అనంతపురం కల్చరల్, ఆగస్టు 7: చేనేత కార్మికులు మనోధైర్యాన్ని కోల్పోకూడదని ఎజెసి బిఎల్ చెన్నకేశవరావు చేనేత కార్మికులకు సూచించారు. మంగళవారం లలితకళాపరిషత్ జరిగిన ప్రపంచ చేనేత దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులను మగ్గాలను సమర్థవంతంగా నిర్వసించుకొని ఆర్థికాభివృద్ధిని సాధించాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగ పరచుకోవాలని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఆత్మహత్యలకు పాల్పడాల్సిన అవసరం లేదని అన్నారు. చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకులు జగన్నాథశెట్టి మాట్లాడుతూ 2012-13 సంవత్సరానికి సంబంధించి వీవర్స్ కార్డులు ప్రవేశపెట్టాలని దరఖాస్తులు కోరగా 6,600 దరఖాస్తులు వచ్చాయన్నారు. ట్రిపుల్‌ఆర్ విధానంలో రూ. 15కోట్ల రుణాలు అందించేందుకు బ్యాంకులు అంగీకరించాయన్నారు. సిరికల్చర్ జెడి అరుణకుమారి మాట్లాడుతూ పాసుపుస్తకాలు మంజూరు చేసిన చేనేత కార్మికులకు ప్రతినెలా నాలుగు కిలోల ముడిసరుకుపై 600 రూపాయల సబ్సిడీని అందిస్తున్నట్లు తెలిపారు. 35 వేల మంది పాసుపుస్తకాలు కలిగి ఉండగా, 25వేల మంది లబ్ధి పొందారన్నారు. ఈ సందర్భంగా 136 మంది కార్మికులకు 64 లక్షల రూపాయల చెక్కును ఎపిజిబి ఆర్‌ఎం మహమ్మద్‌ఖాన్ అందచేశారు. అదేవిధంగా కార్మికులకు గాలికొట్టే మిషన్, సోలార్ ల్యాంపులను అందచేశారు. ఈ కార్యక్రమానికి ముందు టవర్‌క్లాక్ సమీపంలోని చేనేత బజార్ నుండి లలితకళాపరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా చేనేత ఐక్యవేదిక నాయకులు అధికారులను సన్మానించారు. నాయకులు కెఎఎన్.మూర్తి, పి.వెంకటస్వామి, చిట్టాశ్రీ్ధర్, దాసరిశ్రీ్ధర్, పి.శ్రీనివాసులు, రంగనాయకులు, లక్ష్మినరసింహ, కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.
చేనేత కార్మికులు మనోధైర్యాన్ని కోల్పోకూడదని ఎజెసి బిఎల్ చెన్నకేశవరావు చేనేత కార్మికులకు
english title:
ch
Date:
Wednesday, August 8, 2012