Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నగరానికి డెంగీ భయం!

$
0
0

హైదరాబాద్, జూన్ 4: వేసవి సందర్భంగా ఇప్పటికే నగరంలో ఎండలు మండిపోతుండటంతో వడగాలులతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి

తోడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే డెంగీ వ్యాధి బారిన పడి నగర శివార్లలోని బైరామల్‌గూడలోని గ్లోబల్ ఆస్పత్రిలో ఇద్దరు, మలక్‌పేట యశోద

ఆస్పత్రిలో మరొకరు మృతి చెందిన సంఘటన జరిగి వారంరోజులు కూడా కాకముందే నగరం నడిబొడ్డున మరో డెంగీ కేసు నిర్థారణ అయ్యింది. దీంతో

నగర ప్రజలు డెంగీ వ్యాధి భయంతో వణికిపోతున్నారు. ఇంతకుముందు మృతి చెందిన ముగ్గురు కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై అయిదేళ్ల

వయస్సు గలవారే.
అయితే తాజాగా కాచిగూడ సమీపంలోని నింబోలీఅడ్డా ప్రాంతంలో నివసించే ప్రసాస భారతీయుల కుటుంబంలోని ఏడాది వయస్సున్న ఓ చిన్నారికి డెంగీ

వ్యాధి నిర్థారణ కావటంతో నగరంలోనేగాక, శివారు ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. శివార్లలో డెంగీ తీవ్రరూపం దాల్చి

ముగ్గుర్ని పొట్టన బెట్టుకున్నా, స్పందించని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు కనీసం కోర్ సిటీలోనైనా ఈ వ్యాధి ప్రబలకుండా కనీస వ్యాధి నివారణ

చర్యలు కూడా చేపట్టకపోవటం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఆ తర్వాత పాతబస్తీలో కూడా ఓ యువకుడు డెంగీ బారిన పడి మృతి

చెందిన సంగతి తెల్సిందే! తాజాగా ఏడాది వయస్సు గల చిన్నారి ప్రస్తుతం కాచిగూడలోని సన్‌షైన్ ఆస్పత్రిలో మూడురోజులుగా చికిత్స పొందుతున్నట్లు

తెల్సింది. తొలుత ఆ చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నా, గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి కొంత మెరుగుపడినట్లు కూడా సమాచారం.

ప్రతి ఏటా ఈ రకంగా ఒక కాలం నుంచి మరో కాలంలోకి మారుతున్న సమయంలో డెంగీ, స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులు ప్రబలుతున్నా, జిల్లా వైద్య ఆరోగ్య

శాఖాధికారులు కనీసం కేసులు నిర్థారణ అయిన ప్రాంతాలను కూడా సందర్శించకపోవటం శోచనీయం. నింబోలిఅడ్డాలో అభం శుభం తెలియని ఏడాది

వయస్సున్న ఓ చిన్నారికి డెంగీ వ్యాధి సోకినట్లు స్థానిక ఆస్పత్రి వైద్యులు నిర్థారణ చేసినా, నేటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు కనీసం ఆ ప్రాంతంలో

పర్యటించిన పాపాన పోలేదు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి కనీసం అదే ప్రాంతంలో ఇతరులకు ఈ వ్యాధి సోకకుండా వ్యాధి నివారణ

చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

-- తాండూరులో రికార్డుల తనిఖీ --
కర్ణాటక, మహారాష్ట్ర నుంచి

అక్రమంగా మద్యం

తాండూరు, జూన్ 4: అక్రమ మద్యం రవాణా, కల్తీ మద్యం విక్రయం పట్ల ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్

నర్సిరెడ్డి హెచ్చరించారు. సోమవారం సాయంత్రం ఆయన తాండూరు ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. కర్ణాటక,

మహారాష్టల్ర నుంచి అక్రమంగా మద్యం సరఫరా అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే, అధిక ధరలకు మద్యం విక్రయించే వారి

భరతం పడతామన్నారు. క్లోరల్‌హైడ్రేట్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉపయోగించి నకిలీ మద్యం తయారు చేస్తున్నారని అటువంటి కేసుల్లో

ఎంతటివారున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. తాండూరు డివిజన్ పరిధిలో పెండింగ్ కేసులు పేరుకుపోయాయని వాటిని త్వరగా పరిష్కరించాలంటూ

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏటిఎంలో అగ్నిప్రమాదం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 4: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని ఐడిబిఐ బ్యాంక్ ఏటిఎంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం

ఉదయం జరిగిన ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల చోటు చేసుకుందా లేక దుండగుల దుశ్చర్యా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు

తెలిపారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు నష్టం వివరాలు తెలుస్తాయన్నారు.

భద్రతావలయంలో..

చంచల్‌గూడ జైలు

కోఠి సిబిఐ కార్యాలయంలో జగన్ విచారణ * ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనంహైదరాబాద్, సైదాబాద్, జూన్ 4: అక్రమాస్తుల కేసులో అరెస్టై

చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఎంపి జగన్మోహన్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిబిఐ

సోమవారం కోఠిలోని సిబిఐ కార్యాలయంలో విచారించింది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా మొదట ఆయనను దిల్‌కుషా అతిథి గృహంలో

విచారించాలని భావించిన సిబిఐ అధికారులు ఆ తరువాత చంచల్‌గూడ జైలు సమీపంలో ఉన్న జైళ్ళ శాఖ డిజి కార్యాలయ ఆవరణలోని ఆఫీసర్స్

మెస్‌లో విచారించారు. అయితే, మొదటిరోజు విచారణ సందర్భంగా అవసరమైన పలు కీలక ఫైళ్ళు, పత్రాలు, కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన ముఖ్యమైన

సమాచారాన్ని బయటకు తీసుకువచ్చే వీలు లేకపోవడంతో సిబిఐ అధికారులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో, రెండోరోజైన సోమవారం విచారణను

కోఠిలోని తమ కార్యాలయంలోనే చేపట్టారు.
జగన్‌ను విచారణకు తరలిస్తున్న సమయంలో చంచల్‌గూడ జైలు వద్ద భారీ భద్రతా చర్యలు చేపట్టారు. జైలు ప్రధాన ద్వారం వద్ద ప్రధాన రహదారికి

ఇరువైలా బారికేడ్లు ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులను మినహా ఇతరులను అనుమతించలేదు. జైలు పరిసర ప్రాంతాల్లో బాంబ్‌స్క్వాడ్, డాగ్

స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. జైలు నుంచి ప్రింటింగ్ చౌరస్తా, నల్గొండ చౌరస్తా, చాదర్‌ఘాట్‌ల మీదుగా కోఠి కార్యాలయం వరకు

రహదారిపై పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీ భద్రతావలయంలోనే జగన్ బయటకు రావడం, లోపలకు వెళ్ళడం జరిగింది. సోమవారం

ఉదయం 7 గంటలకే జైలుకు చేరుకున్న సిబిఐ అధికారులు 20 నిమిషాల తర్వాత జగన్‌ను బయటకు తీసుకువచ్చారు. అనంతరం నలుపురంగు

బుల్లెట్‌ప్రూఫ్ స్కార్పియో వాహనంలో జగన్‌ను ఎక్కించిన అధికారులు మరో ఏడు వాహనాల కాన్వాయ్‌తో ఆయనను కోఠిలోని సిబిఐ కార్యాలయానికి

తరలించారు. తిరిగి సాయంత్రం 5.10 గంటలకు అదే దారి వెంట జగన్‌ను అధికారులు జైలుకు తరలించారు.
నల్గొండ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌జాం...
విచారణ సందర్భంగా చంచల్‌గూడ జైలు నుంచి కోఠిలోని సిబిఐ కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో జగన్ వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.

నల్గొండ చౌరస్తాలో విపరీతమైన ట్రాఫిక్ ఉండడంతో జగన్ కాన్వాయ్ దాదాపు అరగంట పాటు ట్రాఫిక్‌లో నిలిచిపోయింది.
మంగళవారం నుంచి జరిపే విచారణను సైతం కోఠిలోనే చేపట్టాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ట్రాఫిక్ ఇబ్బందులు

తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించాలని పోలీసు అధికారులను సిబిఐ కోరినట్లు సమాచారం.

డ్రంకెన్ డ్రైవర్లకు కౌనె్సలింగ్ భేష్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 4: మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన కౌనె్సలింగ్ వల్ల

సత్ఫలితాలుంటాయని గ్లోబల్ రోడ్ సేఫ్టీ పార్ట్‌నర్‌షిప్(జిఆర్‌ఎస్‌పి) ట్రాఫిక్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీ డెస్ మేయర్స్ అన్నారు. సోమవారం ఆయన

గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన కౌనె్సలింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు

నడపడం వల్ల కలిగే అనర్థాలను పవర్‌పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించారు. అనంతరం డెస్ మేయర్ మాట్లాడుతూ డ్రంకెన్ డ్రైవర్లు తమతో పాటు

ఇతరుల ప్రాణాలకు చేటు తెస్తున్నారన్న విషయం గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిసిపి-1 పి.వి.ఎస్.రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్లు

ఏ.వి.శ్రీనివాస్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

ష్... గప్‌చుప్!
* ఇంజనీరింగ్ కాలేజీల
క్రమబద్ధీకరణ దరఖాస్తులు గోప్యం
* గోప్యం వెనకున్న అసలు
ఆంతర్యమేమిటీ?హైదరాబాద్, జూన్ 4: సార్...ఇపుడు మన హెచ్‌ఎండిఏ పరిధిలోని ప్రైవేటు ఇంజనీరింజ్ కాలేజీల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల

స్వీకరించాం కదా! అవి ఎన్ని వచ్చాయి.. అందులో ఏ ఏ కాలేజీలున్నాయి? అన్న ధర్మ సందేహానికి ష్..గప్‌చుప్! అని సమాధానమిస్తున్నారు

హెచ్‌ఎండిఏ అధికారులు. అయిదు జిల్లాల సమగ్రాభివృద్ధి కోసం రూపాంతరం చెందిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ

(హెచ్‌ఎండిఏ)లో అధికారులు ఇష్టారాజ్యమే కొనసాగుతున్నట్లు ఆరోపణ లొస్తున్నాయి.
ఎంతటి సమర్థవంతులైన కమిషనర్‌లు వచ్చినా, కొన్ని విభాగాల్లో సుదీర్ఘకాలంగా తిష్టవేసిన కొందరు అధికారులదే హవా కొనసాగుతుందనే

చెప్పవచ్చు. ప్రస్తుతం నిధుల కొరత, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న హెచ్‌ఎండిఏకు ఆర్థికంగా కొంతమేరకైనా ప్రయోజనాన్ని సమకూర్చేందుకు

గాను కొద్ది రోజుల క్రితం ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వ్యవహరించిన గ్రేటర్ కమిషనర్ ఎం.టి. కృష్ణబాబు హెచ్‌ఎండిఏ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా

వెలసిన ఇంజనీరింగ్ కాలేజీల క్రమబద్ధీకరణ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెల్సిందే! ఆయన హయంలో సుమారు 160 పైచిలుకు

ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు రెండు దఫాలుగా నోటీసులు జారీ చేసినా, ముందుకురాని యాజమాన్యాలు, ఈ కాలేజీలపై ఎలాంటి చర్యలు

తీసుకోవాలని కోరుతూ ఏఐసిటిఇతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కమిషనర్ లేఖలు రాయటంతో భయపడి క్రమబద్థీకరణకు ముందుకొచ్చిన సంగతి

తెల్సిందే! నిర్ణీత గడువులోపు క్రమబద్ధీకరణ దరఖాస్తులు సమర్పించకుంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్‌ఎండిఏ ఉన్నతాధికారులు ఒకటి

రెండుసార్లు హెచ్చరికలు జారీ చేయటంతో నిర్ణీత గడువుగా నిర్ణయించిన గత నెలాఖరు వరకు సుమారు 163 కాలేజీలు క్రమబద్ధీకరణకు

ముందుకొచ్చినట్లు వెల్లడించిన అధికారులు, ఆ కాలేజీల వివరాలను బయటపెట్టేందుకు ససేమిరా అంటున్నారు. మే నెలాఖరు వరకు డాక్యుమెంట్లు

సమర్పించుకునే అవకాశం కూడా కల్పించారు.
వీటిలో కొన్ని అనుమతుల్లేకుండా వెలసినట్లు, మరికొన్ని డెవలప్‌మెంట్ ఛార్జీలు చెల్లించకుండానే కొనసాగుతున్నట్లు గుర్తించిన అధికారులు ఆయా

కాలేజీల యాజమాన్యాల నుంచి తొలుత రూ. లక్ష ఫీజుతో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే మొత్తం 163 కాలేజీల వివరాలను బయటకు

పొక్కనివ్వకుండా అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించిన విషయాన్ని పరోక్షంగా

అంగీకరిస్తూ కాలేజీ యాజమాన్యాలే క్రమబద్ధీకరణకు ముందుకు రాగా, వాటి వివరాలను అధికారులు ఎందుకు బహిర్గతం చేయటం లేదన్నదే

చర్చనీయాంశంగా మారింది. ఈ కాలేజీల్లో కొన్ని రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులకు చెందినవి కావటంవల్లే అక్రమంగా కొనసాగుతున్నాయన్న

విషయం ప్రజల్లోకెళితే అప్రదిష్టకు గురై, మున్ముందు అడ్మిషన్లు తగ్గి, తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందంటూ పలు కాలేజీల యాజమాన్యాలు

ఆవేదన వ్యక్తం చేయగా, దాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జోన్లవారీగా

దరఖాస్తులు స్వీకరించామని, వాటిని జోన్ల వారీగానే పరిష్కరించాలన్న ఆదేశాలున్నాయని కొందరు అధికారులు చెబుతున్నా, కాలేజీల వివరాలు

తార్నాకలోని ప్రధాన కార్యాలయానికి రానేరావా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
క్రమబద్ధీకరణకు వచ్చిన కాలేజీల వివరాలు కనీసం కమిషనర్ అధ్యయనం చేసేందుకైనా జాబితాను రూపొందించరా? అన్న ప్రశ్నకు అధికారుల

వౌనమే సమాధానమైంది. క్రమబద్ధీకరణకు ప్రభుత్వమే అవకాశం కల్పించినందున, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రైవేటు

ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ముందుకొచ్చినందున, హెచ్‌ఎండిఏ అధికారులు తమ విధి నిర్వహణలో చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు

దరఖాస్తుల వివరాల్ని బహిర్గతం చేయాలన్న వాదన ఉంది.

‘మీకోసం’కు వినతుల వెల్లువ

హైదరాబాద్, జూన్ 4: ప్రజాసమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ‘మీకోసం’ కార్యక్రమానికి మండు వేసవిని సైతం లెక్కచేయకుండా నగరవాసులు

తరలివచ్చి తమ సమస్యలను విన్నవించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ నటరాజన్ గుల్జార్ పాల్గొని

పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ముఖ్యంగా ఇళ్ళు, రుణాలు, ఆపద్బంధు పథకం, ఉద్యోగాలు, కళాశాలల్లో సీట్ల కోసం అర్జీలు వచ్చాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చాలా మంది ఇళ్ళ కోసం పదేపదే కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారని, అయితే, సీనియారిటీ ప్రకారమే ఇళ్ళ

కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. 2003 నుంచి 2007 మధ్యలో పేర్లు నమోదు చేసుకున్న 160 మందికి సికింద్రాబాద్ డివిజన్‌లో ఇళ్ళ

కేటాయింపు జరుగుతుందని తెలిపారు. పిఏసి స్టీరింగ్ కమిటీ మీటింగ్ కోసం సంక్షేమశాఖలు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. వికలాంగుల

శాఖ ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన అభ్యర్థులకు త్వరలో మెరిట్ ప్రకారం 23 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలుగా వచ్చే సోమవారం

నివేదిక సిద్ధం చేసి తీసుకురావాలని వికలాంగుల శాఖ అధికారులతో పాటు ఏజెసిని కలెక్టర్ ఆదేశించారు. డైలీ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్

ఉపాధ్యక్షుడు ఎస్.సుదర్శన్, ఎస్‌కె అలీ, సూరిబాబు, సత్యనారాయణ, మద్దిలేటిలు ఎన్‌ఆర్‌ఆర్ పురం, శ్రీరాంనగర్, బోరబండల్లో తమకు ప్రభుత్వం

16 ఏళ్ళ క్రితం ఇచ్చిన పట్టాల్లో నివాసం ఉంటున్నామని, ఇటీవల స్థానిక మండలాధికారి పంపిన అధికారిగా తిరుపతయ్య అనే వ్యక్తి ఇంట్లో

యజమానులు లేని సమయంలో ఆడవాళ్ళ దగ్గరకు వచ్చి ఇంటి పట్టాలు, రేషన్‌కార్డులు, ఫొటోలు ఇవ్వాలని అడిగి రూ.10లక్షలు ఒక్కో పట్టాకు

ఇవ్వకపోతే వాటిని రద్దు చేస్తామని బెదిరిస్తున్నాడని, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కలెక్టర్‌కు విన్నవించారు.

లాల్‌దర్వాజ హోం నగర్ నుంచి సి.యాదయ్య తన ఇంటి పక్కన 100 గజాల స్థలాన్ని స్థానిక వ్యక్తి ఆక్రమించుకుంటున్నాడని అతడి నుంచి స్థలాన్ని

కాపాడి ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలని కలెక్టర్‌ను కోరారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి స్థానిక జవహర్‌నగర్‌లోని

అంగన్‌వాడీ కేంద్రం చిన్న గదిలో ఉండి పిల్లలు ఎండకు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే స్థానిక బాలజ్యోతి పాఠశాలలో అందుబాటులో ఉన్న

స్థలంలో కొత్త కేంద్రాన్ని నిర్మించి ఇవ్వాలని అర్జీ పంపించారు. సికింద్రాబాద్‌కు చెందని ఒక యువతి తన తల్లిదండ్రులు ఇటీవలే హెచ్‌ఐవితో

మృతిచెందారని, ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన తనకు రెండో సంవత్సరం చదువుకోవడానికి శ్రీచైతన్య కళాశాలలో అవకాశం

కల్పించాల్సిందిగా అభ్యర్థించింది. వీరితో పాటు పలువురి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ త్వరితగతిన వాటిని పరిష్కరించాలని సంబంధిత

అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఇ.శ్రీ్ధర్, ఏజెసి వై.సత్యానందం, డిఆర్‌ఓ మదన్‌మోహన్‌రావు, ఆర్‌డిఓలు రవీందర్,

హరీష్ తదితరులు పాల్గొన్నారు.

* నింబోలిఅడ్డాలో తాజాగా కేసు * ఏడాది చిన్నారికి వ్యాధి నిర్థారణ * పత్తాలేని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
english title: 
dengue

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>