Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

డైవోర్స్

$
0
0

పెళ్లిళ్లు స్వర్గంలో. విడాకులు భూమీద. అయితే ఎవరూ తాము విడాకులు తీసుకోవాల్సి వస్తుందని పెళ్లి సమయంలో అనుకోరు. కొన్ని వింత కారణాల వల్ల కొందరు దంపతులు విడాకులు తీసుకుంటుంటారు.

నార్త్ ఇండియాకి చెందిన భోంస్లే, సౌత్ ఇండియాకి చెందిన సరోజినిని వివాహం చేసుకున్నాడు. త్వరలోనే సరోజిని అతన్నించి విడాకులు కోరుకుంది. కారణం అతని మాతృభాష! అతనితో కలిసి డాక్టర్ దగ్గరికి కాని, ఛార్డర్డ్ ఎకౌంటెంట్ దగ్గరకి కాని వెళ్తే, వారితో అతను తన మాతృభాషలోనే మాట్లాడటం ఆమెకి నచ్చలేదు. అంతేకాక తన ముందు తన కుటుంబ సభ్యులతో అతను అతని మాతృభాషలో మాట్లాడడం కూడా ఆమెకి నచ్చలేదు. తననుంచి మాట్లాడే విషయాలని తనకి తెలీని భాషలో మాట్లాడి గోప్యంగా ఉంచడంతో విడాకులు తీసుకుంది.

ఇలా అన్నారు...

నా అంత అదృష్టవంతుడు లేడు. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుని నా తలని ఓవెన్‌లో ఉంచితే అందులో నాకు కేక్ కనబడింది.
-లెస్లీ బూన్

దురదృష్టపు దొంగ

పెన్సిల్వేనియా.. లిబర్టీ అనే ఊరు.. అక్కడ సిటిజన్స్ అండ్ నార్తరన్ బేంక్. అదనుచూసి క్రిస్ట్ఫ్‌ర్ అలెన్ కోచ్ (28) అనే దొంగ ఉదయం పదకొండున్నరకి దొంగతనం చేయడానికి ప్రవేశించాడు. అతని మొహానికి ఉన్న స్కై మాస్క్, చేతులకి ఉన్న గ్లవ్స్, చేతిలో తుపాకిని చూసి అక్కడి వాళ్ళు చేతులు పైకెత్తారు. ఆ దొంగకి తెలియనిది బేంక్ మూసేసి చాలా కాలమైందని! బేంక్ బిల్డింగ్‌లోని కూలీలు అతనికారు నంబర్ని పోలీసులకి అందించడంతో పోలీసులు ఆ దొంగని అరెస్టు చేశారు.

పెళ్లిళ్లు స్వర్గంలో. విడాకులు భూమీద.
english title: 
divorce
author: 
- నిర్వహణ - మల్లాది వెంకటకృష్ణమూర్తి writermalladi@gmail.com

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>