ఉరవకొండ, ఆగస్టు 7: హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ పనులు ఆగ స్టు చివరి లోపు పూర్తిచేయకపోతే చర్యలు తప్పవని మంత్రి ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. నియోజక వర్గం పరిధిలోని జీడిపల్లి నుంచి ఇంద్రావతి వద్ద వున్న 34 ప్యాకేజీ పనులను మం గళవారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి, మంత్రి రఘువీరా రెడ్డి, ఎమ్మెల్సీ విప్ వై.శివరామిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భం గా మంత్రులు సుదర్శన్, రఘువీరా మాట్లాడుతూ హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ పనులపై రివ్యూ చేశామన్నారు. అందులో భాగంగా ప్రాజెక్ట్ పనులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించడానికి వచ్చామన్నారు. ప్రాజక్ట్ కింద నాలుగైదు చోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన చేయించడం కోసం ప్రయత్నాలు సా గిస్తున్నామన్నారు. ఈ పనుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. ఈ పనులపై కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు సరైన అవగాహన లేదన్నారు. తుంగభద్ర ఎగువ కాలువపై ఆధునీకరణ పనుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నా రు. కాలువ ఆధునీకరణ చేయడంతో పాటు వంతెనలు విస్తరణ చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే అక్విడెక్ట్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అంచనా వ్యయాల కంటే అదనంగా నిర్మించిన పనులకు సంబంధించి అక్విడెక్ట్ పనులకు రూ. 2.4 కోట్లు పెండింగ్ ఉన్నాయన్నారు. ఆగస్టు చివరిలోపు మొదటి దశ పనులు పూర్తి చేస్తామని, సెప్టెంబర్‌లో అనంతపురం వరకూ నీరు అందజేస్తామని వారు తెలిపారు. అనంతరం పట్టణంలో పోలీసు స్టేషన్ సమీపంలో టిడిపి హయాంలో, వైఎస్ హయాం లో శంకుస్థాపన చేసిన శిలా ఫలకాలను మంత్రులు తిలకించారు.
హంద్రీనీవా వంతెన పనులపై మంత్రుల నిలదీత
వజ్రకరూరు, ఆగస్టు 7: మండల పరిధిలోని ఛాయాపురం వద్ద జరుగుతున్న హంద్రీనీవా పనులను పరిశీలించడానికి వచ్చిన మంత్రులను మంగళవారం రైతులు నిలదీశారు. ప్రస్తుతం నిర్మించబోతున్న బ్రిడ్జిల మీదుగా రాకపోకలు సాగించాలంటే దాదాపు 5, 10 కిలోమీటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోయారు. పొలికి, పెం చలపాడు నడుమ 3 మడకల పొలాలకు పూర్వపు తాతల కాలంలో ప్రభు త్వం దారులు కల్పించిందన్నారు. అయితే ఇంజనీర్లు రూపొందించిన నమునాలతో ఇబ్బందులు ఎదుర్కో వాల్సి వస్తుందని కొనకొండ్ల రైతులు వెంకటస్వామి, మల్లికార్జున, నాగరాజు, నాగలింగ విరుచుకుపడ్డారు. తాత్కాలికంగా పైపులు వేసి బ్రిడ్జిలు నిర్మించి తమ ప్రాణాలు తీయవద్దని, శాశ్వత పనులు చేపట్టాలని రైతులు కోరారు. స్పందించిన మంత్రి రఘువీరా రైతులకు అనుకూలంగా ఉండే విధంగా బ్రిడ్జిలు నిర్మించాలని ఇంజనీర్లు, కాం ట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంతో రైతులు శాంతించారు. ఇదిలా ఉండ గా హంద్రీనీవా కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు ఆలస్యం చేస్తున్నారని మంగళవారం మండలానికి వచ్చిన మంత్రులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువల పెండింగ్ పనుల పరిశీలనలో భాగంగా మంత్రులు సుదర్శన్‌రెడ్డి, రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ విప్ శివరామిరెడ్డి పనులను పరిశీలించారు. తొలుత వారు ప్యాపిలి, చిన్నతండా బ్రిడ్జి పనులను పరిశీలించి మీ నిర్లక్ష్యం వల్లనే పనులు నత్తనడకన సాగుతున్నాయని అధికారులపై మం డిపడ్డారు. వారంలో రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రాగులపాడు బ్రిడ్జి మీదుగా ఛాయాపురం వద్ద కాలువ పనులను పరిశీలించారు. మంత్రి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ నిధులు మంజూరైనా బ్రిడ్జి పనులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని డిఇలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 రోజుల్లో పైపులు వేసి మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. మంత్రుల వెంట కలెక్టర్ వి.దుర్గాదాస్, కాంగ్రెస్ నేతలు జగన్‌మోహన్‌రెడ్డి, రవీంద్రరెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్‌బా,బు రైతులు ఉన్నారు.
నెలాఖరులోపు పూర్తి చేయకపోతే చర్యలు * మంత్రి రఘువీరారెడ్డి
english title:
h
Date:
Wednesday, August 8, 2012