లింగు: నా బ్రెయిన్
స్పాంజ్‌లాంటిది. అన్నీ
పీల్చుకుంటుంది.
లిటుకు: అవును ఒత్తిడి కలగగానే
అది అన్నీ వదిలేస్తుంది.
ఓన్లీ ఇన్ ఇండియా
హిమాచల్‌ప్రదేలోని కులూవేలీలో
ఓ దేవత హైకోర్టులో గెలిచింది.
శృంగరిషి, బాలూనాగ్ అనే ఇద్దరు
దేవతల తరఫున జరిగిన ఈ
వ్యాజ్యంలో కేసు వేసిన వాళ్ళు
కులూ లోయలో జరిగే దసరా
ఉత్సవంలో శృంగరిషికి ఆహ్వానం
అందలేదని కేసు వేశారు.
1637లో రాజా జగత్‌సింగ్
పరిపాలన కాలంలో కులూ వేలీలో
జరిగే ఈ ఉత్సవానికి స్థానిక
దేవతలని ఆహ్వానించే
సాంప్రదాయం మొదలైంది.
అప్పటినించి చుట్టుప్రక్కల గల
గ్రామాల్లోని దాదాపు 250మంది
దేవతలకి ఈ ఉత్సవానికి ఆహ్వానం
అందుతోంది. అయతే 2010లో
శృంగరిషి, బాలూనాగ్‌ల పేర్లని
ఆహ్వానితుల జాబితా నుంచి
తొలగించారు. ప్రధాన దేవత
రఘునాథ్‌కి కుడివైపు ఈ
విగ్రహాలని ఉంచి ఊరేగించేవారు.
కేసుని విచారించిన జస్టిస్
దేవ్‌దర్శన్ సూద్ వారిని కూడా
ఆహ్వానించాలని, కులూ ఎస్‌పి ఈ
ఇద్దరు దేవతలకి ఆహ్వానం
పంపడం మానేయడానికి సరైన
కారణం చూపించలేకపోయాడని,
ప్రభుత్వాధికారులు ప్రజల కళ,
భాష, సంస్కృతుల్లో వేలు
పెట్టకూడదని తీర్పునిచ్చాడు.
కులూ వేలీకి దేవభూతి అనే పేరు
ఉంది. కారణం ప్రతీ గ్రామంలో
కొన్ని వందల ఆలయాలుంటాయి.
వింతలోకం
కెల్లీ కాక్స్ హెడ్ (32)కి పాల్
మేపిల్ త్రోప్ అనే మెకానిక్‌తో
పదేళ్ళ క్రితం ఎంగేజ్‌మెంట్
అయింది. ఇంగ్లండ్‌లోని స్విండన్
అనే ఊరికి చెందిన ఈ జంటలోని
పాల్ తన కాబోయే భార్యకి
పదిలక్షల పౌండ్లు బ్యాంక్ బేలన్స్
ఉంటే కానీ పెళ్లి చేసుకోనని
చెప్పాడు. ఇతరులైతే బహుశా
అతనికి గుడ్‌బై చెప్పేవారు. కానీ,
కెల్లీ మాత్రం సరే అని, తన
ఫేస్‌బుక్ ద్వారా పాల్ తనని
వివాహం చేసుకోవడానికి పది
లక్షల పౌండ్లు సహాయం చేయమని
కోరింది. చాలామంది ఆమెకి ఈ
సహాయం చేయడానికి ముందుకి
వచ్చారు. ఆ నోటా ఈ నోటా ఇది
పాకి, ఒక్క వారంలోనే
27వేలమంది ఫాలోయర్స్ ఆమె
ఫేస్‌బుక్ ఎకౌంట్‌కి జాయినై,
అంతా తలో కాస్త డబ్బు ఇచ్చారు.
కావాల్సిన మొత్తం పోగవడంతో
11-11-11న వారి వివాహం
ఘనంగా జరిగింది.
ఈ షార్ట్ ఫిలిం చూశారా?
యూ ట్యూబ్‌లో వేల కొద్దీ షార్ట్
ఫిల్మ్స్ లభ్యమవుతున్నాయి.
తక్కువ సమయంలో చూడదగ్గ ఈ
షార్ట్ ఫిల్మ్ నిడివి 7 నిమిషాల 11
క్షణాలు. ఈ థ్రిల్లర్ పేరు స్ట్రేంజర్స్.
యూట్యూబ్‌లో ఈ థ్రిల్లర్ కోసం
STRANGERS-
SHORT FILM అని సెర్చ్
చేయండి.
హెల్త్ టిప్
ఐ పేడ్స్ వాడేవారికి మెడ నొప్పి
రావచ్చు. హార్వర్డ్ శాస్తవ్రేత్తలు ఈ
విషయం కనుగొన్నారు. స్క్రీన్‌ని
సరిగ్గా చూడడానికి వారు తమ
మెడని 45 డిగ్రీల ఏంగిల్‌కి
తిప్పడంతో ఈ సమస్య వస్తోందిట.
కాబట్టి ఐ పేడ్‌నే 45 డిగ్రీల
ఏంగిల్‌కి తిప్పి చూడటం ద్వారా
దీన్ని అధిగమించవచ్చుట.
దురదృష్టపు దొంగ
ఇటలీలోని బుర్జ్‌పోట్ అనే చిన్న
గ్రామంలోని ఓ ఫ్యునరల్
హోమ్స్‌లోకి 2008లో ఓ
రోజున ఓ చోరుడు దొంగతనానికి
వెళ్లాడు. అలారం మోగడంతో
పోలీసులు వచ్చేసరికి దాక్కోడానికి
అతను ఓ శవపేటికలో శవంలా
పడుకున్నాడు. రెండు విషయాలు
అతన్ని పోలీసులకి పట్టించాయి.
మొదటిది, అతను ఊపిరి
పీల్చుకోవడం వారు గ్రహించారు.
రెండవది, అతను మామూలు
దుస్తులు ధరించి ఉన్నాడు.
శవాలకి కొత్త సూట్ తొడుగుతారు.
దాంతో పోలీసులు అతన్ని అరెస్టు
చేసారు. అతను అంతకుముందు
రెండుసార్లు జైలుశిక్ష అనుభవించే
దొంగే!
ఇలా అన్నారు...
అణుబాంబు యుద్ధంలోని మజాని
తొలగించేసింది
-ఎడ్వర్డ్ ఏబే
ఫూర్తి...
కర్ణాటకలోని బీజాపూర్‌లో కబ్రాజ్
బజార్‌లోని హేమంత్ నహర్ నడిపే
దుకాణం దగ్గర రోజూ మధ్యాహ్నం
ఒకటి నుంచి మూడుదాకా పేదలకి
రూపాయికే నాలుగు జొన్న
రొట్టెలు, వాటికి సరిపడా కూరని
అమ్ముతారు. పూర్వం
అర్థరూపాయికే అమ్మేవారు.
అయితే యాభై పైసల నాణెం
కనరుమరుగైపోవటంతో ఈ ధరని
రూపాయికి పెంచాల్సి వచ్చింది. ఈ
సేవ 40 ఏళ్ల క్రితం మొదలైంది.
హేమంత్ తండ్రి అప్పట్లో కేవలం
పది పైసలకే పేదల కోసం ఈ సేవని
ప్రారంభించాడు. తరుగు డబ్బును
ఆయన జేబులోంచి
పెట్టుకునేవాడు. ప్రస్తుతం హేమంత్
నహర్ తండ్రి సేవని కొనసాగిస్తూ
వచ్చే డబ్బు వంటవారికి,
జొన్నలనిపిండి చేసే మిల్లువారికి
ఇస్తున్నాడు. తరుగు సొమ్ముని
తనే భరిస్తున్నాడు. హేమంత్
కుటుంబానికి ఈ సేవలో కొందరు
భాగస్వాములై తోచిన సొమ్ముని
లేదా జొన్నలు, కూరగాయలని
విరాళంగా ఇస్తున్నారు.
దాతలెవరైనా 08353-
250114ని సంప్రదించవచ్చు.
హాలీవుడ్ కబుర్లు
అమెరికన్ కమెడియన్ డబ్లుసి
ఫీల్డ్స్ తెరమీద ఎంతగా నవ్విస్తాడో
నిజ జీవితంలో అంత చెడ్డవాడు.
అతను స్ర్తిలని, పిల్లల్ని
ద్వేషించేవాడు. పైగా ఆల్కహాలిక్.
అయతే అతను కామేడీ ఎంతో
గొప్పగా పండించేవాడు. ‘మేన్ ఆన్
ది ఫ్లయింగ్ ట్రెపీజ్’ అనే చిత్రంలో
తన కూతురుతోగల సంబంధాన్ని
తన నటన ద్వారా అద్భుతంగా
ప్రదర్శించాడు. మీకు టైం ఉంటే
యూ ట్యూబ్‌లో అతని నటనని
చూడొచ్చు.
డైవోర్స్
పెళ్లిళ్లు స్వర్గంలో. విడాకులు
భూమీద. అయితే ఎవరూ తాము
విడాకులు తీసుకోవాల్సి వస్తుందని
పెళ్లి సమయంలో అనుకోరు. కొన్ని
వింత కారణాల వల్ల కొందరు
దంపతులు విడాకులు
తీసుకుంటుంటారు.
బ్రిటన్‌లోని రాబర్ట్ అనే భర్త, తన
భార్యని హింసిస్తూండటంతో ఆమె
విడాకులకి కేసు ఫైల్
చేయడమేకాక, రాబర్ట్ తన ఇంటికి
రాకూడదని రెస్ట్రయినింగ్ ఆర్డర్‌ని
కోర్టునుంచి పొందింది. డ్రగ్ ఎడిక్ట్
అయిన రాబర్ట్ ఓ రాత్రి తన ఇంట్లో
దాచిన డ్రగ్స్ తీసుకోవడానికి
వచ్చాడు. మెట్లమీద ఎదురుపడ్డ
అతని భార్యకి, అతనికి గొడవైంది.
అతనుమెట్లమీంచి కింద పడటంతో
కాలి బొటనవేలు విరిగి, దాన్ని
తొలగించాల్సి వచ్చింది. దాంతో
అతను తనకి భరణం ఇవ్వమని
భార్యమీద (అతను మేల్ స్ట్రిప్పర్.
అంగవైలక్యంతో ఉద్యోగం ఊడింది),
మెట్లు సరిగ్గా లేవంటూ ఇంటి
యజమాని మీద నష్టపరిహారం
కేసులు వేశాడు. రెండు కేసులు
రాబర్ట్ గెలిచాడు!