మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)
ప్రతికూలతలను అధిగమించి మీ లక్ష్యాలను ఏదో విధంగా పూర్తి చేయగలుగుతారు. కార్యశూరులు, ప్రతిభావంతులతో పరిచయం మీకు మనోధైర్యాన్ని, బలాన్ని చేకూర్చుతాయి. విద్యా వాణిజ్యాలు ప్రోత్సాహకరంగా సాగుతాయనవచ్చు. అంతరాలు తొలగి ప్రేమానుబంధాలు బలపడతాయి. మీ అవసరాలకు కావలసిన డబ్బు ఏదో రీతిన సర్దుబాటు కాగలదు. నూతన ప్రాజెక్టులు, సంస్థల స్థాపనకు కొంతకాలం వేచి ఉండటం మంచిది.
వృషభం (ఏప్రిల్ 21 - మే 21)
కుటుంబపరంగా ఉన్న వత్తిడి, బాధ్యతలను సమర్థవంతంగా నెగ్గుకు వస్తారు. ఆదాయం బాగానే ఉన్నా దుబారా ఖర్చులపై అదుపు అవసరం. అయిన వారి నుంచి ఆహ్వానాలు, సహకారం అందుతాయి. ఉద్యోగస్థులు కష్టపడి పనిచేసి పై అధికారులను సంతృప్తిపరుస్తారు. మధ్యవర్తిత్వాలు, అనవసర హామీలకు దూరంగా ఉండటం మంచిది. భాగస్వాములతో చర్చలు సత్ఫలితాల నిస్తాయనవచ్చు.
మిథునం (మే 22 - జూన్ 21)
పట్టుదలలకు పోకుండా ఉంటే సమస్యలు వాటంతట అవే సర్దుకుంటాయి. ప్రణాళికలను సక్రమంగా అమలు చేయడానికి కావలసిన వసతులు సమకూర్చుకోగలుగుతారు. పిల్లలకు సంబంధించిన విషయాలలో, ప్రయాణాలలో తగిన జాగ్రత్తలు చేపట్టడం అవసరం. మీ ఆలోచనలు ఆచరణ రూపం దాల్చడానికి గురు, శుక్రవారాలు అనుకూలిస్తాయి. వేతనాలలో పెరుగుదల, మందుల వాడకంవల్ల ఆరోగ్యం మెరుగవడం గమనించవచ్చు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23)
అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలసి వస్తాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధించగలుగుతారు. భాగస్వాములతో అరమరికలు లేకుండా ఉండటం శ్రేయోదాయకం. బంధువులు, మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అనుకోని బాధ్యతలు మీద పడటంతో ఆందోళన కలిగినా అది తాత్కాలికమే. యంత్ర వాహనాల క్రయ విక్రయాల ద్వారా సత్ఫలితాలు అందుతాయి. 27, 28 తేదీల్లో ప్రత్యేక ఆహ్వానాలు, సమావేశాలు ఉండవచ్చు.
సింహం (జూలై 24 - ఆగస్టు 23)
వ్యవహారాలలో జయం, గృహంలో శుభకార్యాలు, క్రయవిక్రయాలలో రాణింపు మీకు ఉత్సాహాన్నిస్తాయి. ఖర్చులు, చెల్లింపులు అధికంగానే ఉన్నా తగినంత ఆదాయం ఉంటుందని చెప్పవచ్చు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచడం శ్రేయోదాయకం. రచనా వ్యాసంగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. ఆస్తి పంపకాలు, లావాదేవీలు ఓ కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. మీ శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబర్ 23)
మీ మాటకు ఇంటా బయటా ఆదరణ లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం, విద్యా విషయాలలో మెరుగైన స్థితి ఉంటాయని చెప్పవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోయినా తగిన ఫలితాలు పొందుతారనవచ్చు. న్యాయం, ధర్మం పాటించాలనే మీ తాపత్రాయాన్ని ఇతరులు అర్థం చేసుకుని సహకరిస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
తుల (సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23)
ఆచరణకు సాధ్యంకాని పథకాలను పక్కన పెట్టి ముఖ్య విషయాలపై దృష్టి సారిస్తారు. ఇబ్బందులెదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. స్ర్తిలు, పిల్లల విషయాలలో అలక్ష్యం పనికిరాదు. ఆధ్యాత్మిక చింతన, యోగాభ్యాసం వల్ల బుధ, గురువారాల్లో మనశ్శాంతి, ఉల్లాసం పొందగలుగుతారు. వాయిదా పడిన పనులు కొన్ని ఈ వారంలో ప్రారంభిస్తారు. ధనలోపం ఉండదు.
వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 23)
మీ భావాలను, ఆలోచనలను సున్నితంగా వ్యక్తీకరించి విజయాల బాటలో సాగుతారు. ప్రభుత్వరంగంలో ఉన్నవారికి పదోన్నతి లభించే సూచనలున్నాయి. నూతన పెట్టుబడులు, లీజు అగ్రిమెంట్లు 26, 27 తేదీలలో అనుకూలిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో, గ్రహించడంలో ఇతరులకన్నా ముందుంటారు. ప్రత్యర్థుల బలహీనతలను తెలుసుకుని తగిన విధంగా మసలుకుంటారు.
ధనుస్సు (నవంబర్ 24 - డిసెంబర్ 22)
భాగస్వాముల చొరవతో నూతన పథకాలకు రూపకల్పన చేస్తారు. వారమంతా ఏదో విధంగా డబ్బు అందుతూండటం వల్ల పనులన్నీ సక్రమంగా సాగుతాయనవచ్చు. సిబ్బంది వ్యవహారాలు మీ అదుపాజ్ఞలలో ఉండటంతో సమస్యలకు తగిన నివారణోపాయాలు అమలుపరచ గలుగుతారు. ఉత్సవాలు, సమారాధనలు, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు. మీ చేయూతతో కుటుంబ వ్యక్తుల వ్యవహారాలు నిరంతరాయంగా సాగుతాయి.
మకరం (డిసెంబర్ 23 - జనవరి 22)
నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆది సోమవారాల్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పెద్దరికంతో ఇతరుల పొరపాట్లను మన్నించడం ఉత్తమం. వివాహాది శుభకార్య యత్నాలు చురుగ్గా నిర్వహిస్తారు. ప్రజాదరణ కలిగిన పథకాలను తిరిగి ప్రారంభించే సూచనలున్నాయి. పెద్దలు, గురువుల ఆశీర్వాదంతో నూతన వ్యవహారాలు ప్రారంభిస్తారు.
కుంభం (జనవరి 23 - ఫిబ్రవరి 20)
మీరెంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభ పరిణామాలు ఆది సోమవారాల్లో జరుగుతాయి. మీ స్థాయికి హోదాకు తగిన కార్యక్రమాలను చేపట్టి విజయం సాధిస్తారు. లౌక్యంగా వ్యవహరించి కొన్ని సమస్యల నుండి తప్పించుకుంటారు. 27, 28 తేదీల్లో మాటలు పొదుపుగా వాడటం శుభకరం. ఇన్సూరెన్స్, స్పెక్యులేషన్ రంగాలకు దూరంగా ఉండటం మంచిది. దేవాలయాలు సందర్శిస్తారు.
మీనం (్ఫబ్రవరి 21 - మార్చి 20)
ఆకస్మిక ధన, వస్తు ప్రాప్తి ఉండవచ్చు. భాగస్వాములతో మీ చర్చలు, సంప్రదింపులు మార్గాన్ని సుగమం చేస్తాయి. నూతన రంగాలలో పెట్టుబడుల పట్ల ఆసక్తి చూపిస్తారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందే సూచనలున్నాయి. శుక్ర శనివారాల్లో శుభవార్త శ్రవణం, సన్నిహితుల కలయిక ఆనందాన్నిస్తాయి. ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయకుండా మందులు వాడటం శ్రేయోదాయకం.