Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సైన్స్ ఫేర్‌లో ఆకట్టుకున్న ప్రదర్శనలు

$
0
0

ఆదోని, ఆగస్టు 4: ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గోల్డన్ జూబ్లీ సందర్భంగా రాయలసీమ యూనివర్శిటీ స్థాయిలో ఎర్పాటు చేసిన సైన్స్ ఫేయిర్‌లో వంద ఎగ్జిబిట్స్‌ను విద్యార్థులు ప్రదర్శించారు. అందులో ము ఖ్యంగా ఎలక్ట్రానిక్ విభాగానికి చెంది న విద్యార్థులు నరేష్, చంద్రశేఖర్‌లు ప్రదర్శించిన సిక్రీట్ బెల్, నాగేంద్ర, రామకృష్ణలు ప్రదర్శించిన గ్యాస్ లీకేజీ హలారం, అన్యూష, వీణ, హీరేనా ప్రదర్శించిన యాసిడ్ రైన్స్, బసవరాజు ప్రదర్శించిన సెల్‌ఫోన్ల వాడకం వలన మానవ శరీరంపై రేడియేషన్ ప్రభావం అనే ఎగ్జిబిట్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇంట్లోవాడే వంటగ్యాస్ లీకేజీ అయిన వెంటనే హలారం మోగే ఎగ్జిబిట్, అలాగే దొంగలు ఇంట్లోపడితే మోగే సిక్రేట్ బెల్ ఏగ్జ్భిట్స్ ఎంతో ఉపయోగమని చెప్పారు. అలాగే సెల్‌ఫోన్ వాడకంవలన కలిగే దుష్పరిణామాల ను కూడ చక్కగా వివరించారు. యాసిడ్ వర్షాలు కురిస్తే మొత్తం వ్యవసాయం, నీరు, గాలి, పంటలు, ఫ్యాక్టరీలు ఎలా నష్టపోతాయో యాసిడ్ రైన్ ఏగ్జ్భిట్‌లో విద్యార్థులు వివరించారు.
విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి
ఎమ్మిగనూరు, ఆగస్టు 4: విద్యుత్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంగా కారణంగా విద్యుత్ తీగలు సరిచేస్తున్న సమయంలో విద్యుత్‌పాసై నిండుప్రాణం బలైంది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గోనెగండ్ల మండలంకు చెందిన వాహీద్(35) ట్రాన్స్‌కో డిపార్టుమెంట్‌లో కూలిగా పనిచేస్తూ కె.వి.లైన్ మార్చేందుకు వాహీద్‌ను విద్యుత్ తీగలు తగిలి పైనుంచి కిందపడి తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలలో మృతి చెందడం జరిగింది. వాహీద్ కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఐ నాయకుడు బాలు డిమాండ్ చేశారు.
బంటుపల్లెలో ఘర్షణ - నలుగురికి గాయాలు
దేవనకొండ, ఆగస్టు 4: దేవనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంటుపల్లె గ్రామంలో రెండువర్గాల మద్య జరిగిన ఘర్షణలో నల్గురు వ్యక్తులకు గాయాలైనట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. శనివారం జరిగిన ఘర్షణలో శేఖర్, రంగడు, శ్రీరాములు, శీనులకు గాయాలు తగిలాయన్నారు. శేఖర్, రంగడు ఒక వర్గానికి చెందినవాడుకాగా, శ్రీరాములు, శీను మరో వర్గానికి చెందినవాడన్నారు. ఇరువురు పొలం తగాద విషయంలో ఘర్షణకు దిగి కట్టేలతో కొట్టుకోవడం వలన గాయాలు తగిలిన వారిని కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే బంటుపల్లెగ్రామానికెళ్ళి పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. గ్రామంలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఇరువర్గాలపై కేసు నమోదుచేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పేకాట రాయుళ్ల అరెస్టు
గడివేముల, ఆగస్టు 4: మండల పరిధిలోని బిలకల గూడూరు గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి, సిబ్బంది వారిపై దాడి చేసి వారిని అరెస్టుచేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. జగన్, గోపాల్, నర్సింహులు, సలీం, ఆనంద్, బేక్, మక్బుల్, రాము పేకాట ఆడుతుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిపై దాడి చేసి వారిని అరెస్టుచేసి వారి వద్ద నుండి రూ.4.600లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇండికా కారు స్వాధీనం
గడివేముల, ఆగస్టు 4: మండల పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రంధివేముల గ్రామం వద్ద కెఇ 5584 నెంబర్ గల ఇండికా కారు అనుమానాస్పదంగా వుండడంతో శనివారం ఆ కారును స్వాధీనం చేసుకొని పోలీస్టు స్టేషన్‌లో వుంచినట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

నంద్యాలలో రూ.20 లక్షల విలువ‌జేసే బంగారు నగలు చోరీ
నంద్యాల టౌన్, ఆగస్టు 4: శనివారం పట్టణంలోని సలీంనగర్‌కు చెందిన బంగారు వెండి నగల వ్యాపారం చేసే రియాజ్‌కు చెందిన బంగారు, వెండి నగలు ఉంచిన బ్యాగ్‌ను మోటార్ బైక్‌కు ఉన్న డిక్కీలో ఉంచగా క్షణాల్లో మటుమాయమైంది. సిఐ రామాంజినాయక్ తెలిపిన వివరాల మేరకు సలీంనగర్‌కు చెందిన బంగారు వ్యాపారి రియాజ్ తన దుకాణం నూనెపల్లెలో ఉండడంతో ప్రతిరోజూలాగే రాత్రి బంగారు, వెండి నగలను ఇంటికి తీసుకుని వెళ్లి తిరిగి ఉదయం బంగారు, వెండి నగలను బ్యాగ్‌ను తన మోటార్ బైక్‌కు ఉన్న డిక్కీలో ఉంచి షాపును మోటార్ బైక్‌ను దుకాణం ఎదుట ఉంచి షాపును తెరవడానికి వెళ్లగా అంతలోనే డిక్కీ తెరిచి ఉందన్నారు. డిక్కీలో ఉంచిన బంగారు, వెండి నగల బ్యాగ్ చోరీకి గురైనట్లు గుర్తించినట్లు తెలిపారు. బ్యాగ్‌లో 875గ్రాముల బంగారు నగలు, 4కేజీల వెండి, రూ.20వేల నగదు ఉన్నట్లు రియాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటి విలువ దాదాపు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని రియాజ్ తెలిపారు. రియాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రామాంజినాయక్ చెప్పారు.

వికసించనీ నేస్తం.. ఈ స్నేహ పుష్పం
కర్నూలు , ఆగస్టు 4 : కలిమిలో..లేమిలో..సంతోషంలో.. దుఃఖంలో నేనంటూ నీకున్నాను నేస్తం అంటూ అండగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. కష్టాల కడలి నుంచి సంతోషాల చెలియలి కట్టకు చేర్చే నావికుడే సిసలైన మిత్రుడు. ఒకరు హృదయమైతే మరొకరు ఆ హృదయం చేసే చప్పుడై.. ఒకరు కనుపాప అయితే మరొకరు కనురెప్పయి..అద్దమైతే మరొకరు ఆ అద్దంలో ప్రతిబింబించే రూపమై.. ఒకరు ప్రాణం నిలిపే శ్వాస అయితే మరొకరు ప్రాణమిచ్చే ప్రాణవాయువై..వ్యక్తులు వేరైనా మనసులు ఒక్కటే అని నిలిచేవారే జగతి మెచ్చిన స్నేహితులు. ఆనందంలో..ఆపదలో.. ఆతిథ్యంలో..అవసరాల్లో..ఆదుకునేవాడే ఆప్తమిత్రులు.స్నేహితుడా నీకం టూ నేనున్నాను.. అంటు భరోసా ఇచ్చి బతుకు బండిని ముందుకు నడిపించే వాడే సిసలైన సన్నిహితుడు..ఈ స్ఫూర్తినే తమ స్నేహాల్లో అన్వయించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఫ్రెండ్‌షిప్ డే (స్నేహితుల దినోత్సవం) నిర్వహించుకుంటున్నారు. వ్యక్తుల మధ్య చిరస్మరణీయ స్నేహసాంగత్యాన్ని గుర్తు చేసుకుంటూ..స్నేహితుల నడుమ ఉన్న ఆప్యాయతా అనురాగాలు పంచుకుంటూ అన్ని వర్గాలకు చెందిన వారు ఈ స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోకున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా మిత్రులు పరస్పరం ఇచ్చి పుచ్చుకునేందుకు అనేక రకాల గ్రీటింగ్ కార్డులు, వివిధ రూపాల్లో గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయి. వ్యాపారులు స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వందలాది రకాల గ్రీటింగ్ కార్డులను అమ్మకాలకు పెట్టారు. సుదూర ప్రాంతాల్లో ఉంటున్న స్నేహితులకు శుభాకాంక్షలు పంపుకునేందుకు వారధిగా పలువురు ఈ గ్రీటింగ్ కార్డులను ఎంపిక చేసుకుంటున్నారు. విభిన్న కొటేషన్లు, మనసుకు నచ్చే పదాల కూర్పుతో గ్రీటింగ్ కార్డులు నవతరాన్ని ఆకట్టుకుంటున్నాయి. సందర్భానికి తగిన విధంగా ప్రసిద్ధ వ్యక్తులు బోధించిన సూక్తులు గ్రీటింగ్ కార్డుల్లో అందంగా ఆకర్షిస్తున్నాయి.
ఫ్రెండ్‌షిప్ బాండ్లపై యువత మోజు
అందమైన కొటేషన్లు, ఆకర్షించే అలంకారాలతో పట్టుదారాలు, ప్లాస్టిక్ కోటెడ్ రంగులతో మార్కెట్లో ఫ్రెండ్‌షిప్ బాండ్లు యువతను మురిపిస్తున్నాయి. పది నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులంతా వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. కలిసి చదువుకున్న జ్ఞాపకాలు కలకాలం మిగిలిపోవాలని, జీవిత చరమాంకం వరకు తమ స్నేహం సస్నేహంగా నిలవాలని ఆకాంక్షిస్తూ స్నేహితులు ఈ వేడుక రోజున బాండ్లు ధరిస్తున్నారు.మార్కెట్లో ఒక్క గ్రీటింగ్ కార్డులు, ఫ్రెండ్‌షిప్ బాండ్లు మాత్రమే కాదు.. టీకప్పులు, గోడకు వేలాడదీసే ఫ్రేమ్‌లు, చిత్ర పటాలు, పోస్టర్లు, చేతి గడియారాలు, బ్రాస్‌లెట్లు, కడియాలు, ఉంగరాలు, ఫోటో ఆల్బమ్‌లు, పెన్ స్టాండ్‌లు, పేపర్ వెయిట్లు, పెన్నులు వంటివి కూడా స్నేహితుల దినోత్సవం కొటేషన్లతో ఆహ్వానిస్తున్నాయి.

ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గోల్డన్ జూబ్లీ సందర్భంగా
english title: 
science fare

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>