చేయక చేయక ఓ అగ్ర కథానాయకుడితో టాలీవుడ్లో చిత్రం చేశానని, ఆ చిత్రం తనకు ప్లస్ పాయింట్‌గా మారి, అనేక అవకాశాలను తెస్తుందని ఇన్నాళ్లూ ఎదురుచూసిన లక్ష్మీరాయ్‌కి నిరాశే ఎదురైంది. చిత్రంలో తనవంతు కష్టం వంద శాతం పడి, అనేకరకాలుగా అంగాంగ ప్రదర్శన చేస్తూ, ఎక్స్‌పోజింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది లక్ష్మీరాయ్. ఈ దెబ్బతోనైనా తనకు అదృష్టం తిరుగుతుందని ఆశపెట్టుకున్నప్పటికీ సెన్సార్ కత్తెర రూపంలో నిరాశే ఎదురైంది. ఆమె నిర్మొహమాటంగా చేసిన ఎక్స్పోజింగ్ అంతా సెన్సార్ కత్తెరకు బలైపోయింది. ఏతావతా మిగిలిన రెండుమూడు ముక్కల్లో లక్ష్మీరాయ్‌ని బ్లర్చేసి చూపారట. దీంతో తన కష్టమంతా వృధాఅయిందని బాధపడుతోంది ఈ అమ్మడు. మొత్తానికి కొండంత ఆశపెట్టుకుని లక్ష్మికి వేదన మిగిలింది.
చేయక చేయక ఓ అగ్ర కథానాయకుడితో టాలీవుడ్లో
english title:
aasha nirasha
Date:
Tuesday, June 5, 2012