హాల్స్‌స్టట్
పట్టణం
ఆస్ట్రియాలో
ఉంది. కానీ,
గాంగ్‌డాంగ్
ప్రాంతంలోని
హుషోవూ
నగరానికి వెళితే
హాల్స్‌స్టట్
దర్శనమిస్తుంది.
మనం ఉన్నది
ఆస్ట్రియాలోనా
లేక చైనాలోనా
అన్న
అనుమానం
అక్కడికి వెళ్లిన
ప్రతి ఒక్కరినీ
వేధించక
మానదు. ఐరోపా
తరహా గృహ
నిర్మాణాలకు
ఆస్ట్రియా ప్రసిద్ధి
చెందితే,
పురాతన వాస్తు
నైపుణ్యం
హాల్స్‌స్టట్‌లో
అడుగడుగునా
కనిపిస్తుంది.
అందుకే చైనాకు
చెందిన ఓ
వ్యాపారి
హాల్స్‌స్టట్
పట్టణంలోని
నిర్మాణాలను
ఏమాత్రం తేడా
లేకుండా తమ
నగరంలో
ప్రతిష్ఠించాడు.
వాస్తవానికి
హాల్స్‌స్టట్‌లో
కొన్ని శతాబ్దాల
క్రితం నిర్మించిన
భవన
సముదాయాన్ని
యునెస్కో
అంతర్జాతీయ
వారసత్వ
సంపదగా
గుర్తించింది.
అక్కడ
కట్టుదిట్టమైన
భద్రత కూడా
ఏర్పాటు చేసింది.
అయితే,
అంగుళం కూడా
తేడాలేకుండా ఆ
కట్టడాలనే
హుషోవూలో
చైనీయులు
పునఃప్రతిష్ఠించార
న్నది ఇప్పుడు
అందరినీ
ఆశ్చర్యానికి
గురిచేస్తున్న
ప్రశ్న. చైనా
ఆర్టిటెక్ట్‌లు
ప్రపంచంలోని
ఎలాంటి
కట్టడాన్నయినా
క్షణాల్లో
అధ్యయనం చేసి,
వాటిని పోలిన
నిర్మాణాలను
ఎలాంటి
పొరపాట్లు
లేకుండా
పూర్తిచేయగలర
ని హుషోవూలో
హాట్స్‌స్టట్ భవన
సముదాయాన్ని
చూస్తే
స్పష్టమవుతుంది
. శాస్తస్రాంకేతిక
రంగాల్లోనేకాదు..
. కాపీ
కొట్టడంలోనూ
చైనా ప్రపంచ
దేశాలను
మించిపోతున్నది
.