వెంకటేశ్వర్రావుకు
ఈ మధ్య కొత్త
రకం టెన్షన్
పట్టుకుంది.
టెన్షన్ అంటే
ఏమిటి అన్నది
తెలుసుకోవాల
న్నది ఆ టెన్షన్.
ఆఖరికి ఓ
సైక్రియాటిస్టు
దగ్గరకు వెళ్లి
అడిగాడు.
ఆయన చిత్రంగా
ఓ చూపు చూసి,
అయిదు వందలు
కన్సల్టేషన్ ఫీజు
వసూలు చేసి
ఇలా చెప్పాడు.
మీరు స్కూటర్‌పై
వెళ్తుంటే
అమ్మాయి లిఫ్ట్
అడిగింది. తీరా
లిఫ్ట్ ఇచ్చాక,
కళ్లు తిరిగి మీపై
వాలింది.
అదెందుకో
తెలియక మీకు
కలిగే గాబరానే
టెన్షన్.
సరే, ఆమెను
ఆసుపత్రికి
తీసుకెళ్లారు.
డాక్టర్ పరీక్ష చేసి,
‘కంగ్రాట్స్ మీరు
తండ్రి
కాబోతున్నారు’
అన్నాడు.
అప్పుడు మీకు
కలిగేది మరింత
టెన్షన్.
‘నాకే సంబంధం
లేదని
మీరంటారు’.
‘కాదు మీరే తన
కడుపులో బిడ్డకు
తండ్రి’ అని ఆ
అమ్మాయి
అంటుంది.
దీంతో మీకు
ఇంకొంచెం టెన్షన్.
పోలీసులు,
డీఎన్‌ఎ టెస్టు.
టెన్షన్ టెన్షన్.
ఆఖరికి రిపోర్టులు
వస్తాయి. ‘అసలు
మీరు తండ్రే
కాలేరని’ నిర్ధారణ
అవుతుంది.
దాంతో ఒక
రిలీఫ్, ఒక
టెన్షన్.
కేసు నుంచి
బయటపడి
ఇంటికి వస్తారు.
ఇంట్లో ఎదురుగా
మీ ముగ్గురు
పిల్లలు.
అప్పుడు మీకు
మొదలయ్యేదే
అసలైన టెన్షన్.
నేను నా భార్య
ఇరవై ఏళ్ల పాటు
హాయిగానే
బతికాం. ఆ
ఇరవై ఏళ్ల
తరువాతే మాకు
పెళ్లయింది.
తెల్లవారు
ఝామున
వేగంగా కారులో
వెళ్తున్న
వెంకటేశ్వర్రావు
ను ఆపాడు
పోలీస్.
‘ఈ టైమ్‌లో
ఎక్కడికి’
అడిగాడు పోలీస్.
‘లెక్చర్
వినడానికి’
సమాధానం
చెప్పాడు.
‘సబ్జెక్ట్ ఏమిటి’
‘మద్యం,
సిగరెట్టు వంటి
చెడు అలవాట్ల
వలన, రాత్రి
ఆలస్యంగా
ఇంటికి చేరడం
వలన వచ్చే
పరిణామాలపై’
‘అర్ధరాత్రి దాటాక
నీకోసం లెక్చర్
ఇచ్చేదెవరు’
నమ్మకం చాలక
అడిగాడు పోలీస్.
‘నా భార్య.. ఇంటి
దగ్గరే’
బదులిచ్చాడు
వెంకటేశ్వర్రావు.
కారు కూత
వెంకటేశ్వర్రావు
భార్యకు కొత్త
కారు కొనిచ్చాడు.
ఓ రోజు అతగాడు
ఆఫీసులో
వుండగా భార్య
ఫోన్ చేసింది.
‘కారు
కార్బొరేటర్‌లో
నీళ్లు చేరాయి.
నువు అర్జంట్‌గా
రావాలి’
‘అరె అలాగా..
ఇంతకీ
కారెక్కడుంది’
‘చెరువులో’
చెప్పింది
వెంకటేశ్వర్రావు
భార్యామణి.