ఏదైనా సాధించాలన్నా, ఏ పనైనా చేయాలన్నా, ముందుగా ఆ పని గురించి సరైన అవగాహన ఉండాలి. ఒక ప్రణాళిక వేసుకొని, దాని ప్రకారం నడుచుకోవాలి. ఇది మనకి తెలిసిన విషయమే. అయితే, ఇవన్నీ ఎంత ముఖ్యమో, వీటికి అనుగుణంగా నిబంధనలు ఏర్పరచుకోవడం కూడా అంతే ముఖ్యం. అలా, కొన్ని నిబంధనలు పెట్టుకుని వాటిని పాటించినప్పుడే అనుకున్న పని నెరవేరుతుంది.
ఆ నిబంధనలు ఎలా ఉండాలి? ఇదే విధంగా ఆలోచించే వారు ఎవరైనా ఉన్నారా? వారు తమ విషయంలో ఎలాంటి నిబంధనలు ఏర్పరచుకుంటారు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం వెతికే ఉద్దేశంతో ఒక సైట్ రూపొందించబడింది. ఆ సైట్ అడ్రస్:
http://9rules.com/
అలా ప్రారంభించిన సైట్‌లో ముందుగా తమ నిబంధనల జాబితాని ప్రచురించారు. అవి:
* నువ్వు చేస్తున్న పనిని ప్రేమించు * నిరంతర విద్యార్థిగా ఉండు * అనుకున్న పనులకి కార్యరూపం కల్పించు * సరళత్వంలోనే అందం ఉంది * చేస్తున్న పని, తీరిక వేళలో అభిరుచులు - రెండూ ఆస్వాదించు * నీకు వచ్చే ఫలితం నీ కృషికి తగ్గట్టుగా ఉంటుంది * అందరి అభిప్రాయాలు కూడా ముఖ్యం * చేస్తున్న పని నిరంతరం మెరుగుపరచుకో * నీలో కలిగిన ఉన్నత భావాలను గౌరవించు
2003లో అలా మొదలైన ఈ సైట్ అతి తక్కువ కాలంలో ఎంతో ప్రజాదరణ పొంది రోజూ ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది పాల్గొనే సైట్‌గా పరిణితి చెందింది. ఆ తరువాత 2006లో సభ్యుల అభిప్రాయాలకి అనుగుణంగా ఈ సైట్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. సైట్‌లో సమాచారం పోస్ట్ చేసే సభ్యులు ఒకవైపు, రోజూ సైట్ సందర్శించేవారు మరొక వైపు - ఈ ఇరువురి అవసరాలు, సూచనలు దృష్టిలో పెట్టుకొని ఆ మార్పులు చేశాం అంటున్నారు సైట్ నిర్వాహకులు. ఆ మార్పులలో భాగంగా వారు ఈ సైట్‌ని ఇంటర్నెట్‌లో పలు ఆసక్తికరమైన, విలువైన సమాచారం అందించే బ్లాగ్స్‌తో అనుసంధానం చేశారు. అలా చేయడం వల్ల, ఈ సైట్ ఎన్నో మంచి బ్లాగ్స్ సమాహారంగా మారి, మరింత ప్రజాదరణ పొంది, ఎన్నో విషయాలపై సమాచారం పంచుకునే సైట్‌గా మార్పు చెందింది. ఎన్నో అంశాలు, వాటికి సంబంధించిన వివరాలు ఈ సైట్‌లో ఒక్కచోట ఉన్నాయి. విభిన్న విషయాలపై పలు విభాగాలుగా ఉన్న ఈ వివరాలను, సభ్యులు వారివారి అభిరుచికి తగ్గట్టుగా బ్రౌజ్ చేసి, తెలుసుకోవచ్చు. ఆ విభాగాల వివరాలు:
* కళలు * చదువు * యానిమేషన్ * డిజైన్ * వ్యాపారం * మార్కెటింగ్ * కార్లు, ఇతర వాహనాలు * కంప్యూటర్ ప్రోగ్రామింగ్ * సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు * ఫొటోగ్రఫీ
ఇంకా ఆటలు, సంగీతం, వినోదం, పలు రకాల రెసిపిలు, పర్యాటకం ఇలా ఇంకెన్నో విభాగాలపై సమాచారం ఒక్కచోట ఉండే సైట్‌గా పాపులర్ అయింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, పైన చెప్పినట్టుగా, ఆ విషయాలపై పలు ప్రజాదరణ పొందిన బ్లాగులలో ఉన్న సమాచారం కూడా ఇక్కడ పొందుపరచబడింది. అందువల్ల ఈ సమాచారం లేటెస్ట్‌గా, అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది.
ఏదైనా సాధించాలన్నా, ఏ పనైనా చేయాలన్నా, ముందుగా ఆ పని గురించి
english title:
9rules
Date:
Sunday, June 3, 2012