హైదరాబాద్, ఏప్రిల్ 27: సెక్స్ కుంభకోణంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న రాజేశ్వరి అలియాస్ తారా చౌదరి వ్యక్తిగత సహాయకుడు హనీఫ్ పోలీసులకు చిక్కాడు. హనీఫ్‌ను అరెస్టు చేసి తారా చౌదరి వ్యహారంలో లోతుగా విచారించారు. తార చౌదరి సెక్స్ కుంభకోణం, బ్లాక్‌మెయిల్ కార్యకలాపాల్లో తాను చురుగ్గా పాల్గొన్నట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. హనీఫ్‌ను అరెస్టు చేసిన బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. అతని నుంచి స్పై కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. తార చౌదరి తనకు 2005 నుంచి తెలుసునని చెప్పాడు. జ్యోతి ఐలవ్‌యూ అనే చిత్రం షూటింగ్ సమయంలో పరిచయమైందని తెలిపాడు. తార నివాసంలో అమ్మాయిలతో గడిపేందుకు చాలా మంది ప్రముఖులు వచ్చేవారని, ఆ సమయంలో స్పై కెమెరాతో చిత్రీకరించే వాడినని హనీఫ్ వెల్లడించాడు. తనను కూడా తార చాలాసార్లు బెదిరించిందని, తాను వెళ్లిపోతానని ఒకసారి చెబితే ఏడాది పాటు హౌస్ అరెస్టు చేసిందని వివరించాడు. ఆమె బ్యాంక్ అక్కౌంట్లు, వ్యక్తిగత విషయాలు, ఆర్థిక లావాదేవీలు తానే నిర్వహించినట్లు ఒప్పుకున్నాడు. పలు సినిమాలకు తార ఫైనాన్స్ చేసిందని చెప్పాడు. ఆమె బ్యాంక్ అక్కౌంట్ ద్వారా రూ.70 లక్షల విలువైన లావాదేవీలు జరిగాయని చెప్పాడు. హనీఫ్‌ను కస్టడీకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తామని పోలీసులు తెలిపారు. తారా చౌదరికి మరికొన్ని బ్యాంక్ అక్కౌంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటన్నింటిని సీజ్ చేసి ఆ సొమ్మంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటున్నారు. తారా చౌదరి రిమాండ్ శుక్రవారంతో ముగియడంతో ఆమెను కోర్టులో హాజరుపరిచారు. తిరిగి మే 11 వరకు రిమాండ్ పొడిగించడంతో చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.
శృంగార సన్నివేశాలను చిత్రీకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడి
english title:
tara
Date:
Saturday, April 28, 2012