మీ వద్ద బోల్డు వేలకొద్దీ
ఫైల్సున్నాయా? ఒకే సందర్భానికి
చెందినవేనా? అన్నిటికీ ఒకే
పేరుతో ఫైలునెంబర్‌తో కలిపి పేర్లు
పెట్టాలా? ‘ఏం జోకేశారు సార్?’
ఎలా కుదురుతుందీ? అంటారా!
కుదుర్తుంది. ప్రతిదానికీ ఒక
టెక్నాలజీ పరిష్కారం ఉండనే
ఉంటుంది కదా! బల్క్
ఎస్సెమ్మెస్‌లూ, బల్క్
ఇమెయిల్సూ సాధ్యమైనపుడూ?
బల్క్ రీనేమింగ్ ఎందుకు
సాధ్యంకాదూ?
ఫైల్స్‌కూ, ఫోల్డర్లకూ ఒకే బ్యాచీగా
పేర్లను మార్చడానికోసం రీనేమ్
మాయిస్ట్రో అనే సాఫ్ట్‌వేర్
ఇంటర్నెట్‌లో లభిస్తోంది. ఎంపి3,
ఫొటోటేగ్స్‌తో, నెంబర్లతో, తేదీలతో,
అక్షరాల్తో లేదా పేరు (పొడిగా)తో
ఎలా కావాలంటే అలా బల్క్‌గా
ఫైల్స్‌నీ, ఫోల్డర్లనీ రీనేమ్
చేయడానికి ఇదెంతో ఉపయుక్తంగా
ఉంటుంది. దీంతోబాటు ఉండే మరో
సౌకర్యం పేరు ఇన్‌స్టెంట్ ప్రివ్యూ.
దీని సాయంతో బల్క్ రీనేమింగ్
టక్కున చేసేయొచ్చు. అంతేకాదు.
దీంటో ఫైల్స్‌ను రూపొందించిన/
మాడిఫైచేసిన తేదీలని వేగంగా
మార్చేయవచ్చు. వేల ఫైల్సు
డ్రాగ్, డ్రాప్ ద్వారా తెచ్చేసి, రీ
నేమ్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌లో
మరో ఉపయుక్తమైన ఫీచర్ ఏంటో
తెల్సా? JPEG, Av1,
RAm, MP3, AAC -ఏ
ఫైల్ అయినా సరే! దాని అంతర్గత
సమాచారాన్ని చూసే
వీలునివ్వడం.
ఫైలును వరసగా నెంబరింగ్
చేయడానికి magic
numbering boxలో ఫైలు
నెంబర్స్ ఎంచుకొంటే చాలు. అలాగే
తేదీ, సమయాలను కావాల్సిన
ఫార్మేట్‌లో ఉండేలా (పెరిగేలా/
తరిగేలా) చూసుకోవచ్చు. ప్రతీ
ఫైలుకీ ఈ రీ-నేమ్ మాయిస్ట్రో 54
వెర్షన్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లివీ:
ఈజీ రీనేమ్
ఆప్షన్‌తో నెంబర్డ్ ఫైల్సును వేగంగా
క్రియేట్ చేసుకోవచ్చు.
అతి సాధారణ
వైల్డ్ కార్డ్ *, ?లతో టెక్ట్స్‌ను ఫైండ్
చేసి రీప్లేస్ చేసుకోవచ్చు.
మీక్కావాల్సిన
ఫార్మేట్‌లో డేట్, టైంలను
(పెరిగేలా/ తరిగేలా) సెట్ చేసి
వాడుకోవచ్చు.
మీక్కావాల్సిన
రీతిలో అంకెలూ/ సంఖ్యలూ
పెరిగేలా చూసుకోవచ్చు.
అదే రీతిలో
అక్షరాలను (ఎ టు జెడ్)
వాడుకోవచ్చు.
ఫైల్/ ఫోల్డర్‌ల
పేర్లలో, ఎక్స్‌టెన్షన్లలో కొంత టెక్ట్స్‌నీ
(లేదా పూర్తిగా కూడా) డిలీట్
చేసుకోవచ్చు.
ఫ్రీ ఫామ్ టెక్ట్స్‌ను
సులభంగా జోడించవచ్చు.
కాపిటల్
అక్షరాలూ, నాన్ కాపిటల్
అక్షరాలూ మార్చేయవచ్చు.
(కేస్‌ను సులభంగా
మారొచ్చునన్నమాట.
దీన్ని వాడటానికి మీ పీసీలో నెట్
ఫ్రేమ్‌వర్క్ 2.0 కనీసం ఉంటే
సరిపోతుంది. కావలిస్తే వాడి
చూడండి.