దాదాపు 15 సంవత్సరాలు తర్వాత అభినేత్రి శ్రీదేవి షూటింగ్స్‌లో పాల్గొంటోంది. ఇంగ్లీష్ వింగ్లీష్ అనే కామెడీ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది తన కుమార్తెను హీరోయిన్‌గా చేస్తారా అని అడగడంపై తన సమాధానం చెప్పింది. నా కుమార్తె సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, ఈ విషయంపై తనకు కూడా సదభిప్రాయం లేదని, తన మాటే ఇంట్లో వేదమని చెప్పుకొచ్చింది. ఎప్పుడైనా పిల్లలు ఏదైనా కావాలి అంటే వాళ్ల నాన్న రికమండేషన్ చేయిస్తారని, అవి కూడా అన్నీ తాను ఒప్పుకోనని, ఏదైనాసరే తాను చెప్పినట్లే ఇంట్లో అందరూ నడవాల్సిందేనని చెప్పింది. ఇప్పుడైనా సరే తన కుమార్తెను మాత్రం సినిమా పరిశ్రమలోకి పంపించేది లేదని స్పష్టం చేసింది శ్రీదేవి. ఇన్నాళ్లు అనేక మంది కుర్ర హీరోలు శ్రీదేవితో తాము నటించకపోయినా ఆమె కుమార్తెతోనైనా నటిస్తామంటూ చకోరపక్షుల్లా ఎదురుచూశారు. ఈ వార్త వారికి చేదు మాత్రే!
దాదాపు 15 సంవత్సరాలు తర్వాత అభినేత్రి శ్రీదేవి
english title:
sridevi
Date:
Tuesday, June 5, 2012