ఆంధ్రభూమి - నాటా సంయుక్తంగా
నిర్వహించిన అంతర్జాతీయ కథల పోటీకి
దేశ దేశాల తెలుగు రచయితలు బాగా స్పందించారు. ఔత్సాహిక యువ రచయితలతో బాటు పేరుమోసిన సీనియర్ రచయితలుకూడా సమధికోత్సాహంతో పాల్గొని పోటీని జయప్రదం చేశారు. పోటీద్వారా ఇతోధికంగా కథా సాహితీ సృజనకు ప్రోది చేయాలన్న మా సంకల్పం చాలా వరకు నెరవేరిందనే చెప్పవచ్చు. సంతోషం. స్పోర్టివ్ స్పిరిట్‌తో ఈ అంతర్జాతీయ పోటీలో పాలు పంచుకున్న రచయితలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
అయితే రాశిపరంగా కలిగిన ఆనందం కథల వాసిని గమనిస్తే మిగలలేదు. ఎన్నదగిన చక్కని కథలు కొన్ని వచ్చినప్పటికీ మొత్తంమీద చూస్తే ఇతివృత్తంలో, కథనంలో, శిల్పంలో ఈసారికూడా కొత్తదనం, వైవిధ్యం తక్కువనే చెప్పాలి. కృత్రిమ గర్భదారణ,
అమ్మతనం అమ్మకాల గురించి ఎక్కువ కథలు రావటం విశేషం. అన్ని కోణాలనుంచి నిశితంగా పరిశీలించిన మీదట బహుమతులను ఇలా నిర్ణయించాము.
1) 20వేల రూపాయల ప్రథమ బహుమతి
నిర్ణయం -సలీం
2) 10వేల రూపాయల ద్వితీయ బహుమతి
వంశవృక్షం -సింహప్రసాద్
తగువారము మేమే -చింతా జగన్నాథరావు
3) 5వేల రూపాయల తృతీయ బహుమతి
సృశాసని -వసుంధర
మట్టిమనిషి -బి.గీతిక
విజేతలకు అభినందనలు. బహుమతి ప్రదానం ఎప్పుడు జరిగేది త్వరలో తెలియజేస్తాం.
సాధారణ ప్రచురణకు ఎంపికైన కథల జాబితా వచ్చేవారం ఆదివారం అనుబంధంలో
ప్రకటిస్తాం. ప్రచురణార్హం కాని రచనల్లో తిరుగుకవరు
జతపరచిన వాటిని పది రోజుల్లో వెనక్కి పంపిస్తున్నాం.
-ఎడిటర్