Clik here to view.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాలను తగ్గించింది. పాలనాపరమైన సమస్యల ప్రభావం దేశ వాణిజ్య సెంటిమెంట్‌ని బలహీనం చేసిన దృష్ట్యా 2012-13లో భారత్ ఆర్థికవృద్ధి 6.9 శాతం మించే అవకాశం లేదని ఐఎంఎఫ్ పేర్కొంది. ఐఎంఎఫ్ ఈఏడాది జనవరిలో ఓమా రు భారత్ ఆర్థికవృద్ధి అంచనాలను 7 శాతానికి కుదించిన సంగతి తెలిసిందే.
మందగించిన పెట్టుబడులు, ఇతర వ్యవస్థాగతమైన అంశాల దృష్ట్యా 2012లో ఇండియా వృద్ధి అవకాశాలు సన్నగిల్లినట్లు సంస్థ తెలిపింది. నిలచిపోయిన వ్యవస్థాగతమైన సంస్కరణ అజెండాను పునరుద్ధరించే యత్నం చేయాలని ఐఎంఎఫ్ సూచించింది. 2012-13లో ఫైనాన్షియల్ సంస్కరణలకు, ప్రభు త్వ - ప్రైవేట్ భాగస్వామ్యాలకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌లో కొన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ వౌలికరంగానికి సంబంధించి సంస్కరణల అమలు కుంటుపడిందని ఐఎంఎఫ్ తన ఆసియా-పసిఫిక్ రీజనల్ ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదికలో పేర్కొంది. పాలనాపరమైన చిక్కులు, ప్రాజెక్టు అనుమతుల్లో ప్రభుత్వ జాప్యం వంటి అంశాలు వాణిజ్య సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. దీనివల్ల పెట్టుబడులపై తీవ్ర ప్రభావం ఏర్పడుతున్నట్లు పేర్కొంది. గ్లోబల్ అనిశ్చిత పరిస్థితులు, కఠిన విధానాలు అభివృద్ధిపై ప్రభావం చూపుతున్నాయని నివేదిక తెలిపింది.