక సంవత్సరం మార్చితో అంతమైన త్రైమాసికానికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించింది. ఈకాలంలో బ్యాంక్ నికరలాభం రూ.1902 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలం లో సాధించిన రూ.1452 కోట్ల నికరలాభంతో పోల్చుకుంటే 31% ఎక్కువని ఐసిఐసిఐ బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
నిర్థారితకాలంలో సంస్థ మొత్తం ఆదా యం రూ. 8797 కోట్ల నుంచి రూ. 11,403 కోట్లకు పెరిగిందని ప్రకటన పేర్కొంది. సంస్థ నికర వడ్డీ మార్జిన్ 2.74% నుంచి 3.01 శాతానికి హెచ్చింది. 2011- 12 సంవత్సరానికి పన్నుల తర్వాత సంఘటిత లాభం 25% వృద్ధిచెంది రూ. 6093 కోట్ల నుంచి రూ.7643 కోట్లకు చేరింది. గత పూర్తి ఆర్థిక ఏడాదికి బ్యాంక్ నికరలాభం 26% వృద్ధితో రూ.5151 కోట్ల నుంచి రూ.6465 కోట్లకు పెరిగింది. ఇక మార్చి క్వార్టర్‌లో సంస్థ రుణాల వృద్ధి రూ. 2,16,366 కోట్ల నుంచి రూ.2,53,728 కోట్లకు చేరింది. సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లు రూ.76,046 కో ట్లు, కరెంట్ ఖాతాల డిపాజిట్లు రూ.34,973 కోట్లుగా వున్నాయి. 2012 మార్చి చివరికి క్యాపిటల్ అడక్వెసీ రేషియో 18.52%, టైర్-1 క్యాపిటల్ అడెక్వసీ 12.68% ఉన్నట్లు ప్రకటనలో తెలియజేసింది. అలాగే ఈకాలంలో బ్యాంక్ నిరర్థక ఆస్తులు 23% తగ్గి రూ.2459 కోట్ల నుంచి రూ.1894 కోట్లకు చేరాయి.
*మార్చి త్రైమాసికంలో 1902 కోట్ల నికరలాభం
english title:
icici
Date:
Saturday, April 28, 2012