న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: బులియన్ మార్కెట్‌లో బంగారం ధర గత నాలుగు నెలల గరిష్ఠస్థాయికి చేరుకుంది. శుక్రవారం బంగారం పది గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.29,440 పలికింది. పెళ్లిళ్ల సీజన్ కారణంగా పసిడి డిమాండ్ పెరిగి స్టాకిస్టులు, రిటైల్ వ్యాపారులు భారీగా కొనుగోళ్లు జరిపారు. గత డిసెంబర్ 5న పసిడి ధర ఈస్థాయిలో పలికింది. గడచిన ఆరు సెషన్లలో పసిడి ధర రూ.450 వరకూ పెరిగింది. అలాగే వెండి గత మూడు రోజుల నష్టాలకు తెరదించుతూ శుక్రవారం లాభపడింది. వెండి కిలోధర రూ.56,400 స్థాయికి చేరుకుంది.
పెళ్లిళ్ల సీజన్ కోసం స్టాకిస్టుల రిటైల్ వ్యాపారుల కొనుగోళ్లకు తోడు విదేశీ విపణిలో స్థిరమైన ట్రెండ్ కూడా సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని ట్రేడర్లు పేర్కొన్నారు. దేశీయ విపణిలో ఈరోజు 99.9 స్వచ్చత బంగారం పదిగ్రాముల ధర రూ.29,440కి, 99.5 స్వచ్చత బంగారం ధర రూ. 29,300కు పెరిగింది. అలాగే అమ్మకానికి సిద్ధంచేసిన వెండి కేజీ ధర రూ.400 పెరిగి రూ.56,650 పలికింది.
పది గ్రాముల ధర రూ.29,440
english title:
go
Date:
Saturday, April 28, 2012