పేరు చూస్తే ఏదో ఆప్టికల్ ఫైబర్‌లా
ఉందే? అనిపిస్తోందా?
కొంతవరకూ కరెక్టే! ప్రపంచంలోనే
అత్యంత వేగంగా పని చేసే
ఇంటర్నెట్ సేవను గూగుల్
ఆవిష్కరించింది. ఇది ఒక
సెకనుకు 1 గిగా బైట్
వేగాన్నిస్తుందిట. ఓం ప్రథమంగా
అమెరికాలోని మిస్సోరి ప్రాంతానికి
చెందిన కాన్సాస్ నగరంలో
ప్రవేశపెట్టిన ఈ సేవ త్వరలో
మిగిలిన నగరాలకీ
విస్తరించనుంది. దీంతోబాటు 1
జిబి ఇంటర్నెట్, 1 టిబి సోర్టేజీ
సేవలూ అందుబాటులోకి తెచ్చింది.
కేబుల్ టీవీ సౌకర్యాలూ
లేకపోలేదు. ఎర్లీ బర్డ్‌లకు,
గూగుల్ నెక్సస్ 7 టాబ్లెట్‌లను
ఫ్రీగా అందిస్తోంది. అమెరికాలో
సెప్టెంబర్ నుంచీ ఆరంభం కానున్న
ఈ ‘గూగుల్ ఫైబర్’ ద్వారా ఏక
కాలంలో 8 టీవీ షోలను లేదా
500 గంటల ప్రోగ్రామ్స్‌ను సేవ్
చేసుకోవచ్చు.
షార్ట్‌కట్స్ (పవర్‌పాయింట్ -
ఫార్మాటింగ్)
CTRL+U అండర్‌లైన్
చేయడానికి
CTRL+L లెఫ్ట్ జస్ట్ఫియింగ్
చేయడానికి
CTRL+E సెంటర్
జస్ట్ఫియింగ్ చేయడానికి
CTRL+R రైట్ జస్ట్ఫియింగ్
చేయడానికి
పనికిరాని పరిజ్ఞానం
ఆండ్రాయిడ్ ‘హిట్’ న్యూస్
1996లో చిన్న ప్రయోగాత్మక
ప్రాజెక్టుగా రూపొంది, ఆరంభమైన
గూగుల్ ప్రస్థానంలో ఆండ్రాయిడ్
అనేదొక అపురూపమైన
మైలురాయి. 2007లో
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను
ప్రవేశపెట్టింది గూగుల్. ఈ
ఆండ్రాయిడ్‌పై నేడు కనీసం 2
లక్షల పైచిలుకు ‘ఆప్స్’
లభిస్తున్నాయి. ఇప్పటిదాకా
ఆండ్రాయిడ్ మార్కెట్ నుంచి
డౌన్‌లోడైన ‘ఆప్స్’ సంఖ్య 5
బిలియన్ల పైమాటే. ఇక
ఆండ్రాయిడ్ డివైజ్‌లు రోజుకు
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని యాక్టివేట్
అవుతున్నాయో తెల్సా? 4
లక్షల పైమాటే! ఆండ్రాయిడ్
మార్కెట్ షేర్ 33 శాతం.
ఆండ్రాయిడ్ లేటెస్ట్ ‘జెల్లీ బీన్స్’
కూడా హిట్టే.
పద పారిజాతం
Resolution- గ్రాఫిక్స్ నాణ్యత
కోసం వాడే ప్రమాణం. మానిటర్
నాణ్యత ఏపాటిదో చెప్పేదిదే.
మానిటర్స్ స్క్రీన్స్‌మీద ఎన్ని
అడ్డగీతలు, ఎన్ని నిలువు గీతలు
ఉన్నాయి? ఏన్ని చుక్కలతో అవి
ఏర్పడుతూ ఉన్నారుూ? అని
చెప్పేదే రిజల్యూషన్.
ఉదాహరణకు 640న480
అంటే, లైనుకు 640 పిక్సెళ్ళ
చొప్పున 480 లైన్లలో
చూపుతుందని అర్థం. ఫొటోల
స్కానింగ్‌లో కూడా రిజల్యూషన్
ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎంత
ఎక్కువ రిజల్యూషన్‌లో స్కాన్
అయితే అంత చక్కని నాణ్యమైన
చిత్రాన్ని పొందవచ్చు.
RISC - రిస్క్ అనే కంప్యూటర్
నిర్మాణంలో ఒక పద్ధతి. రెడ్యూస్‌డ్
ఇన్‌స్ట్రక్షన్ సెట్ కంప్యూటింగ్
అనడానికి క్లుప్తరూపంగా రిస్క్
అంటారు.
ROM - అంటే రీడ్ ఓన్లీ మెమరీ
అని అర్థం. మెమెరీలో కేవలం
ఒకసారి మాత్రమే రాస్తారు.
పలుమార్ల దాన్ని చదవడానికి
వీలవుతుంది.
చిట్కా తెల్సుకోండి
బ్రౌజింగ్‌లో ఫాంట్‌తో తంటా
బ్రౌజింగ్ చేసేటపుడు, ముఖ్యంగా
(యాండ్రాయిడ్ బాపతు) వెబ్
పేజీలను చూసేటపుడు ఫాంట్
చిన్నదిగా కనిపించి ఇబ్బంది
పెడ్తోందా? మీ స్మార్ట్ ఫోన్‌లో
(యాండ్రాయిడ్ బాపతు) మెనూ,
కీలలో, మోర్‌లో సెట్టింగ్స్‌లోకెళ్ళి
టెక్ట్స్ సైజ్‌ను నార్మల్ నుంచి లార్జ్‌గా
మార్చుకుంటే కొంత పెద్ద అక్షరాలు
కనిపిస్తాయి. ఇదే పీసీల్లో బ్రౌజర్‌లో
కావస్తే, వ్యూ ఆప్షన్‌లో టెక్ట్స్ సైజ్
ఆప్షన్ చూడండి.
మీకు తెలుసా?
కీబోర్డు ‘కీ’పర్సన్ ఎవరూ?
నేడు ఆధునిక ఎలక్ట్రానిక్
ఉపకరణాలను దేన్ని ఎవరు
కనిపెట్టారూ? అనడిగితే అందరూ
ఏదో ఒక సమాధానాన్ని టక్కున
చెప్పేయగల్గుతున్నారు. కానీ
కీబోర్డు (కంప్యూటర్ కీబోర్డు)ను
ఎవరు కనుగొన్నారూ? అనడిగితే
ఖచ్చితమైన సమాధానం దొరకదు.
చరిత్ర పుటల్లోకెళితే, 1714లో
హెన్రీ మిల్ అనే బ్రిటన్ వాసి
అక్షరాలను కాగితంపై ముద్రించే
యంత్రానికి పేటెంట్ తీసుకొన్నాడు.
పెల్లెగ్రినొట్యురి అనే వ్యక్తి
టైప్‌రైటర్‌లాంటి సాధనాన్ని
రూపొందించాడు. 1829లో
మిరియం ఆస్టిన్ బర్ట్ -టైపోగ్రాఫర్
అనే పరికరాన్ని రూపొందించి
దానికి పేటెంట్ పొందాడు. లండన్
సైన్సు మ్యూజియం దీనే్న
చరిత్రలోని వివరించబడ్డ టైప్
రైటర్‌గా గుర్తించింది. కానీ తొలి టైప్
రైటర్ అని మాత్రం అనలేదు.
1867లో క్రిస్ట్ఫర్ లథామ్ షోల్స్
రూపొందించిన ‘టైప్ రైటర్’
మార్కెట్‌లో విజయవంతమైంది.
దానిలోని క్వర్టీ కీబోర్డే కంప్యూటర్
కీబోర్డుకీ ప్రామాణికం అయ్యింది.
అంతే.
యూఆర్‌ఎల్ ఏంటో?
రీనేమ్ మాయస్ట్రో
రీనేమ్ మాయస్ట్రో గురించి
చదివేరుగా? దీన్ని డౌన్‌లోడ్
చేసుకోవాలనిపించట్లేదూ?
ఎందుకనిపించదూ?
చాలాపయోగకరమైందేతేనూ?
దీన్ని యూఆర్‌ఎల్ ఏమిటో
కావాలిగా మరీ! ఇదీ దానికి అడ్రస్
http://renamemaistro.
en.softonic.com/
అలాగే, దీన్ని చాలా సైట్లనుంచే
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాంటిదే
t/ అనే సైటు. ఇంతెందుకూ?
గూగుల్‌కెళ్లి రీ నేమ్ మాయిస్ట్రో అని
టైప్ చేయండి. బోల్డు సైట్లు
వస్తాయి.
ప్రశ్న - జవాబు
గూగుల్ చానెల్‌లనే కాదు
Q. మొబైల్‌లో కమర్షియల్
ఎస్‌ఎంఎస్‌లను కూడా రాకుండా
చేయలేమా?
-రఘు, తిరుపతి (ఇమెయిల్
ద్వారా)
A. చేయవచ్చు. ఎన్‌డిఎన్‌సి- నేషనల్ డునాట్ కాల్ రిజిస్ట్రీ సర్వీసులో మీ మొబైల్ నెంబర్‌ను నమోదు చేసుకోండి.