లండన్ అంటే
ముందుగా
గుర్తుకొచ్చేది
‘బిగ్‌బెన్’ క్లాక్
టవర్. బ్రిటన్
రాచరిక వ్యవస్థతో
మమేకమైన ఈ
టవర్‌ను
వెస్ట్‌మిన్‌స్టర్
ప్యాలెస్ ఉత్తర
దిక్కున
నిర్మించారు.
1858లో
బిగ్‌బెన్ నిర్మాణం
పూర్తయింది.
2009లో
బిగ్‌బెన్ 150వ
వార్షికోత్సవాన్ని
ఘనంగా
నిర్వహించారు.
ఘన చరిత్ర ఉన్న
బిగ్‌బెన్ పేరును
ఇకపై ‘ఎలిజబెత్
టవర్’గా
పిలవాలని బ్రిటన్
ప్రభుత్వం
నిర్ణయించినట్టు
సమాచారం.
ఎలిజబెత్ రాణి
సింహాసనం
అధిష్టించి 60
సంవత్సరాలు
పూర్తయిన
సందర్భంగా
‘బిగ్‌బెన్’ను
‘ఎలిజబెత్
టవర్’గా
మార్చాలన్న
ప్రతిపాదనకు
ప్రధాని డేవిడ్
కామెరాన్, నిక్
క్లెగ్, ఎడ్
మిలీబాండ్
తదితరులు
మద్దతు
ప్రకటించినట్టు
‘డైలీ మెయిల్’
పత్రిక ఒక
కథనాన్ని
ప్రచురించింది.
కాగా,
‘బిగ్‌బెన్’ను
తొరిరోజుల్లో ‘ది
కింగ్స్ టవర్’ అని
కూడా
పిలిచేవారు.
దేవుడికి
కృతజ్ఞతలు..
భగవంతుడ్ని
నిత్యం కోరికలు
కోరేవారేగానీ,
అవి తీరిన
తర్వాత
కృతజ్ఞతలు తెలిపే
సంప్రదాయం
ఎక్కడా
కనిపించదు.
కానీ,
బొలీవియాలో
దేవుడికి
కృతజ్ఞతలు
చెప్పడానికి
ఏకంగా ఓ
ఉత్సవానే్న
నిర్వహిస్తారు.
ఏటా జూన్
మాసంలో లా
పాజ్ పట్టణంలో
భక్తులంతా వివిధ
వేషధారణతో
ప్రదర్శన
నిర్వహిస్తారు.
జన్మించిన
మరుక్షణం నుంచి
తమను
కాపాడుతున్న
దేవుడికి ఈ
విధంగా
ఆటపాటలతో
బొలీవియా
ప్రజలు
కృతజ్ఞతలు
తెలపుకొంటారు.
కోరికలు తీరిన
తర్వాత
మొక్కులు
చెల్లించుకోవడమే
మనకు
తెలుసుగానీ,
థాంక్స్ చెప్పే
ఆనవాయితీ
లేదు. అందుకే,
ఇలాంటి
ఉత్సవాలు,
వేడుకలు
కొత్తగానూ,
విచిత్రంగానూ
కనిపిస్తాయి.
అనుకోని అతిథి!
తైవాన్ నుంచి
కాలిఫోర్నియాకు
విమానంలో
సుమారు 10
గంటల
ప్రయాణం.
ప్రయాణికులతో
విమానాలు
ఎప్పుడు
కిటకిటలాడుతుం
టాయి. ఇంత
హడావుడి
జరుగుతున్నా
ఎక్కడి నుంచి
వచ్చిందో? ఎలా
వచ్చిందో
తెలీదుగానీ ఓ
‘సాంగ్ బర్డ్’
విమానంలోని
ప్యాసింజర్స్
బోర్డ్‌పై
దర్శనమిచ్చింది.
కాలిఫోర్నియాలో
భద్రతా సిబ్బంది
ఈ అనుకోని
అతిథిని గుర్తించి
పట్టుకున్నారు.
పిట్టలుగానీ,
జంతువులుగానీ
ప్రవేశించినా,
గంటల తరబడి
ఒకే చోట
ఉండవు. కానీ,
ఈ సాంగ్ బర్డ్
మాత్రం దర్జాగా
కాలిఫోర్నియా
చేరింది.
జంతులు,
పక్షులను
స్మగ్లింగ్ చేసే
ముఠా ఏదైనా ఈ
పిట్టను
విమానంలోకి
తీసుకొచ్చి
అక్కడ
ఉంచారా? లేక
తనిఖీలకు
భయపడి అక్కడ
వదిలారా? అన్న
దిశగా విచారణ
కొనసాగుతున్నది
. నిజానిజాలు
ఎలావున్నా... ఆ
సాంగ్ బర్డ్ మాత్రం
ఠీవిగా
విమానయానం
చేసింది.
అదృష్టమంటే
దానిదే.