భారతదేశం - అగ్ని 5 అనే
క్షిపణిని రూపొందించి,
విజయవంతంగా
ప్రయోగించింది. ఇది 5
కిలోమీటర్ల పరిధిలో ఉండే
లక్ష్యాన్ని ఇట్టే ఛేదించగలదు.
అంటే, ఇండియాలో ప్రయోగిస్తే
అటు చైనాలో ఉండే లక్ష్యాన్ని
గురిపెట్టి
నశింపచేయవచ్చునన్న మాట.
ఇందులో అణ్వస్త్రాయుధాలు
వాడొచ్చు. దీన్నే ‘ఇంటర్
కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్’
అంటారు. ఇలాటివి ఇప్పటిదాకా
ప్రపంచంలో కేవలం 5 దేశాల
చెంత మాత్రమే ఉన్నాయి.
తాజాగా వాటి సరసన
భారతదేశం చేరింది. ఇంతకీ
ఏమా మిస్సైల్ కత?
ఒక్కసారి మన పురాణాలు
తిరగేస్తే...
అస్త్రాలు, శస్త్రాలు ప్రయోగించని
వారు లేరు. రామాయణంలో
శ్రీరాముడు రావణాసురుని వధ
కోసం బ్రహ్మాస్త్రం వాడాడు.
శ్రీకృష్ణుడు శిశుపాలుని
చంపడానికి చక్రాయుధాన్ని
వాడాడు.
మహా భారత యుద్ధంలో
‘సైంధవుడి’ కథను ఒకసారి
ప్రస్తావిద్దాం.
నాటి సింధు దేశాధిపతియైన
వృద్ధక్షత్రుని కుమారుడు
జయద్రధుడు. ఇతడికి
‘ఏమరుపాటుగా ఉన్నపుడు
ఇతని తల
నరకబడుతుందన్న’ది శాపం.
దాన్ని విన్న వృద్ధక్షత్రుడు ‘అలా
ఇతని తల నేలపై ఎవరు
పడవేస్తారో, వాని శిరస్సు నూరు
ముక్కలగు గాక’ అని ప్రతి
శపించాడు.
ఈ జయద్రధుడే సైంధవుడు.
దుర్యోధనుని చెల్లెలైన
దుస్సలను పెళ్లాడాడు.
మహాభారత యుద్ధంలో
అభిమన్యునికి అర్జునుడు
సహాయపడకుండా అడ్డం
పడ్డాడు సైంధవుడు. దానికి
కోపించి, అర్జునుడు మరునాడు
సూర్యాస్తమయంలోగా తాను
సైంధవుని చంపి తీరతానని
ప్రతిజ్ఞ చేశాడు. దాంతో,
ద్రోణాదులు సైంధవుని
కాపాడబోయారు. అపుడు
శ్రీకృష్ణుడు తన మాయ చేత
సూర్యాస్తమయం అయినట్లు
భ్రమింపజేశాడు. దాంతో
సైంధవుడు బయటకు
వచ్చాడు. వెంఠనే అర్జునుడు
అతని శిరస్సును తెగ వేశాడు.
సైంధవునికి ఉన్న శాపము,
దానికి అతని తండ్రి
ప్రతిశాపమూ ‘అర్జునుడికి
ముందే శ్రీకృష్ణుడు చెప్పి
ఉండటంతో, ఆ తెగిన శిరస్సును
నేల మీద పడకుండా బాణాలతో
ఆకాశంలోనే ఉండేలా చూశాడు
అర్జునుడు. వెనువెంటనే
పాశుపతాస్త్రం వాడి ఆ తెగిన
తల, ఎక్కడో మారుమూల
అడవుల్లో తపస్సు
చేసుకుంటున్న సైంధవుని తండ్రి
వృద్ధక్షత్రుని వొడిలో పడేలా
చేశాడు అర్జునుడు. దాంతో,
ఉలిక్కిపడిన వృద్ధక్షత్రుడా తెగిన
తలను దభేలుమని నేలపాలు
చేయడంతో తన శాపం వల్ల తానే
మరణిస్తాడు.
భక్త అంబరీషుని కథలో,
అంబరీషుడు శ్రీమహావిష్ణువును
శరణు వేడితే, చక్రాయుధం
దుర్వాసుని తరిమిన
సన్నివేశమూ మీకు గుర్తుకు
వచ్చే ఉంటుంది?
ఇవన్నీ మనకేం చెబుతారు
ూ? పురాణ కాల
సమయానికే, అస్త్రాలూ,
శస్త్రాలూ, అణ్వాయుధాలూ -
అన్నీ ఉండేవనే.
బ్రహ్మాస్త్రం, వాయవ్యాస్త్రం,
వారుణాస్త్రం, నాగాస్త్రం,
ఆగ్నేయాస్త్రం, పాశుపతాస్త్రం -
ఇలా ఎనె్నన్నో శక్తివంతమైన
అస్త్రాలుండేవి.
శస్త్రాలు అంటే, ఆయుధాలు
(గద, ధనుర్భాణాలు,
శంఖచక్రాలు, ఖడ్గం - ఇలా
విష్ణువుకు పంచ
ఆయుధాలున్నాయి) ఆయా
ఆయుధాలకు మంత్రాలను
సంధానం చేసినపుడు అవే
అస్త్రాలుగా పనిచేస్తాయి.
మహాభారత యుద్ధ చరిత్ర
పుటలను తరచి చూస్తే, మనకు
ఇలాటి అస్త్రాల, శస్త్రాల
ప్రస్తావనా, యుద్ధ వ్యూహాలైన
పద్మవ్యూహం, చక్రవ్యూహం,
క్రౌంచ వ్యూహం - ఇలాటి
వ్యూహాల ప్రస్తావనా, వాటిని
ఇరుపక్షాలూ ఆచరణలో పెట్టిన
తీరు, ఛేదించిన తీరూ
అబ్బురపరుస్తాయి.
అగ్ని పురాణం, విమాన శాస్త్రం -
ఇవన్నీ ప్రాచీన కాలంనాటి
విశేషాలు తెలియజేస్తాయి.
కాలం మారింది. మంత్ర
యుగాల నుంచి యంత్ర
యుగంలోకి మానవుడు
అడుగుపెట్టాడు. అలనాటి వేద
పరిజ్ఞానం, దాదాపు లుప్తమై
పోయింది. నాటి బ్రహ్మాస్త్ర,
పాశుపతాస్త్రాల స్థానంలో
శతఘు్నలు, తుపాకులు,
రాకెట్లు, క్షిపణులు వచ్చాయి.
మరీ 20వ శతాబ్దం ముగిసి
21వ శతాబ్దంలోకి
అడుగుపెట్టేసరికి
అణ్యాయుధాలు వీటికి
తోడయ్యాయి.
రాకెట్లూ, క్షిపణులూ
రాకెట్, క్షిపణుల వ్యవస్థపై
ఆధునిక యుద్ధ వాతావరణంలో
లక్ష్యాన్ని చేరడానికి వాడేందుకు
వివిధ దేశాలు నేడు
ఆధారపడుతున్నాయి. తమ
దేశాలకు కావలసిన రీతిలో
రాకెట్లను, క్షిపణులను
రూపొందించుకుంటూ, దేశ
భద్రత కోసం
పాటుపడుతున్నాయి. ఈ
క్షిపణులను ఏదో ప్రయోగించి
వదిలేసే రకంగా కాకుండా,
ప్రయోగించిన తర్వాత కూడా
వాటిని నియంత్రించే రీతిలో
రూపొందిస్తున్నారు. ఈ
క్షిపణులను గైడెడ్ మిస్సైల్స్
అనీ, టాక్టికల్ గైడెడ్ మిస్సైల్స్
అనీ, స్ట్రేటజిక్ మిస్సైల్స్ అనీ,
క్రూయిస్ మిస్సైల్స్ అనీ,
బాలిస్టిక్ మిస్సైల్స్ అనీ
రకరకాలుగా రూపొందిస్తారు.
ఒక్కో రకం క్షిపణి ఒక్కో ప్రత్యేక
సందర్భానికీ వాడతారు.
ప్రయోగించిన తర్వాత, లక్ష్యం
చేరడానికి దానిని నియంత్రించే
రీతిలో గైడెడ్ మిస్సైల్స్
పనే్జస్తాయి. అదే టాక్టికల్
గైడెడ్ మిస్సైల్స్ అనేవి తక్కువ
పరిధిలో, యుద్ధ క్షేత్రంలోనే
వెనె్వంటనే ప్రయోగించడానికి
పనికొస్తాయి. స్ట్రేటజిక్ గైడెడ్
మిస్సైల్స్ అనేవి (వీటినే లాంగ్
రేంజ్ మిస్సైల్స్ అనీ
అంటారు) క్రూయిస్, బాలిస్టిక్
అని రెండు రకాలుగా ఉంటాయి.
క్రూయిస్ మిస్సైల్ అనేవి గాలి
పీల్చుకుని (ఎయిర్ బ్రీతింగ్)
పనిచేసే ఇంజన్లతో
రూపొందుతాయి. అదే బాలిస్టిక్
మిస్సైల్స్ అనేవి దశలవారీ
పనిచేస్తాయి. తొలి దశకు
మాత్రమే రాకెట్ ఇంజన్
వాడతారు. మలి దశల్లో గైడెన్స్
మెకానిజం పనే్జస్తుంది. ఈ
స్ట్రేటజిక్ మిస్సైల్స్ (ఎత్తుగడతో
పనే్జసే క్షిపణులందామా?)
సాధారణంగా అణ్వాయుధాలనే
తీసుకెళతాయి.
రాకెట్ల తొలినాళ్లు..
మన పురాణ కాలంలోనే అస్త్ర
శస్త్రాలుండేవని మనకు తెలుసు.
అగ్ని పురాణంలో ఈ అస్త్ర శస్త్రాల
ప్రస్తావన ఉండనే ఉంది. పోతే,
ఆధునిక యుగంలో 1232
సం.లో చైనాలో రాకెట్లు తొలిసారి
వాడినట్లు చరిత్రకారుల కథనం.
బ్లాక్ పౌడర్‌ను కూడా చైనా వాళ్లే
కనుగొన్నారని అంటారు. అదే
శతాబ్దంలో యూరప్‌లో రాకెట్లు
కన్పించాయి. లెగ్నికాయుద్ధంలో
(1241 సం.లో) మంగోల్స్
తొలిసారిగా రాకెట్లు
వాడారంటారు. 1379 సం.లో
ఇటలీలోనూ, 1380 సం.లో
వెనిస్‌లోనూ వాడారంటారు.
1248 సం.లో బ్రిటీష్
వైజ్ఞానికుడు రోజన్ బెకాన్ బ్లాక్
పౌడర్ ఫార్ములాలను తన
ఎపిస్టోలా లో రాశాడు. అదే
కాలంలో జర్మనీకి చెందిన
అల్‌బెర్టస్ మాగ్నస్ తన ‘డి
మిరాబిలిబస్ మండి’లో
రాకెట్‌లలో వాడే బ్లాక్ పౌడర్
ఫార్ములాలను ప్రస్తావించాడు.
1325 సం.లో తొలి
అగ్నాయుధాలు వచ్చాయి.
‘గన్ పౌడర్’ పేరు తొలిసారిగా
వాడుకలోకొచ్చింది వీటితోనే.
1668 సం. నాటికి మిలిటరీ
రాకెట్లు పరిణతి చెందాయి. వాటి
పనితీరు ఆకారం కూడా
మెరుగుపడ్డాయి. ఆ
సంవత్సరంలోనే జర్మన్ కలొనెల్
ఒకడు 60 కిలోల రాకెట్‌ను
చెక్కతో రూపొందించాడు. అది
దాదాపు 7 కిలోల గన్ పౌడర్‌ను
తీసుకెళ్లింది.
18వ శతాబ్దం - దాని
తర్వాత...
18వ శతాబ్దానికి ఇండియాలో
‘రాకెట్ల’ ప్రస్తావన వచ్చింది. అదీ
మన దక్షిణాదిలో నాటి మైసూరు
రాజ్యానికి చెందిన హైదరలీ
లోహపు సిలిండర్లను వాడి
రాకెట్లు రూపొందించాడు.
1780 ప్రాంతంలో జరిగిన
రెండవ ఆంగ్లో - మైసూర్
యుద్ధంలో వాటిని వాడాడు.
హైదరలీ రాకెట్లు బ్రిటిష్ వారి
ఆయుధ భాండాగారాన్ని
ధ్వంసం చేశాయి. దీని తర్వాత
హైదరలీ కొడుకైన టిప్పు సుల్తాన్
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ
బలగాలపై వాడాడు. ఈ
రాకెట్లకు ముందు వేపు
కత్తులను కట్టి సుదూరంలో
ఉన్న శత్రువులపై పడేలా
రూపొందించారు. ఈ రాకెట్లే
క్షిపణులుగా రూపు
మార్చుకొన్నాయన్నమాట.
వీటినే మైసూరు రాకెట్లు
అన్నారు. వీటిని 2 కి.మీ.
దూర పరిధి దాకా వాడారు.
అంతకు ముందే యూరప్‌లో,
అక్కడా రాకెట్లను మిలిటరీ
వాళ్లు వాడినా, అవి చెక్కతో
తయారైనవే. కానీ మైసూరు
రాకెట్లు లోహపు నిర్మాణాన్ని
కల్గి ఉండటం విశేషంగా
ఆకర్షించింది (బ్రిటిష్ వారు సైతం
అలాటి రాకెట్ల రూపకల్పనకు ఆ
తర్వాతి కాలంలో శ్రీకారం
చుట్టారు. అది వేరే సంగతి)
1792, 1799 సం.లో
శ్రీరంగ పట్టణంలో జరిగిన
యుద్ధాల్లో వీటిని
విజయవంతంగా వాడి బ్రిటిష్
వారిని సమర్థవంతంగా
ఎదుర్కొన్నాడు టిప్పు సుల్తాన్.
ఈ క్షిపణుల తయారీకి
‘తారామండల్ పేట’ అనే
చోటును ఏర్పాటు చేయడమే
గాక ‘ఫతుల్ ముజాహిదీన్’
అనే మిలిటరీ (మాన్యువల్)
కరదీపికను కూడా టిప్పు
సుల్తాన్ రూపొందించాడు.
మైసూరు రాజ్యంలో 16 నించి
24 బ్రిగేడులనూ, ప్రతి
బ్రిగేడుకూ 200 మంది రాకెట్
మనుష్యులను ఏర్పాటు
చేశాడు. రాకెట్ లాంచర్స్‌ను పెద్ద
చక్రాల మీద తీసికెళ్లేలా
రూపొందించాడు. ఈ లాంచర్లను
దాదాపు ఏక కాలంలో 5 నించి
10 రాకెట్లు ప్రయోగించేలా
రూపొందించడం విశేషం.
శ్రీరంగ పట్టణం బ్రిటిష్ వారి చేతికి
చిక్కినపుడు వారు దాదాపు
600 లాంచర్లను, 700
సర్వీస్ చేసి వాడుకోగల
రాకెట్లను, 9000 ఖాళీ
రాకెట్లను కనుగొన్నారు. అనేక
రాకెట్లను, రాకెట్ కేసులను
సేకరించిన బ్రిటిష్ వారు వాటిని
విశే్లషించడానికి బ్రిటన్‌కు
పంపారు. దాని తర్వాత
1805 సం.లో బ్రిటిష్ వారు
తొలి ‘సాలిడ్ ఫ్యూయెల్
రాకెట్’ను ప్రదర్శించారు.
1807 సం.లో విలియం
కంగ్రీవ్ ‘ఎకన్సైస్ అకౌంట్ ఆఫ్ ద
ఆరిజన్ కంగ్రీవ్ రాకెట్లు’గా
రూపొందించారు. బ్రిటిష్ వారు
1812లో జరిగిన యుద్ధంలో
వాడారు కూడా. ఈ రాకెట్ల
రూపాంతరాలనే 1814
సం.లో బాల్టిమోర్
యుద్ధంలోనూ వాడారు. ఈ
కంగ్రీవ్ రాకెట్ల లక్ష్య పరిధి 1.5
నించి 2 మైళ్ల దాకానే ఉండేది.
దీని తర్వాత ఎక్కడికి బడితే
అక్కడికి తీసుకెళ్లి వాడుకునేలా
రాకెట్లను 19వ శతాబ్దంలో
విలియమ్ హేల్ అనే బ్రిటిష్
ఇంజనీర్ రూపొందించాడు.
దీన్ని ఆస్ట్రేలియా రాకెట్
కార్పొరేషన్ హంగేరీ, ఇటలీల్లో
వాడింది. అలాగే డచ్, రష్యా,
దేశాలు విజయవంతంగా వీటిని
వాడాయి. హేల్ తన పేటెంట్
హక్కులను అమెరికాకు
అమ్మేశాడు. ఫలితంగా అమెరికా
దాదాపు 2 వేల రాకెట్లను
రూపొందించి మెక్సికో యుద్ధం
(1846-48)లో వాడింది.
తొలి ప్రపంచ యుద్ధం - దాని
తర్వాత
అమెరికాలో రాబర్ట్ హచింగ్స్
గొడ్డార్డ్ స్టీల్ మోటార్ తదితర
సామాగ్రి వాడి పలు పరిశోధనలు
చేశాడు. రాకెట్‌ల రూపకల్పనలో
గణనీయమైన సామర్థ్యాన్ని
చూపాడు. తొలి ప్రపంచ
యుద్ధంలో వాడటానికి గొడ్డార్డ్
పలు రకాల మిలిటరీ రాకెట్లను
డిజైన్ చేశాడు. బ్లాక్ పౌడర్
స్థానంలో డబుల్ - బేస్ పౌడర్
(40% నైట్రోగ్లిజరిన్, 60%
నైట్రోసెల్యులోస్) వాడారు. ఈ
రాకెట్లను పరీక్షించి, సంతృప్తి
పడ్డాక అమెరికన్ సైన్యం
వాడటం జరిగింది. తొలి ప్రపంచ
యుద్ధంలో నిజానికి రాకెట్ల
వాడకం జరిగింది గానీ,
తక్కువే. గొడ్డార్డ్ డిజైన్స్ రెండో
ప్రపంచ యుద్ధంలో బాగా
వాడారు. గొడ్డార్డ్ కాకుండా,
ఛార్లెస్ ఎఫ్ కెట్టిరింగ్, వెర్న్‌హెర్
వోన్ బ్రాన్, వాల్టర్ ఆర్
డోర్న్‌బెర్గెర్ (జర్మనీ)లు కూడా
రాకెట్ల రంగంలో విస్తృత
పరిశోధనలు చేశారు. 1937
నాటికి డోర్న్ బెర్గెర్, బ్రాన్‌ల టీమ్
సంఖ్య వందల్లోకి పెరిగింది.
బాలిస్టిక్ రాకెట్స్/ మిస్సైల్స్
రూపకల్పన జరిగి, పరీక్షించడం
జరిగింది.
రెండో ప్రపంచ యుద్ధంలో
రాకెట్లపై ఖర్చూ, రాకెట్ల
వాడకమూ చాలా ఎక్కువగా
జరిగింది. 5 అంగుళాల
రాకెట్‌ను బ్రిటన్ రూపుదిద్దింది.
దీనికి వార్‌హెడ్ ఎక్స్‌ప్లోజివ్‌ను
జోడించింది. దీని సామర్థ్య పరిధి
2 నించి 3 మైళ్లే. అమెరికా
సైన్యం 4.5 అంగుళాల
రాకెట్‌ను తయారుచేసింది. వీటి
సంఖ్య దాదాపు 4 లక్షలు. అదే
సమయంలో సోవియట్ రష్యా
కూడా కొన్ని రాకెట్లను
తయారుచేసింది. కాట్యూషా
పేరుతో 130 మి.మీ.
రాకెట్లను పెద్దఎత్తున
తయారుచేసింది రష్యా.
1940 సం. కాలంలో క్లారెన్స్
ఎన్ హిక్‌మాన్ (ఇతను
గొడ్డార్డ్‌తో కలసి పని చేశాడు)
చేతితో వదిలే రాకెట్ డిజైన్‌లను
మెరుగుపరిచి 20 అంగుళాల
పరిమాణపు రాకెట్‌లను
తయారుచేశాడు. ఇది చాలా
పాపులరైందా కాలంలో. దీనికే
బజూకా అని పేరు. దీన్ని
అమెరికా 1942లో వాడి
జర్మన్లను ఆశ్చర్యపరచింది.
దీనికి ప్రతిగా జర్మన్లు టాంక్
టెర్రర్ లేదా స్టవ్‌ప్రైప్ అనే పేరుతో
రాకెట్లను రూపొందించారు.
2వ ప్రపంచ యుద్ధ కాలంలో
యాంటీ ఏర్‌క్రాఫ్ట్ గన్స్ కన్నా
ఉన్నత శ్రేణి హై ఆల్టిట్యూట్
బాంబింగ్ రావడంతో రాకెట్
పవర్డ్ గన్స్ రూపకల్పన
ఆవశ్యకమైంది. బ్రిటన్ తొలిగా 3
అంగుళాల యాంటీ ఏర్‌క్రాఫ్ట్
గన్‌లను రూపొందించింది. దీని
తర్వాత 3.7 అంగుళాల గన్‌లు
వచ్చాయి. 20 వేల అడుగుల
ఎత్తున ప్రయోగించే వీలుగా
గన్‌లు రూపొందించారు. రష్యా,
బ్రిటన్, జర్మనీ, జపాన్ దేశాలు
ఏరియల్ రాకెట్ల రూపకల్పన
చేశాయి కూడా. 2వ ప్రపంచ
యుద్ధం తర్వాత పలు రకాల
రాకెట్లను రూపొందించాయి ఈ
దేశాలు. రష్యా, అమెరికా
దేశాలు అన్‌గైడెడ్ బాలిస్టిక్
రాకెట్లను రూపొందించాయి.
1955లో అమెరికా సైన్యాలు
‘హానెస్ట్ జాన్’ అనే మిస్సైల్‌ను
ప్రవేశపెట్టాయి. 1957 నుంచి
సోవియట్ యూనియన్ పలు
రకాల రాకెట్లను, మిస్సైల్స్‌ను
ప్రవేశపెట్టింది. ఈ మిస్సైల్స్ 25
నించి 30 అడుగుల పొడవుండి
20 నుంచి 45 మైళ్ల లక్ష్య
పరిధిని కల్గి ఉండేవి. 1973
అక్టోబర్‌లో జరిగిన అరబ్ -
ఇజ్రాయెల్ యుద్ధంలో ఈ రకం
రాకెట్లను ఈజిప్ట్, సిరియా
దేశాలు ప్రయోగించాయి.
1980లో ఇరాక్ యుద్ధంలో
కూడా వాడారు.
ఇంతకీ మిస్సైల్ అనే పదం ఎలా
వచ్చింది?
ఆధునిక ప్రపంచంలో క్షిపణి
లేదా మిస్సైల్ అనేది యుద్ధానికి
తప్పనిసరి ఆయుధంగా
మారింది. ఇందులో నాలుగు
భాగాలుంటాయి. టార్గెటింగ్
(గైడెన్స్‌తో లేదా గైడెన్స్
లేకుండా), ఫ్లయిట్ సిస్టం,
ఇంజన్, వార్‌హెడ్. ఈ మిస్సైల్స్
పలు రకాలుగా
రూపొందుతాయి. ఉపరితలం
నించి ఉపరితలానికి వెళ్లేవి
(సర్‌ఫేస్ టు సర్‌ఫేస్), గాలి
నుంచి ఉపరితలానికి వెళ్లేవి
(ఏర్ టు సర్‌ఫేస్), ఉపరితలం
నుంచి గాలిలోకి వెళ్ళేవి (సర్‌ఫేస్
టు ఏర్), గాల్లోంచి గాల్లోకి
వెళ్లేవి (ఏర్ టు ఏర్), ఉపగ్రహ
నాశిని (యాంటీ శాటిలైట్) అనే
పలు రకాల మిస్సైల్స్ నేడు
వాడుకలో ఉన్నాయి.
గాలిలోంచి ఉపరితలానికి వెళ్లే
మిస్సైల్స్‌లో బాలిస్టిక్, క్రూయిస్,
యాంటీ-షిప్, యాంటీ-టాంక్
అని పలు రకాలున్నాయి.
ఉపరితలం లోంచి గాల్లోకి వాడే
మిస్సైల్స్‌లో యాంటీ-ఏర్‌క్రాఫ్ట్,
యాంటీ బాలిస్టిక్ అని రెండు
రకాలున్నాయి.
ఇంతకీ మిస్సైల్ అంటే అర్థం
ఏమిటి? అనే సందేహం
రావచ్చు. నిజానికి మిస్సైల్
అనేది లాటిన్ భాష నుంచి
వచ్చిన పదం. మిస్సైల్ అంటే,
‘పంపడానికి’ అని అర్థం. ఒక
శక్తివంతమైన,
మార్గదర్శకత్వంతో కూడిన
యుద్ధోపకరణం గాలిలోనో,
ఉపరితలంలోనో వాడే వీలుగా
రూపొందితే, దాన్ని క్షిపణి లేదా
మిస్సైల్ లేదా గైడెడ్ మిస్సైల్
అని వ్యవహరిస్తారు. అదే ఒక
శక్తివంతమైన యుద్ధోపకరణాన్ని
ఎలాటి మార్గదర్శకత్వం
లేకుండా ప్రయోగించే వీలుగా
రూపొందితే, దాన్ని రాకెట్ అని
వ్యవహరిస్తారు. ఇలాటి
శక్తివంతమైన యుద్ధోపకరణాన్ని
నీటిలో కూడా పనే్జసేలా
రూపొందే వాటిని టార్పెడోస్
అంటారు. ఆధునిక కాలంలో
టార్పెడోస్‌నే ‘మైన్స్’
అంటున్నారు.
మిస్సైల్ టెక్నాలజీ
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ
జర్మనీ వాడిన మిస్సైల్స్
పరంపరనే తొలి మిస్సైల్స్‌గా
చెబుతారు. వీటిలో వి-1
ఫ్లయింగ్ బాంబ్, వి-2 అనేవి
బాగా పేరు పొందాయి.
రెండింటిలోనూ సులభమైన
మెకానికల్ ఆటో పైలెట్‌ను వాడి
నిర్ణీత రూట్‌లో ఎగిరేలా
రూపొందించారు.
గైడెడ్ మిస్సైల్ రూపకల్పనలో
నాలుగు విడి భాగాలు
తప్పనిసరి. ముందే
చెప్పుకున్నట్లు, టార్గెటింగ్,
ఫ్లయిట్ సిస్టం, ఇంజన్,
వార్‌హెడ్ అనేవి మిస్సైల్‌లోని 4
ముఖ్య విడిభాగాలు.
టార్గెటింగ్ గైడెన్స్ వ్యవస్థలో
ఇన్‌ఫ్రారెడ్, లేజర్ లేదా రేడియో
తరంగాలను వాడి గైడ్ చేస్తారు.
జిపిఎస్ వంటి సౌకర్యాలను
వాడతారు. ఫ్లయిట్ వ్యవస్థలో
వెక్టర్డ్ థ్రస్ట్, ఏరోడైనమిక్
మానోవరింగ్ వంటి సౌకర్యాలను
వాడతారు. ఇక మిస్సైల్స్‌లో
వాడే ఇంజన్ విషయానికి వస్తే
వీటిల్లో రాకెట్ ఇంజన్‌గానీ, లేదా
జెట్ ప్లేన్‌లలో వాడే ఇంజన్‌లను
గానీ వాడతారు. వీటిల్లో ఘన
ఇంధనాలని లేదా ద్రవ
ఇంధనాలనీ వాడతారు.
భూమిపై నించి వాడే
మిస్సైల్స్‌లో ఇంజన్స్ వివిధ
(మల్టిపుల్ ఇంజన్) స్టేజీలలో
ఉంటాయి. వీటి తర్వాత
యుద్ధంలో అత్యంత కీలకమైన
వార్ హెడ్ నాలుగో భాగం.
ఇందులో
లక్ష్యాన్ని ఛేదించి, వినాశనాన్ని
కల్గించే శక్తి ఉంటుంది. ఈ
వార్‌హెడ్‌లలో వేరే యుద్ధ
ఉపకరణాలను గానీ, తగలబెట్టే
స్వభావంగల పదార్థాలను గానీ,
రసాయన, జీవ రసాయన లేదా
రేడియో ధార్మికత గల
ఆయుధాలను గానీ వాడతారు.
మరింత విధ్వంసక
ఆయుధాలంటే,
అణ్వాయుధాలను కూడా
వాడతారు. వార్‌హెడ్ లేని
క్షిపణులను సాధారణంగా టెస్టింగ్
కోసం, సైన్యంలో శిక్షణ నిమిత్తం
వాడతారు.
ప్రపంచ మిలిటరీ శక్తి ఎలా
ఉంది?
ఈ అణు యుగంలో ఒక దేశపు
మిలిటరీ నాణ్యత, ఆధిక్యత, శక్తి
- ఇవన్నీ ఆ దేశ సైన్యం వద్ద
ఎలాటి
అణ్వాయుధాలున్నాయనే
అంశం మీదే ఆధారపడి ఉంది.
అందువల్లే ప్రపంచ దేశాలు
ఎప్పటికప్పుడు తమదే
పైచేయిగా ఉండాలనుకోవడం.
అణుబాంబులు, ఆయుధాలు
తయారుచేస్తే సరిపోదు. వాటిని
వాడటానికి సరైన
యుద్ధోపకరణాలూ కావాలి. ఒక
శత్రు దేశం ప్రయోగించే
ఆయుధాన్ని విధ్వంసం చేసి
తనను తాను రక్షించుకోగల్గాలి.
ఇదంతా ‘అణుబాంబులను
ప్రయోగించే వ్యవస్థ’ మీదే
ఆధారపడి ఉంటుంది. దీర్ఘ పరిధి
బాలిస్టిక్ మిస్సైల్స్ వ్యవస్థ ఎంత
శక్తివంతంగా వాడుకోగల్గితే, ఆ
దేశం అంత సురక్షితంగా,
శక్తివంతంగా
ఉంటుందన్నమాట.
నిన్న, మొన్నటిదాకా
అణ్వాయుధాలతో కూడిన
మిస్సైల్స్ రూపకర్తలుగా
ప్రపంచంలో కేవలం ఐదే
దేశాలుండేవి. అమెరికా, రష్యా,
చైనా దేశాలు తమ ఆధిక్యతను
చాటుకొంటూ వస్తున్నాయి.
వీటితోబాటు బ్రిటన్, ఫ్రాన్స్
దేశాలూ ఉన్నాయి.
బాలిస్టిక్ మిస్సైల్స్ వ్యవస్థ
తక్కువ వ్యవధిలో పని
ముగించగల సామర్థ్యంతో,
కచ్చితమైన దారిలో ప్రయాణం
చేసి లక్ష్యాన్ని ఛేదించగల
మిస్సైల్స్‌ను రూపొందించేందుకు
సాయపడ్తుంది. ఖండాంతర
బాలిస్టిక్ మిస్సైల్స్, సబ్ మెరైన్స్
నుంచి లాంచ్ చేసే బాలిస్టిక్
మిస్సైల్స్ బాగా పాపులర్.
అత్యంత సుదీర్ఘ పరిధిగల
బాలిస్టిక్ మిస్సైల్స్‌ను చైనా,
అమెరికా, రష్యా దేశాలు
మాత్రమే కల్గి ఉన్నాయి.
ప్రపంచంలో కేవలం మాస్కో
నగరం ఒక్కటే నమ్మకమైన
యాంటీ బాలిస్టిక్ మిస్సైల్
వ్యవస్థను కల్గి ఉందంటే ఆశ్చర్యం
కలుగకమానదు. ఇండియా
అణు సామర్థ్యం కల్గి, మిస్సైల్
వ్యవస్థ రూపకల్పనలో మిగిలిన
అభివృద్ధి చెందిన దేశాలకు ఏ
మాత్రం తీసిపోని రీతిలో మిస్సైల్
వ్యవస్థను రూపుదిద్దుకుంది.
ఇటీవలే అగ్ని-5 అనే క్షిపణిని
పరీక్షించింది. 5 వేల కిలోమీటర్ల
లక్ష్య పరిధిని ఛేదించగల శక్తి
దీనిది. దీంతో భారతదేశం
శక్తివంత మిస్సైల్ గల ఆరో
దేశంగా అవతరించింది.
స్వల్ప సమయంలోనే, కనీసం
రెండు నగరాలను రక్షించే
వ్యవస్థలను మోహరించే క్షిపణి
రక్షణ కవచాన్ని సైతం
భారతదేశం అభివృద్ధి చెందింది.
ఇలాటి రక్షణ కవచం అతి కొద్ది
దేశాల వద్ద మాత్రమే ఉంది.
దీన్ని రక్షణ పరిశోధనాభివృద్ధి
సంస్థ - డిఆర్‌డిఓ
రూపొందించింది. 2 వేల
కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను
ఛేదించగల బాలిస్టిక్ క్షిపణులపై
దీన్ని విజయవంతంగా
ప్రయోగించారు. 2016 నాటికి
5 వేల కిలోమీటర్ల పరిధిగల
క్షిపణులను నాశనం చేసే
స్థాయికి దీన్ని
ఆధునీకరించబోతున్నారు
కూడా.
భారతీయ క్షిపణి కార్యక్రమం
ఎలా ఉందంటే...
భారతదేశ క్షిపణి అభివృద్ధి
కార్యక్రమం చాలా ఆశాజనకంగా
ఉంది. మాజీ రాష్టప్రతి
డా.అబ్దుల్ కలాం ఈ మిస్సైల్
కార్యక్రమానికి ఇతోధికంగా
తోడ్పడ్డారని చెప్పాలి.
ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్
డెవలప్‌మెంట్ ప్రోగ్రాం
(ఐజిఎండిపి) కింద పలు రకాల
మిస్సైల్స్ అభివృద్ధికి శ్రీకారం
చుట్టారు. వీటిలో ఉపరితలం
నించి ఉపరితలానికి ప్రయోగించే
ఇంటర్మీడియెట్ రేంజి అగ్ని
మిస్సైల్, షార్ట్ రేంజి మిస్సైల్స్
అయిన పృథ్వీ బాలిస్టిక్ మిస్సైల్
ముఖ్యమైనవి. వీటితోబాటు
ఉపరితలం నించి గాల్లోకి
ప్రయోగించే ఆకాష్, త్రిశూల్
మిస్సైల్స్ కూడా తోడైనాయి.
‘నాగ్’ మిస్సైల్ అనేది
టాంకులను ధ్వంసం చేసే
యాంటీ టాంక్ మిస్సైల్.
ఇవికాక ఇండియన్ బాలిస్టిక్
మిస్సైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అనే
దాన్ని కూడా భారతదేశం
ప్రారంభించింది. 2005 నాటికి
యాంటీ బాలిస్టిక్ సామర్థ్యాన్ని
సాధించి ప్రపంచంలో ‘నాలుగో
దేశం’గా పేరు పొందింది.
పృథ్వీ-1 అన్నది భారతీయ
సాంకేతికతతో రూపొందింది.
(పృథ్వి అంటే సంస్కృతంలో
భూమి అని అర్థం) ఇది ఎలాటి
వార్‌హెడ్స్ (యుద్ధ
ఆయుధాలు)నైనా తీసికెళ్లగల
సామర్థ్యం కల్గింది. దీన్ని 700
కి.మీ. దాకా ప్రయోగించవచ్చు.
పృథ్వీ-2 అనేది పృథ్వీ-1కు
మెరుగైన వెర్షన్. చెప్పాలంటే
పృథ్వీ-1 అనేది సైన్యం కోసం,
పృథ్వీ-2 అనేది వాయుసేన
కోసం, పృథ్వీ-3 అనేది
నౌకాదళం కోసం
రూపొందించారు.
ధనుష్ అనేది నౌకాదళం కోసం
రూపొందిన పృథ్వీ క్షిపణి (
్ధనుష్ అంటే సంస్కృతంలో
ధనస్సు అని అర్థం) ఇది 250
కి.మీ. లేదా 350 కి.మీ.
మిస్సైల్స్‌ను ప్రయోగించగలదు.
కె-15 సాగరిక అనేది
సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్
మిస్సైల్. ఇది ధనుష్
మిస్సైల్‌కు మరో రూపాంతరం.
ధనుష్‌ను 2000 సం.లో
ప్రవేశపెట్టారు.
సూర్య (అంటే సూర్యుడు) అనేది
తొలిగా మన దేశం
రూపొందించిన ఖండాంతర
మిస్సైల్ పేరుగా చెబుతారు.
1994లోనే దీనికి శ్రీకారం
చుట్టారంటారు. కానీ ఈ మిస్సైల్
గురించి మనకు పూర్తి
సమాచారం లేదు. 2007లో
దీనికి అగ్ని-5 అని పేరు
మార్చారని మాత్రం తెలుస్తోంది.
శౌర్య మిస్సైల్ అనేది షార్ట్‌రేంజి
సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్
మిస్సైల్. దీనిది 600 కి.మీ.
పరిధి. సాగరిక మిస్సైల్‌కు మరో
రూపాంతరమే ఈ శౌర్య. యాంటీ
బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్‌లలో
‘శౌర్య’ నమ్మకమైందని
డిఆర్‌డిఒ చెప్పింది. రాబోయే
కాలంలో యాంటీ బాలిస్టిక్
మిస్సైల్ సిస్టమ్స్ అయిన
అడ్వాన్స్‌డ్ ఏర్ డిఫెన్స్ (ఎఎడి),
పృథ్వీ ఏర్ డిఫెన్స్ (పిఎడి)లను
పరీక్షించే సమయంలోనే
‘శౌర్య’కున్న సామర్థ్యాలనీ వెలికి
తేబోతున్నారు శాస్తజ్ఞ్రులు.
సాగరిక (సాగరం, సముద్రం
నుంచి పుట్టిందని సంస్కృతార్థం)
అనేది సబ్‌మెరైన్‌ల నుంచి
లాంచ్ చేసే బాలిస్టిక్ మిస్సైల్.
దీని లక్ష్య పరిధి 750 కి.మీ.
2010 నాటికి దీని పరీక్షలు
పూర్తయ్యాయి.
నిర్భయ్ అనేది (్భయం లేనిది
అని సంస్కృతార్థం) లాంగ్ రేంజి
సబ్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్.
ఇది 1000 కి.మీ. లక్ష్య
పరిధిని కల్గి ఉంది. భూమీద,
గాలిలో, నీటి మీద పనే్జసేలా
సైన్యానికి, వాయు సేనకీ,
నౌకాదళానికీ సహాయకారిగా
ఉండబోతోంది. ఇది 24 రకాల
వార్‌హెడ్స్‌ను లాంచ్
చేయగలదు.
పి-70 అమెథిస్ట్ అనేది సబ్
మెరైన్ క్రూయిజ్ మిస్సైల్. ఇది
’90 దశకంలో మన దేశం
సమకూర్చుకుంది. పి-270
మోస్‌కిట్ అనేది మన సైన్యంలో
వాడుతున్న సూపర్ సానిక్
రామ్‌జెట్ శక్తిగల క్రూయిజ్
మిస్సైల్. దీన్ని రష్యా
నిర్మించింది.
బ్రహ్మాస్ అనేది సూపర్ సానిక్
క్రూయిజ్ మిస్సైల్. దీన్ని
భూమీద నుంచి గానీ, ఓడల
మీద నించి గానీ,
జలాంతర్గాముల నుంచి గానీ
ప్రయోగించే వీలుంది. దీని
రూపకల్పనలో డిఆర్‌డిఓ,
రష్యాకు చెందిన NPO
Mashinostroeyenia
కంపెనీ సాయం తీసుకుంది. దీని
కోసం బ్రహ్మాస్ ఏరోస్పేస్ ప్రైవేట్
లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు
చేశారు. బ్రహ్మాస్ అనే పేరును
బ్రహ్మపుత్ర (్భరతదేశం),
మోస్‌కవా (రష్యా) అనే రెండు
నదుల పేర్లను కలిపి పెట్టారు.
బ్రహ్మాస్ ప్రపంచంలోకెల్లా
అత్యంత వేగంగా పయనించే
క్రూయిజ్ మిస్సైల్‌గా
రూపొందించారు.
భూమీద నుంచి గాలిలోకి
ప్రయోగించే మిస్సైల్స్‌లో ‘ఆకాష్’
అనేది భారతీయ మీడియం
రేంజి మిస్సైల్. ఇది 30 కి.మీ.
లక్ష్య పరిధిని ఛేదించగలదు.
18000 మీటర్ల ఎత్తుకు
వెళ్లగలదు. దీనికి
అణ్వాయుధాలను తీసుకెళ్లే
సామర్థ్యం ఉంది.
భారతీయ బాలిస్టిక్ మిస్సైల్
రక్షణ కార్యక్రమం అనేది
బహుస్థాయిల బాలిస్టిక్ మిస్సైల్
రక్షణ వ్యవస్థ. భారతదేశాన్ని
వివిధ బాలిస్టిక్ మిస్సైల్ అటాక్‌ల
నించి రక్షించేందుకు రూపొందిన
కార్యక్రమం. ఇది రెండు అంచెల
రక్షణ కార్యక్రమం. పృథ్వీ ఏర్
డిఫెన్స్ (పిఎడి), అడ్వాన్స్‌డ్
ఏర్ డిఫెన్స్ (ఎఎడి) - ఈ
రెండూ దీని కిందకే వస్తాయి.
పృథ్వీ ఏర్ డిఫెన్స్‌ని
2006లో, అడ్వాన్స్‌డ్ ఏర్
డిఫెన్స్‌ని 2007లో
పరీక్షించారు. అమెరికా, రష్యా,
ఇజ్రాయెల్ దేశాల తర్వాత
ఇలాటి రక్షణ కార్యక్రమం చేపట్టి
సాఫల్యాన్ని పొందిన నాలుగో
దేశంగా భారతదేశం
పేరుగాంచింది.
అగ్ని మిస్సైల్ వ్యవస్థ అనేది
భారతదేశ మిస్సైల్ చరిత్రలో ఒక
ప్రత్యేకతను కల్గి ఉంది. ఈ
మిస్సైల్ వ్యవస్థలో ఆరు రకాల
మిస్సైల్స్‌ను రూపొందించారు.
ఒక్కో మిస్సైల్ ఒక్కో ప్రత్యేకతను
కల్గి ఉంది. వీటి వెనుక
భారతదేశపు డిఆర్‌డిఓ సంస్థ
శాస్తవ్రేత్తల కృషీ, శ్రమా ఎంతో
ఉంది. అగ్ని-5ను 19 ఏప్రిల్
2012 నాడు విజయవంతంగా
పరీక్షించారు.
అగ్ని-5
అగ్ని-5 అనేది 5 వేల
కిలోమీటర్ల దూరంలో ఉండే
లక్ష్యాన్ని ఛేదించడానికి
రూపొందించిన క్షిపణి. దీనే్న
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి
(ICBM - Inter
continental Ballestic
Missile) అంటారు. అణ్వస్త్ర
సామర్థ్యం కల్గిన ఈ అగ్ని-5ని
విజయవంతంగా ప్రయోగించి,
భారతదేశం కయ్యానికి
కాలుదువ్వే దేశాలకు
హెచ్చరికతో కూడిన సందేశాన్ని
ఇచ్చింది. దీని పొడవు 17.5
మీటర్లు, వెడల్పు 2 మీటర్లు.
ప్రయోగ సమయంలో దీని
బరువెంతో తెల్సా? కేవలం 50
టన్నులు. దీని రూపకల్పనలో
80 శాతం భాగాలు భారత్‌లోనే
తయారైనవే. దీన్ని ఏ ప్రాంతం
నుంచైనా ప్రయోగించడానికి
వీలుగా మొబైల్ లాంచర్ ఉంది.
ఇతర అగ్ని రకం క్షిపణులకు
భిన్నంగా దీనికి నేవిగేషన్,
డైరెక్షన్, వార్‌హెడ్, ఇంజన్
వంటి విభాగాల్లో ఆధునికతను
జోడించారు. సొంతంగా
రూపొందిన కాంపోజిట్ రాకెట్
మోటార్లు చక్కగా పని చేశాయి.
కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు
తప్ప మిగిలిన అన్ని భాగాలకీ
స్వదేశీ పరిజ్ఞానానే్న వాడారు.
ఈ ప్రాజెక్టు రూపకల్పనకి
దాదాపు 3 ఏళ్లు పట్టింది. గత
ఏడాది అగ్ని-4 ను
ప్రయోగించారు. అది 3.5
కి.మీ. పరిధిని కల్గింది.
అగ్ని-5 5 కి.మీ. పైబడిన
దూరాల్లోని లక్ష్యాలను ఇట్టే
ఛేదించగల క్షిపణిగా
రూపొందింది. ఈ అత్యాధునిక
క్షిపణి ప్రయోగంతో తొలిసారిగా
చైనా భూభాగం మొత్తం దీని
పరిధిలోకి వచ్చినట్లవడంతో
దీన్ని రక్షణ శాఖ పరంగా
‘అత్యంత కీలక అస్త్రం’గా
అందరూ పేర్కొంటున్నారు. ఇది
తూర్పు ఐరోపా, తూర్పు ఆఫ్రికా,
ఆస్ట్రేలియా తీరాలనూ
తాకగలదు. గత 15 ఏళ్లలో
తయారైన మధ్య, దీర్ఘశ్రేణి
క్షిపణుల్లో వరుసగా ఇది
ఐదవది. 2014 నాటికి దీన్ని
సైన్యంలో ప్రవేశపెట్టే సూచనలు
కనిపిస్తున్నాయి. మొదట
రూపొందించిన అగ్ని-1 పరిధి
700 మీటర్లే. అదే అగ్ని-2,
అగ్ని-3, అగ్ని-4 ల పరిధి
వరుసగా 2.5 కి.మీ. 3
కి.మీ. 3.5 కి.మీ.లు ఉండగా
అగ్ని-5 పరిధి 5 కి.మీ.లకు
పెరగడం గమనార్హం. 2014
నాటికి సైన్యంలో ప్రవేశపెట్టేలోగా
మరో రెండు పరీక్షలు
జరపనున్నారు శాస్తవ్రేత్తలు.
అగ్ని-1 పాకిస్తాన్‌ను దృష్టిలో
ఉంచుకొని (కార్గిల్ యుద్ధం
తర్వాత) కేవలం 18 నెలల
రికార్డు సమయంలో
రూపొందించారు. దాని
తర్వాతనే మిగిలిన (2,3,4)
క్షిపణుల రూపకల్పన జరిగింది.
తాజాగా ఈ ఏడాది అగ్ని-5
విజయవంతం కావడంతో,
ఖండాంతర బాలిస్టిక్
క్షిపణులున్న అమెరికా, రష్యా,
బ్రిటన్, ఫ్రాన్స్, చైనా దేశాల
సరసన భారత్ పేరు ఆరవ
దేశంగా పేర్కొనబడటం
మనకందరికీ గర్వకారణం!
*
భారతీయ అణ్వాయుధ క్షిపణులివే!
మిస్సైల్ శ్రేణి పరిధి పేలోడ్ స్థితి
అగ్ని-1 SRBM 700 కి.మీ. 1000 కిలోలు వాడుకలో ఉంది
అగ్ని-2 MRBM 2-3 కి.మీ. 500-1000 కిలోలు వాడుకలో ఉంది
అగ్ని-3 IRBM 5 కి.మీ. 2490 కిలోలు వాడుకలో ఉంది
అగ్ని-4 MRBM 3-3.8 కి.మీ. 500 - 1500 కిలోలు 2014-15కెల్లా వస్తుంది
అగ్ని-5 ICBM 5-6 కి.మీ. 3000 కిలోలు + 2014-15 కెల్లా వస్తుంది
అగ్ని-6 ICBM 5.2 - 10 కి.మీ.700-1400 కిలోలు అభివృద్ధి దశలో ఉంది
ధనుష్ SRBM 350 కి.మీ. 500 కిలోలు రెడీ, వాడటం లేదు
నిర్భయ్ SBCM 1000 కి.మీ. ? అభివృద్ధి దశలో ఉంది
బ్రహ్మాస్-1 SCM 290 కి.మీ. 300 కిలోలు వాడుకలో ఉంది
బ్రహ్మాస్-2 HCM 290 కి.మీ. 300 కిలోలు అభివృద్ధి దశలో ఉంది
పి-70 అమెథిస్ట్ ASM 65 కి.మీ. 530 కిలోలు వాడుకలో ఉంది
పి-270 మోఫ్కిట్SCM 120 కి.మీ. 320 కిలోలు వాడుకలో ఉంది
పోపియా ASM 78 కి.మీ. 340 కిలోలు వాడుకలో ఉంది
పృథ్వీ-1 SRBM 150 కి.మీ. 1000 కిలోలు వాడుకలో ఉంది
పృథ్వీ-2 SRBM 350 కి.మీ. 500 కిలోలు వాడుకలో ఉంది
పృథ్వీ-3 SRBM 350 కి.మీ. 500 కిలోలు వాడుకలో ఉంది
సాగరిక (కె-15)SLBM 700 - 2.2 కి.మీ.150-1000 కిలోలు వేచి ఉంది
కె-4 SLBM 3.5 కి.మీ. 150-1000 కిలోలు టెస్టింగ్
శౌర్య TBM 700 - 2.2 కి.మీ.150-1000 కిలోలు వాడుకలో ఉంది
=============
మిస్సైల్ రకాలు
SRBM -షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్
MRBM -మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్
SBCM -సబ్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్
IRBM -ఇంటర్మీడియెట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్
ICBM -ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్
SCM -సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్
HCM -హైపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్
ASM -యాంటీ షిప్పింగ్ మిస్సైల్
SLBM -సబ్‌మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిస్సైల్
TBM -టార్పెడో బాలిస్టిక్ మిస్సైల్
****