హిందూపురం టౌన్, ఆగస్టు 7: పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా ప్రధానశాఖలో మంగళవారం సాయంత్రం బ్యాంక్ అధికారులు పది రూ. 50 దొంగనోట్లను పట్టుకున్నారు. మున్సిపల్ పరిధిలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన ఓ రంగుల ఫ్యాక్టరీ నిర్వాహకుడు చలానా చెల్లించేందుకు బ్యాంక్ కౌంటర్‌లో నగదు ఇవ్వగా అందులో రూ. 500కు సంబంధించి పది నోట్లు నకిలీవిగా నిర్ధారించి బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం చీఫ్ మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో పూర్తి వివరాలను విచారణ తర్వాత వెల్లడించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వ్యక్తితో పాటు మరో ఇద్దరిని వన్‌టౌన్ సిఐ బి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా ప్రధానశాఖలో మంగళవారం సాయంత్రం బ్యాంక్ అధికారులు
english title:
p
Date:
Wednesday, August 8, 2012