ఉదయగిరి, ఆగస్టు 4: నెల్లూరు ఆర్టీసీ జోన్‌కు త్వరలో 120 కొత్త బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎన్ సూర్యచంద్రరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక డిపోను సందర్శించి పలు రికార్డులను తనిఖీచేసి రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందికి సూనచలు, సలహాలు అందచేశారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ తిరుపతికి 60 బస్సులు, నెల్లూరుకు 40, ఒంగోలు డిపోలకు 20 బస్సులు కేటాయిస్తామన్నారు. అలాగే మరో 200 పాతబస్సుల స్థానంలో కొత్తవి రానున్నాయని, కార్పొరేషన్ పరిధిలో రీప్లేస్‌మెంట్‌లో 1200, అకామిడేషన్ కింద మరో 800 బస్సులు వస్తాయన్నారు. ఈనెల 16నుంచి 15రోజుల పాటు టైర్స్‌కేర్స్ కోర్ట్‌నైట్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్పొరేషన్ పరిధిలో 2.05 కోట్ల రూపాయలు స్ట్ఫా, లేడీస్ జెట్ రూములు నిర్మించడానికి సంస్థ ఖర్చు చేస్తుందన్నారు. స్థానిక డిపోలో ఆరులక్షల రూపాయలతో రెస్టు రూమ్ నిర్మిస్తామన్నారు. జూన్ చివరి నాటికి డిపో 10లక్షల రూపాయల లాభాల్లో ఉందన్నారు. డిపోలో నడుస్తున్న ఇంద్ర సర్వీసులకు నిర్దేశించిన ఆదాయం రాక నష్టాల్లో నడుస్తుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందికి అత్యవసర వైద్యశాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. పల్లె వెలుగుల సర్వీసులకు 5 కొత్త బస్సులు రానున్నాయని, ఈ ఏడాది అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది జనవరి 14వరకు శబరిమలైకు అత్యధిక బస్సు సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈయన వెంట డిపో మేనేజర్ శ్రీనివాసులు, ఎఎంఎఫ్ ప్రతాప్‌కుమార్, ఎస్‌టిఐ సిద్ధిక్ తదితరులు ఉన్నారు.
20 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత
రాపూరు, ఆగస్టు 4: రాపూరు అటవీ రేంజ్ పరిధిలోని చింతమానుపెంట అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 154 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు రాపూరు అటవీరేంజ్ ఇన్‌చార్జి అధికారి డిసి చెన్నయ్య చెప్పారు. గత రెండు రోజుల క్రితం వెలుగొండ అటవీ ప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలు నరికి తరలించేందుకు సిద్ధంగా ఉంచారన్న సమాచారం అందటంతో తాము ఈ రెండు రోజులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా పెట్టటం జరిగిందని తెలిపారు. ఎట్టకేలకు తన నిఘా చర్యలతో పాటు అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా ఒక ప్రాంతంలో 154 ఎర్రచందనం దుంగలు ఉండటాన్ని గుర్తించామని చెప్పారు. వీటి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ దాడులలో తమతోపాటు డిప్యూటీ రేంజ్ అధికారులు రవీంద్రబాబు, మహబూబ్‌బాషా, సిబ్బంది కోటేశ్వరరావు, సలీం, స్క్వాడ్ సిబ్బంది సాయికృష్ణ తదితరులు ఉన్నారని ఆయన వివరించారు.