సాఫ్ట్‌వేర్ వంటి
అతికొద్ది
రంగాలను చూసి
మురిసిపోతు
న్నాం. దేశం
అభివృద్ధి పథంలో
దూసుకుపోతు
న్నదని
సంబరపడుతు
న్నాం. కానీ,
నిరుద్యోగ సమస్య
రోజురోజుకూ తీవ్ర
రూపం
దాలుస్తున్నది.
సుమారు 120
కోట్ల జనాభాలో
సగానికంటే
ఎక్కువ శాతం
మంది నిరుద్యోగం
లేదా ప్రచ్ఛన్న
నిరుద్యోగంతో
అల్లాడుతున్నారు
. సరైన ఉపాధి
అవకాశాలు
లభించక
యువత
దిక్కుతోచని
స్థితిలో
కొట్టుమిట్టాడుతోం
ది. గత వారం
ఇండియన్ రైల్వే
రిక్రూట్‌మెంట్
బోర్డు ప్రకటించిన
ఖాళీలకు
దేశవ్యాప్తంగా
లక్షలాది మంది
నిరుద్యోగులు
దరఖాస్తు
చేసుకున్నారు.
ఒక్క
అలహాబాద్‌లోనే
సుమారు
1,30,000
మంది అభ్యర్థులు
పరీక్ష
రాయడానికి
వచ్చారు.
హోటల్ గదులు
దొరక్కపోవడంతో
వేలాది మంది
ఇలా రైల్వే
స్టేషన్‌లోనే బస
చేశారు.
నిరుద్యోగులు
ఎదుర్కొంటున్న
కష్టాలకు ఇదో
ఉదాహరణ
మాత్రమే.
డిమాండ్
పెరుగుతోంది..
ఆర్థిక మాంద్యం
పరిస్థితులు
ప్రపంచ దేశాలను
అతలాకుతలం
చేస్తున్నాయి.
విదేశీ మారక
నిల్వలు
గణనీయంగా
పలచపడుతు
న్నాయి. కానీ
బల్గేరియాలో
‘రోజ్ ఆయిల్’
ఉత్పత్తులపైగానీ,
ఎగుమతులపైగా
నీ ఆర్థిక
మాంద్యం
ప్రభావం ఏమాత్రం
లేకపోగా, వాటికి
డిమాండ్
మరింతగా
పెరిగింది.
ఈఏడాది రోజ్
ఆయిల్
ఎగుమతులు
25 శాతం
పెరుగుతాయని
అంచనా.
బల్గేరియా రోజ్
వ్యాలీలో
ప్రపంచంలోనే
అతి పెద్ద గులాబీ
తోటలున్నాయి.
అక్కడ లభించే
గులాబీల నుంచి
నాణ్యమైన నూనె
తయారవుతుంది
. మొరాకో, టర్కీ
తదితర దేశాల
నుంచి గట్టిపోటీ
ఉన్నప్పటికీ
బల్గేరియా రోజ్
ఆయిల్‌కే
డిమాండ్
ఎక్కువగా ఉంది.
అమెరికా, ఫ్రాన్స్,
జర్మనీ, జపాన్,
యుకె వంటి
దేశాలు
బల్గేరియా రోజ్
ఆయిల్‌ను
ఎగబడి
కొంటున్నాయి.
నాణ్యత బాగుంటే
డిమాండ్‌కు
కొదువ ఉండదని
బల్గేరియా రోజ్
ఆయిల్‌కు ఉన్న
గిరాకీ స్పష్టం
చేస్తున్నది.
డైటింగ్ చేస్తున్న
మార్జాలం!
‘స్పాంజ్ బాబ్’
అంటే ఆషామాషీ
పిల్లి కాదు.
ప్రపంచంలోనే
అతి బరువైన
మార్జాలం.
జంతువుల్లోనూ
స్థూలకాయం
సమస్య ఉందని
చెప్పడానికి
నిలువెత్తు
సాక్ష్యం. దీని
బరువు ఏకంగా
13.5 కిలోలు.
ఊబకాయంతో
కదలలేని
పరిస్థితికి
చేరుకున్న ఈ
పిల్లి ఇప్పుడు
డైటింగ్
చేస్తున్నది.
న్యూయార్క్‌లోని
‘యానిమల్
హెవెన్’లో ఈ
మార్జాలానికి
ప్రత్యేక గదిని
కేటాయించారు.
స్పాంజ్ బాబ్
ఉన్న గదిలో
ఒకటి రెండు
ఎలుకలను
వదులుతున్నా
రు. పిల్లి వేటను
కొనసాగిస్తుందని,
తత్ఫలితంగా
బరువు
తగ్గుతుందని
ఆశ. క్యాలరీలను
కొలిచి మరీ
ఆహారాన్ని
అందిస్తున్నారు.
అయినా
యానిమల్
హెవెన్‌లో ఎవరూ
దానిపై కనికరం
చూపడం లేదు.
నడవడానికి
కూడా ఇబ్బంది
పడుతున్న
స్పాంజ్ బాబ్‌ను
చూసి ‘అంతా నీ
మంచికే’ అంటూ
నచ్చచెప్తున్నారు
. ఈ పిల్లిగారు
డైటింగ్ చేసి ఎన్ని
కిలోల బరువు
తగ్గుతారో
చూడాలి.