చంద్రకాంత్ సింగ్ (36) చైతన్య గురుకుల్ పబ్లిక్ స్కూల్‌ని స్థాపించి దాని ద్వారా బీహార్‌లో గోపాల్ గంజ్ జిల్లాలోని చమన్‌పురా గ్రామంలో బీద పిల్లలకి విద్యాదానం చేస్తున్నాడు. క్లాస్‌రూంలో టీచర్‌గాని, బ్లాక్‌బోర్డుగానీ ఉండవు. వందలమైళ్ల దూరంలోని టీచర్ స్కైప్ ద్వారా పిల్లల అటెండెన్స్‌ని బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా తీసుకుంటాడు. ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా లేదు. ఈ కంప్యూటర్స్ రెండు పెద్ద పెద్ద జనరేటర్స్ ద్వారా ఉత్తత్తి అయ్యే విద్యుత్తుతో పనిచేస్తాయి. బీహార్‌లోని వెనుకబడ్డ ఈ గ్రామాన్ని అతను ఎన్నుకుని ఒకటో క్లాసునుంచి ఏడోక్లాసు దాకా తరగతులని నిర్వహిస్తున్నాడు. 3 నెలలో వంద మంది గ్రామస్థులు ఎకరంలో మూడో వంతు చొప్పున భూమిని, అతని తపనని గమనించి, మార్కెట్ రేట్‌లో మూడో వంతుకి ఈస్కూల్ కోసం అమ్మి తమ వంతు సహాయం చేసారు. 45 తరగతులు, రెండు వైపై ఫ్లోర్స్, లైబ్రరీ, 17 కంప్యూటర్లు గల ఈ స్కూల్ ఏప్రిల్ 20, 2010న 500 మంది విద్యార్థులతో ఆరంభమైంది. రిక్షాలాగేవాడి కొడుకు, డాక్టర్, ఇంజనీర్ల పిల్లలు ఇలా ఎలాంటి ఆర్థిక అసమానతలని పట్టించుకోకుండా విద్యార్థులని ఈ స్కూల్లో చేర్చుకున్నారు. టీచర్లకి రెండు నెలల శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకి హాస్టల్ సౌకర్యం ఉంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ప్రకారం హాస్టల్ ఫీజు వసూలు చేస్తారు. చంద్రకాంత్‌సింగ్ కిరోసిన్ వెలుతురులో విద్యనభ్యసించి ఇపుడు బెంగుళూరులోని జనరల్ మోటార్స్‌లో ఆర్ అండ్ డి రిసెర్చి శాఖలో పనిచేస్తున్నాడు. అతని స్వస్థలం చమన్‌పురానే. అక్కడ పాఠశాల లేదు. వచ్చి పని చేయడానికి టీచర్లు సిద్ధంగా లేకపోవడంతో ఇంటర్నెట్ పాఠాల స్కూల్‌ని స్థాపించాడు.
చంద్రకాంత్ సింగ్ (36) చైతన్య గురుకుల్ పబ్లిక్
english title:
spoorthi
Date:
Wednesday, June 6, 2012