వింతలూ, విడ్డూరాలూ అనేవి ప్రపంచమంతా ఉన్నాయ్‌గానీ ‘్ఫర్స్’ అనేది కేవలం ఇండియాలోనే దొరుకుతుంది.
ఇండియాలో ఎక్కడ చూసినా ఫార్సే! ఏ డిపార్ట్‌మెంట్‌లో చూసినా ఫార్సే!
అన్నిట్లోకీ పెద్ద ఫార్స్ మన జుడిషరీలోనే ఉంది.
ఏ కేస్ అయినా సరే దశాబ్దాల తరబడి కోర్ట్‌లోనే కాపురం చేస్తూంటుంది.
ఎంత పెద్ద ఫ్రాడ్ కేస్ అయినా సరే - ఫ్రాడ్ చేసినవాడు తనకు శిక్ష పడేలోగానే సెంచరీ పూర్తి చేసుకుని పైకెళ్లి అక్కడి నుంచి మన కోర్ట్‌లను చూసి విరగబడి నవ్వుతూంటాడు.
ఇక పోలీస్ డిపార్ట్‌మెంట్ సరేసరి.
జడ్జీగారు పోలీసాఫీసర్ని అడుగుతాడన్నమాట.
‘ఏమయ్యా! ఫలానా గాళ్స్ హాస్టల్లో ఒకమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసిన కేస్ ఎంతవరకూ వచ్చింది?’
‘ఇన్‌వెస్టిగేషన్ అవుతోంది సార్! ఇంకో అయిదు పదేళ్లల్లో ఛార్జ్‌షీట్ సబ్మిట్ చేస్తాం!’
‘ఆ అమ్మాయిని రేప్ అండ్ మర్డర్ చేసిన నేరస్థుడు ఒక పోలీసాధికారి అని మీడియాలో రిపోర్ట్స్‌తోపాటు సాక్షులు కూడా స్టేట్‌మెంటిచ్చారు కదా’
‘అవునండీ - ఇచ్చారు’
‘మరా అధికారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?’
‘ఇన్‌వెస్టిగేషన్ పూర్తవందే అరెస్ట్ చేయటం కుదరదు సార్’
‘ఎందుక్కుదర్దు’
‘ఎందుక్కుదరదు? అరెస్ట్ చేశాక కూడా ఇన్‌వెస్టిగేషన్ చేయవచ్చు కదా?’
‘ఎలా చేస్తాన్సార్ - నన్ను అరెస్ట్ చేశాక ఇంక ఇన్‌వెస్టిగేషన్ ఎలా చేస్తాను’
‘అంటే నువ్వే ముద్దాయి - నువ్వే ఇన్‌వెస్టిగేటింగ్ ఆఫీసరువా?’
‘అవున్సార్’
‘ఇది దారుణం! నీ మీద కేస్ నువ్వే ఇన్‌వెస్టిగేట్ చేస్తావా? ఏడీ - మీ డీజీపీ - డీజీపీగారూ - ఏంటండీ ఈ ఫార్స్?’
‘సారీసార్ - మా డిపార్ట్‌మెంట్‌లో స్ట్ఫా షార్టేజ్ ఉంది. అందుకని అతన్ని అరెస్ట్ చేయటం కుదరదు’
ఇలా ఈ ఫార్స్ ఎంత దూరమయినా వెళ్తుంది.
రైల్వేలో ఇంకో రకం ఫార్స్!
‘జనరల్ మేనేజర్‌గారూ! ఫలానా ట్రెయిన్ యాక్సిడెంట్‌లో ఎంతోమంది పాసింజర్స్ చనిపోయారు కదా! ఆ యాక్సిడెంట్‌కి కారణమయిన రైల్వే అధికారులను ప్రాసిక్యూట్ చేశారా?’
‘చేశాం సార్’
‘కానీ ఆ రైలు ప్రమాదానికి అసలు కారకుడయిన సీనియర్ డివిజనల్ ఇంజనీర్ అసలు మా కోర్ట్‌కే రాలేదు కదా?’
‘వస్తాడు సార్- యాక్సిడెంట్ జరిగి పదేళ్లే కదా అయింది’
‘కానీ అసలు ఒకసారయినా అతనిని నా ముందు హాజరు పర్చాలని చెప్పాను కదా!’
‘అందుకే నేను వచ్చాన్సార్’
‘వ్వాట్ - అంటే మీరే ఆ ఇంజనీరా?’
‘అవున్సార్’
‘కానీ మీరు జనరల్ మేనేజర్ కదా!’
’యాక్సిడెంట్ అవగానే నాకు వరుసగా చాలా ప్రమోషన్స్ ఇచ్చారు సార్ - అందుకని జనరల్ మేనేజరయిపోయాను’
‘కానీ ఒక నేరస్థుడికి అన్ని ప్రమోషన్స్ ఎలా ఇచ్చారు?’
‘సీనియారిటీ కమ్ కేపబిలిటీ పద్ధతిలో ఇచ్చారు సార్. అదీగాక ‘జీయమ్’ పోస్ట్‌కి సరైన కాండిడేట్స్ షార్టేజ్ ఉంది’
ఇప్పుడు హర్యానాలో ఫార్స్ మొదలయింది.
‘గవర్నమెంట్ వారి చిల్డ్రన్ హోమ్‌లో ముక్కుపచ్చలారని చిన్నారి బాలికలను - స్వయంగా ఆ హోమ్‌లేడీ ఇన్‌ఛార్జే పోలీస్ అధికారులకు సప్లయి చేసి - రేప్‌కి సహకరించిందంట’
‘హర్యానా ముఖ్యమంత్రిగారూ - ఆ హోమ్‌లేడీ ఇన్‌ఛార్జ్ మీద ఏం చర్య తీసుకోబోతున్నారు?’
‘అరెస్ట్ చేశామండీ’
‘కానీ ఆమెకు మీ గవర్నమెంటే బెస్ట్ హోమ్ ఇన్‌ఛార్జ్‌గా అవార్డ్ ఇచ్చారు కదా!’
‘అవున్ బెస్ట్ సర్వీస్ చేస్తోంది కదా మరి’
సరదా సంగతులకు సెటైర్ తాలింపు
english title:
indian
Date:
Sunday, June 24, 2012